విరాట్ కోహ్లీ: స్టీవ్ స్మిత్‌ను అభినందించాలని భారత అభిమానుల్ని ఎందుకు కోరాడు?

ఫొటో సోర్స్, twitter/imransolanki313
ఆదివారం ఓవల్ మైదానంలో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు భారత అభిమానులు, ప్రేక్షకులు అతన్ని గేలి చేశారు.
ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ దృశ్యాలను చూశాడు. ఓవర్ ముగియగానే.. అభిమానులవైపు చేతులు ఊపుతూ.. స్మిత్‌ను అభినందించండి అంటూ తన చేతులతో చప్పట్లు కొడుతూ సైగలు చేశాడు.
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఈ చర్య.. క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులు, అభిమానుల్లో చర్చకు తెరతీసింది. ఆస్ట్రేలియా ఆటగాడికి మద్దతు తెలపాలంటూ భారత అభిమానుల్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోరడాన్ని అందరూ అభినందిస్తున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘గతంలో జరిగిందేదో జరిగిపోయింది’’ అని కోహ్లీ అన్నాడు.
‘‘గతంలో మా మధ్య కొన్ని గొడవలు ఉండేవి, మైదానంలో మేం వాదనలకు దిగాం. కానీ, ఆటాడేందుకు సిద్ధమైన ప్రతిసారీ అదే వేడిని ఒక ఆటగాడు అనుభవించాలని కోరుకోకూడదు’’ అని చెప్పాడు.
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన స్మిత్ ప్రపంచకప్ సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలోనే ప్రేక్షకులు అతడిని వెక్కిరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అయితే, స్మిత్‌కు మద్దతుగా కోహ్లీ అభిమానులకు సైగలు చేసిన వీడియో క్లిప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్వీట్ చేసింది. దీన్ని క్రికెట్ అభిమానులు 28 వేలకు పైగా రీట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3
అలాగే, కోహ్లీ చర్యను సమర్థిస్తూ #SpiritOfCricket (క్రికెట్ స్ఫూర్తి) పేరిట ట్విటర్‌లో ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. కోహ్లీని గతంలో ‘దురహంకారి’ అని విమర్శించినవాళ్లను తిప్పికొడుతూ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తనకు మద్దతుగా నిలిచిన కోహ్లీకి మైదానంలోనే చేయి కలిపి, భుజం తట్టి స్మిత్ కృతజ్ఞతలు చెప్పాడు.
కోహ్లీ చర్యపై స్మిత్ ఇంత వరకూ మాట్లాడలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఈ ప్రపంచకప్‌లో స్మిత్ బాగా ఆడుతున్నాడు. భారత్‌పై ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 69 పరుగులు చేసిన స్మిత్, అంతకు ముందు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు.
‘‘ఆస్ట్రేలియాతో ఆడేప్పుడు విలన్‌గా కనిపించే విరాట్ కోహ్లీ, ఇప్పుడు స్నేహ బంధాన్ని ప్రదర్శించాడు’’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక అభినందించింది.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్‌కు యవరాజ్ సింగ్ గుడ్‌బై
- గాడిద లాగే టాబ్లెట్ కంప్యూటర్‌తో ప్రజలకు డిజిటల్ అక్షరాస్యత
- టీమిండియాను ఉత్సాహపరిచే అభిమాన 'సైన్యం' భారత్ ఆర్మీ
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- 'బలిదాన్' కీపింగ్ గ్లవ్స్ మార్చిన మహేంద్ర సింగ్ ధోనీ
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- జింగ్ బెయిల్స్: ‘బాల్ వికెట్లకు తగిలినా బెయిల్స్ పడకపోవడం ఈ ప్రపంచకప్‌లో ఇది ఐదోసారి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)