కరోనావైరస్: బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కోవిడ్-19 నిర్ధరణ

చార్లెస్

ఫొటో సోర్స్, Reuters

వేల్స్ యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు క్లారెన్స్ హౌస్ ధ్రువీకరించింది.

71 ఏళ్ళ ప్రిన్స్ చార్లెస్‌లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని, "అది కాకుండా ఆయన ఆరోగ్యం బాగుంది" అని ఒక అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రిన్స్ చార్లెస్ భార్య 72 ఏళ్ళ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధరణ అయింది.

బ్రిటన్ రాణి తన కుమారుడిని మార్చి 12న చివరిసారిగా కలిశారని, "ఆమె ఆరోగ్యంతో ఉన్నారు" అని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.

"ఆరోగ్య సంరక్షణ కోసం రాణి వైద్య సలహాలను పాటిస్తున్నారు" అని కూడా ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.

క్లారెన్స్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, "ఆబర్డీన్‌షైర్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది" అని వెల్లడించింది.

చార్లెస్, కామిలా ఇద్దరూ స్కాట్లండ్‌లోని బాల్మోరల్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, యువరాజుకు ఎవరి నుంచి వైరస్ సోకి ఉంటుందన్నది చెప్పలేమని క్లారెన్స్ హౌస్ తెలిపింది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?
పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)