లయన్ కింగ్‌ 'ముఫాసా' వీర్యకణాలతో పుట్టిన 'సింబా'.... సింగపూర్ జూలో సంబరాలు

సింహం పిల్ల 'సింబా'

ఫొటో సోర్స్, Wildlife Reserves Singapore

ఫొటో క్యాప్షన్, సింహం పిల్ల 'సింబా'

కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా జన్మించిన తొలి సింహపు పిల్ల సింగపూర్ జూలో ప్రధాన ఆకర్షణగా మారింది. జంతు ప్రదర్శనశాల సిబ్బంది 'సింబా' రాకను సంబరంగా జరుపుకుంటున్నారు.

దురదృష్టవశాత్తు సింబా తండ్రి ముఫాసాను ఎప్పటికీ కలుసుకోలేదు. వృద్ధ సింహం ముసాఫా నుంచి వీర్యం సేకరించిన తర్వాత దానిని బ్రతికించలేకపోయారు.

ముసాఫాకు పుట్టిన ఏకైక కొడుకు సింబా. ఈ వృద్ధ సింహం దూకుడు వైఖరి వలన ఎప్పుడూ ఆడ సింహాలతో సమాగమం అవ్వడంలో విజయవంతం కాలేదు.

దీంతో, ఆ సింహపు వారసత్వాన్ని కొనసాగించేందుకు జూ అధికారులు గతంలో ఎన్నడూ అవలంబించని విధానాన్ని ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నారు.

సింబా

ఫొటో సోర్స్, Reuters

ముందుగా ఆ వృద్ధ సింహం వీర్యాన్ని కృత్రిమ గర్భధారణ కోసం సేకరించినట్లు జూ ప్రతినిధి చెప్పారు. దీనిని ఎలెక్ట్రో ఇజాక్యులేషన్ అంటారు.

ఈ ప్రక్రియ తర్వాత 20 ఏళ్ల ఫ్రెయిల్ ముఫాసాకు మత్తు ఇచ్చారు. ఈ సింహం వయసులో తన తోటి వారి కంటే 6 - 10 సంవత్సరాల పైనే పెద్దది. ఈ సింహం ముసలిది కావడం మాత్రమే కాకుండా వయసు రీత్యా వచ్చిన క్షీణతతో కూడా బాధపడుతోంది.

దాంతో ముఫాసాకు సునాయాసంగా మరణానికి లోనయ్యేటట్లు చేయాల్సిన అవసరమున్నట్లు జూ అధికారులు తెలిపారు.

ముఫాసా మత్తులో ఉండగా వీర్యాన్ని సేకరించారు. అతని వారసత్వాన్ని కొనసాగించేందుకు సింబా సిద్ధంగానే ఉంది. ఇప్పుడు దీనికి 3 నెలలు.

డిస్నీ సంస్థ నిర్మించిన క్లాసిక్ చిత్రం'ది లయన్ కింగ్' పేరుతో ఈ పెద్ద సింహానికి ముఫాసా అని పిలిచేవారు. ముఫాసా వారసుడిగా ఈ పిల్ల సింహానికి సింబ అనే పేరు పెట్టారు. సింబా గత అక్టోబరులో జన్మించింది. కానీ, ఈ వార్తను ప్రకటించడానికి జూ ఇప్పటి వరకు ఆగింది.

సింబా

ఫొటో సోర్స్, Wildlife Reserves Singapore

ఫొటో క్యాప్షన్, లయన్ కింగ్ సినిమా స్ఫూర్తితో సింబాకు ఆ పేరు పెట్టారు

సింబ తల్లి కాయలాకు గ్రంధులు వాచడం వలన పాలివ్వడం సాధ్యం కాకపోవడంతో సీసాతో పాలు పట్టవలసి వచ్చేది. కానీ, సింబాను తల్లికి దగ్గరగానే ఉంచేవారు.

సింబ ఆరోగ్యంగా, ఆసక్తికరంగా ఉండే చిన్న సింహంలానే పెరుగుతున్నాడని సింగపూర్ జూలో ఉన్న ది వైల్డ్ లైఫ్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ తెలిపింది.

పాలతో పాటు కొంచెం కొంచెం పచ్చి మాంసం తినడానికి సింబా ఇష్టపడుతోందని, సహజంగా పెరగడానికి ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులతో ఆడుకుంటోందని జూ అధికారులు తెలిపారు.

ముఫాసా జన్యువులను సింబకి బదిలీ చేయడం ద్వారా జన్యుపరమైన వైవిధ్యతకు విలువ పెరగడం మాత్రమే కాకుండా జంతు శాస్త్ర సంస్థల్లో ఆఫ్రికాకు చెందిన సింహపు జాతులు కొనసాగడానికి అవకాశం ఉంటుందని జూ అధికారులు చెప్పారు.

ఈ జాతిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ హానికి లోనయ్యే జాబితాలో చేర్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)