ఐరాస వేదికపై ఎవరు విజయం సాధించారు.. మోదీనా లేక ఇమ్రాన్ ఖానా

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి 74వ సర్వసభ్య సమావేశాల్లో (యూఎన్‌జీఏ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ప్రసంగించారు. భారత్, పాకిస్తాన్‌లతోపాటు ప్రపంచ దేశాల ప్రజలు ఈ ప్రసంగాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మరోవైపు విశ్లేషకులు సైతం ప్రసంగం ఇలా ఉండబోతోందని.. అలా ఉండబోతోందని అంచనాలు వేశారు.
ప్రపంచ శాంతి, ఉగ్రవాదంతో పొంచివున్న సవాళ్లపై ప్రసంగంలో మోదీ ప్రధానంగా దృష్టిసారించారు. పాకిస్తాన్ పేరును నేరుగా ఆయన ప్రస్తావించలేదు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రపంచ నాయకుల ముందు ఆయన వివరించారు. మరోవైపు పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ అంశాన్ని ఇమ్రాన్ లేవనెత్తారు. భారత్, పాక్‌ల మధ్య యుద్ధం జరిగితే సంభవించే విధ్వంసంపై ప్రపంచ దేశాలను ఆయన హెచ్చరించారు.
- అసలు పాకిస్తాన్ గురించి నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడలేదు? కేవలం అంతర్జాతీయ అంశాలు, తమ ప్రభుత్వ విజయాలపైనే ఎందుకు దృష్టిసారించారు?
- దీనికి పూర్తి విరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్.. కశ్మీర్ అంశంపైనే ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? తమ దేశానికి సంబంధించిన వేరే అంశాలను ఎందుకు ప్రస్తావించలేదు?

ఈ ప్రసంగాలను లోతుగా విశ్లేషించేందుకు అమెరికాలోని డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ముక్తెదర్ ఖాన్, అమెరికాకు భారత రాయబారిగా పనిచేసిన నవతేజ్ సర్న, సీనియర్ పాకిస్తానీ జర్నలిస్టు హరూన్ రషీద్‌లను బీబీసీ సంప్రదించింది. వారి అభిప్రాయాలు ఇక్కడ చదవండి:
మోదీ ప్రసంగంపై ముక్తెదర్ అభిప్రాయం
మూడు, నాలుగు ప్రధాన అంశాలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని ప్రపంచానికి గుర్తుచేయడం వీటిలో మొదటిది. మోదీ, ఆయన పార్టీ ఇటీవల ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఓట్లతో ఎన్నికైన రాజకీయ నాయకుడు తనేనని ఆయన సంకేతాలిచ్చారు.
పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి? వాతావరణ మార్పులను ఎలా అడ్డుకోవాలి లాంటి ప్రశ్నలకు ప్రపంచానికి భారత్ సమాధానాలు చూపించాలని అనుకుంటున్నట్లు మోదీ చెప్పారు.
భారత్ అభివృద్ధి పథంలో వెళ్తోందని చెప్పేందుకు తమ ప్రభుత్వ విధానాలను ఉదహరించారు. అయితే కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా వినిపిస్తున్న వాదనలపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం విధించిన ఆంక్షల గురించీ మోదీ మాట్లాడలేదు.
భారత్ విషయంలో లేవనెత్తిన ఇతర ప్రశ్నల గురించి ఆయన స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి పరిరక్షణలతోపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. అయితే తమ సొంత పార్టీ నాయకులే దేశంలోని మైనార్టీ వర్గాలతో వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
సౌభ్రాతృత్వం, ప్రపంచ శాంతి పరిరక్షణలపై ప్రపంచ దేశాలకు పాఠాలు చెప్పాలంటే.. మొదట అన్ని వర్గాల మధ్య సామరస్యం పెంపొందించే విధానాలను తమ దేశంలో అమలు చేయాలి. ఇదే ఆదర్శంగా నిలిచేందుకు అత్యుత్తమ మార్గం.
మరోవైపు పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి కూడా నరేంద్ర మోదీ పెదవి విప్పలేదు.
పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఎలాంటి విధానాలను అనుసరిస్తున్నారో కూడా ఆయన చెప్పలేదు.
ఇటీవల కాలంలో పెట్టుబడులు కూడా తగ్గిపోయాయి. ఇది భారత్‌తోపాటు అంతర్జాతీయ సంస్థలకూ ఆందోళన కలిగించే పరిణామమే.
ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడినపడుతుందని ప్రపంచ దేశాలకు భరోసా ఇచ్చేందుకు ఈ వేదిక ఆయనకు మంచి అవకాశం కల్పించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సర్వప్రతినిధి సభలో లోతైన అంశాలపై చర్చలు జరుగుతాయి. ఫ్రాన్స్, చైనా, రష్యా నాయకుల వాదనలను ఇక్కడ వినాలని ప్రపంచ నాయకులు భావిస్తుంటారు.
దీంతో అంతర్జాతీయ అంశాలపై మాట్లాడేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నించారు. అయితే తొలి మాటల్లో మాత్రం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ఆయన అనుకరిస్తున్నట్లు అనిపించింది.
ఆయనపై ఆయనే పొగడ్తలు కురిపించుకున్నారు. భారీగా ప్రజల మద్దతు తమకుందని అనడంతోపాటు తమ విజయాలను వరుసపెట్టి చెప్పుకొచ్చారు.
నాకైతే.. ఇది సొంత నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తున్నట్లు అనిపించింది.
భారత్‌ను ప్రపంచ నాయకుడిగా చూపించే అద్భుత అవకాశం నరేంద్ర మోదీకి వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవడంలో మోదీ విఫలమయ్యారు.
మోదీ ప్రసంగంపై నవతేజ్ సర్న అభిప్రాయం
అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. తమ హయాంలో మొదలుపెట్టిన పథకాలు ఎలా విజయవంతం అయ్యాయి? అనే అంశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.
ప్రజల భాగస్వామ్యంతో చేకూరే సానుకూల ప్రభావాలు, సమైక్య అభివృద్ధి గురించి మోదీ మాట్లాడారు. వీటిని సాధించేందుకు భారత్ అనుసరిస్తున్న విధానాలు ఐరాస మార్గదర్శకాలతో ఎలా మమేకమయ్యాయో వివరించారు.
వాతావరణ మార్పులపై కూడా మోదీ మాట్లాడారు.

ఫొటో సోర్స్, Getty Images
తలసరి ఉద్గారాల స్థాయిలో భారత్ కాలుష్యం తక్కువగా ఉన్నప్పటికీ.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 450 గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మోదీ చెప్పారు.
సౌరశక్తి కోసం అంతర్జాతీయ కూటములు కూడా ఏర్పడ్డాయి. విపత్తులను తట్టుకొనే నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వడమూ పెరుగుతోంది.
''సర్వ ప్రతినిధి సభ ఆదర్శాలకు అనుగుణంగానే..'' శాంతి, అహింసలపై విశ్వాసమున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఐరాస శాంతి పరిరక్షణ చర్యల్లో ముందుండటంతోపాటు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ఉగ్రవాదం ఎలా సవాల్‌గా మారిందో మోదీ చెప్పారు. అందుకే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నట్లు వివరించారు.
ఇది పెను సవాల్‌అని, అందుకే ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఉగ్రవాద మద్దతు లేదా ప్రేరేపిత దేశంగా ఆయన పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు.
ఆయనెంతో హుందాగా వ్యవహరించారు. ఉగ్రవాదాన్ని ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ మానవాళికి ముప్పుగా అభివర్ణించారు. ఇది ప్రపంచ సమస్యని, అంతర్జాతీయ సహకారం అవసరమని వివరించారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు గురించి మోదీ ప్రస్తావించలేదు. ఇది అంతర్గత విషయమని ఎప్పుడో భారత్ స్పష్టంచేసింది. దీంతో ఈ అంశంపై ఆయన మాట్లాడతారని ఎవరూ అనుకోరు.

ఫొటో సోర్స్, Getty Images
మహాత్మా గాంధీ 150వ జయంతి నేపథ్యంలో ఆయన నుంచి ఎలా స్ఫూర్తి పొందారో మోదీ వివరించారు. 125ఏళ్లనాటి స్వామి వివేకానంద సందేశం ''సామరస్యం, శాంతి'' గురించి కూడా మోదీ ప్రస్తావించారు. నేటికీ భారత్ దీన్ని ఎలా పాటిస్తుందో చెప్పారు.
''పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, పర్యావరణ మార్పుల కట్టడిలో భాగస్వామ్యానికి భిన్న స్థాయిల్లో కృషి''అనేది సర్వప్రతినిధి సభ 74వ సమావేశాల థీమ్.
దీనికి అనుగుణంగా మోదీ ప్రసంగం సాగింది.
అభివృద్ధి కోసం భారత్ చేస్తున్న కృషిని ప్రపంచ దేశాల ఉమ్మడి కృషిగా మోదీ అభివర్ణించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు దీన్నుంచి స్ఫూర్తి పొందొచ్చు.
ఇమ్రాన్ ప్రసంగంపై హరూన్ రషీద్ అభిప్రాయం
సర్వ ప్రతినిధి సభలో మూడు, నాలుగు అంశాలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. అయితే ఆయన ప్రధానంగా దృష్టి సారిచింది మాత్రం కశ్మీర్ పైనే.
కశ్మీర్‌పై తాను ఎప్పుడూ చెప్పే అంశాలనే ప్రసంగంలోనూ ఇమ్రాన్ చెప్పారు. అయితే ప్రత్యేకత ఏంటంటే.. ఇది అంతర్జాతీయ వేదిక. ఇక్కడ చెప్పే అంశాలను ప్రపంచ దేశాలు తీక్షణంగా గమనిస్తుంటాయి.
భారత్, పాకిస్తాన్ నడుమ యుద్ధంలాంటి పరిస్థితులే వస్తే.. రెండు దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ ప్రభావితం అవుతాయని ఇమ్రాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలను హెచ్చరించాలని ఆయన ప్రయత్నించారు.
ప్రపంచ దేశాలపై ఆయన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు ఐరాస ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో గమనించాలి.
ఐరాస వేదికగా కశ్మీర్‌పై ఇమ్రాన్ మాట్లాడిన తీరుపై పాకిస్తాన్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఇమ్రాన్ సఫలం కాలేదు''
ప్రసంగ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇమ్రాన్ విఫలమయ్యారనే చెప్పాలి. కశ్మీర్‌లో కర్ఫ్యూను ఎత్తివేయాలని ఆయన అడుగుతున్నారు.
13,000 మంది కశ్మీరీ యువతను భారత్ నిర్బంధించిందని ఇమ్రాన్ ఆరోపించారు. అందరినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
ప్రసంగం పూర్తయిన రెండ్రోజుల్లో ఈ డిమాండ్లన్నీ నెరవేరితే ఆయన విజయం సాధించినట్టే. అయితే ఇది జరిగేందుకు అవకాశాలు చాలా తక్కువ.
ప్రసంగాలు ఇవ్వడం, కోపాన్ని చూపించడం, హెచ్చరికలు చేయడంతో సాధించేది ఏమీ ఉండదు. మనం చెప్పేది ప్రపంచ దేశాలు ఎలా తీసుకుంటున్నాయన్నదే ముఖ్యం.
ఇప్పటివరకు కేవలం అమెరికా మాత్రమే దీనిలో జోక్యం చేసుకోగలదని స్పష్టమైంది.
అయితే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఎవరి పక్షానా నిలవడం లేదు. ఆయన పాక్‌తోపాటు భారత్‌నూ సంతోషపెట్టాలని అనుకుంటున్నారు.
అమెరికా అధ్యక్షుడే ఇలా వ్యవహరిస్తుంటే... భారత్‌కు వ్యతిరేకంగా మిగతా దేశాలు గట్టి చర్యలు తీసుకుంటాయని చెప్పడం కష్టమే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''సంతృప్తికరంగానే..''
పాకిస్తాన్ వేదికలపై ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాలు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పే మాటలు.. ఐరాస వేదికపై మాట్లాడకుండా ఉంటే మేలని ఇక్కడి ప్రజలు భావించారు.
కశ్మీర్‌తోపాటు వాతావరణ మార్పులు, ఇస్లామోఫోబియా లాంటి అంతర్జాతీయ అంశాలకే ఆయన ప్రసంగం పరిమితం అయితే బావుంటుందని అంతా అనుకున్నారు.
అయితే కొన్నిసార్లు అవినీతి లాంటి అంశాలను ఇమ్రాన్ ప్రస్తావించారు. పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాలను అక్కడ చర్చించొద్దని ప్రతిపక్షం కూడా పదేపదే చెప్పింది.
అంతర్గత అంశాలను ఎక్కువగా ప్రస్తావించకపోవడంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. జర్దారీ లేదా నవాజ్ షరీఫ్‌ల గురించి ప్రస్తావించకపోవడంపై ప్రతిపక్షాలు కూడా సంతృప్తిగానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- మోదీ విమానానికి పాకిస్తాన్ అనుమతివ్వకపోవడం సరైన చర్యేనా? నిషేధించే హక్కు పాక్‌కు ఉందా?
- సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికే వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు
- హాంగోవర్ కూడా ఒక జబ్బే: జర్మనీ కోర్టు తీర్పు
- సౌర విద్యుత్ చరిత్ర: 3000 ఏళ్ల క్రితమే చైనాలో సౌరశక్తి వినియోగం
- భారతదేశంలో నమోదైన మాతృ భాషలు 19,569 - హిందీ కింద వర్గీకరించిన మాతృభాషలు ఎన్ని?
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








