మెహుల్ చోక్సీని భారత్‌‌కు అప్పగించడానికి డొమెనికా సిద్ధంగా ఉంది: ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’ ప్రధాని

మెహుల్ చోక్సీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ

డొమెనికాలో పట్టుబడిన భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగిస్తామని ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’ ప్రధాని గాస్టన్ బ్రౌన్ అన్నారు.

మెహుల్‌ను తిరిగి ‘ఆంటిగ్వా అండ్ బార్బుడా’కు పంపించకుండా నేరుగా భారత్‌కు అప్పగించాలని ఆయన డొమెనికాకు సూచించారు.

మెహుల్ చోక్సీ రూ.13,500 కోట్ల పీఎన్‌బీ కుంభకోణంలో నిందితుడు. ఆదివారం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి ఆయన కనిపించకుండాపోయారు. అప్పటి నుంచి స్థానిక పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు.

మెహుల్ ఒక పడవలో అక్రమంగా డొమెనికా వెళ్లుంటారని బ్రౌన్ అన్నారు.

వార్తా ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన బ్రౌన్.. "మా దేశం మెహుల్ చోక్సీని రానివ్వదు. ఆయన ఈ దీవి నుంచి వెళ్లి చాలా పెద్ద తప్పు చేశారు. డొమెనికా ప్రభుత్వం, అధికారులు మాకు సహకరిస్తున్నారు. ఆయన్ను అప్పగిస్తామని మేం భారత ప్రభుత్వానికి కూడా సమాచారం అందించాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారత్‌తో సంప్రదిస్తున్న డొమెనికా అధికారులు

మెహుల్ చోక్సీ జనవరి 2018 మొదటి వారంలో భారత్ నుంచి పారిపోయే ముందు 2017లో కరిబియన్ దేశాల్లో ఒకటైన ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. ఇన్వెస్ట్‌మంట్ ప్రోగ్రాం కింద ఆ దేశంలో పౌరసత్వం తీసుకోవచ్చు.

"డొమెనికా చోక్సీని తిరిగి పంపించడానికి సిద్ధంగా ఉంది. కానీ, మేం ఆయన్ను మా దేశంలోకి అనుమతించం. ఇక్కడి పౌరుడిగా ఆయనకు చట్టపరమైన, రాజ్యాంగబద్ధ రక్షణ ఉండడంతో మేం భారత్‌కు అప్పగించలేం. అందుకే మా దేశానికి పంపించవద్దని నేను డొమెనికా ప్రధాని, అధికారులను కోరాను" అన్నారు బ్రౌన్.

"మెహుల్‌ను అదుపులోకి తీసుకుని భారత్‌కు అప్పగించడానికి ఏర్పాట్లు చేయాలని నేను కోరుతున్నాను. ఆయన డొమెనికా పౌరసత్వం తీసుకున్నాడని నేను అనుకోవడం లేదు. అందుకే, ఆయన్ను అప్పగించడానిడి డొమెనికాకు ఎలాంటి సమస్యా ఉండదు" అని చెప్పారు.

చోక్సీ డొమెనికాలో దొరికారని ఆయన లాయర్ బుధవారం రాత్రి ధ్రువీకరించినట్లు ఇంతకు ముందు ఏఎన్ఐ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)