కరోనావైరస్: సోషల్ డిస్టెన్సింగ్ కోసం కోళ్ల పెంట చల్లుతున్న అధికారులు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ సమయంలో ప్రజలు ఒకే చోట గుమిగూడకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపడుతున్నాయి. అయినా, ఉత్సవాలు, వేడుకల పేరుతో అక్కడక్కడా ప్రజలు పోగవుతున్నారు.
స్వీడన్‌లోనూ ఓ ఉత్సవం సందర్భంగా జనాలు గుమిగూడే అవకాశాలు ఉండడంతో అక్కడి అధికారులు ఎవరూ ఊహించని చర్యలు తీసుకున్నారు.
వేడుకల కోసం ఒక్కచోట గుమిగూడకుండా జనాలను కట్టడి చేసేందుకు స్వీడన్‌లోని లుండ్ పట్టణం సెంట్రల్ పార్కులో కోళ్ల రెట్టను చల్లాలని అధికారులు నిర్ణయించారు.
ఉత్తర ఐరోపాలోని స్కాండినేవియా ప్రాంతంలో వాల్‌పూర్గిస్ నైట్ వేడుకల కోసం దక్షిణాదిన ఉన్న లుండ్ పట్టణానికి ఏటా వేలాది మంది తరలివస్తుంటారు.
అయితే, ఈసారి కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలందరూ ఈ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
స్వీడన్‌లో లాక్‌డౌన్ అమలు చేయడంలేదు. అయినా, ఇక్కడి ప్రజల్లో అత్యధిక శాతం మంది స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తున్నారు.
వాల్‌పుర్గిస్ నైట్ వేడుకలు ఏప్రిల్ 30 రాత్రి నుంచి మే 1 వరకు చేసుకుంటారు.

- కరోనావైరస్ లక్షణాలు: ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

"ఈ వేడుకల కోసం జనాలు పెద్దఎత్తున గుమిగూడితే కరోనావైరస్ వ్యాప్తికి లుండ్ పట్టణం కేంద్రంగా మారే ప్రమాదం ఉంది" అని పట్టణ పర్యావరణ కమిటీ చైర్మన్ గుస్తావ్ హెచ్చరించారు.
అందుకే, జనాలు గుమిగూడకుండా చేసేందుకు ఒక టన్ను కోళ్ల పెంటను తీసుకొచ్చి సెంట్రల్ పార్కులో చల్లాలని స్థానిక కౌన్సిల్ నిర్ణయించింది.
"పార్కులో గడ్డికి, మొక్కలకు ఎరువు వేసే అవకాశం మాకు దొరికింది. కోళ్ల పెంట వల్ల పార్కులో దుర్వాసన వస్తుంది. కాబట్టి అందులో కూర్చుని బీరు తాగడం అంత మంచిది కాకపోవచ్చు" అని గుస్తావ్ అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్‌డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








