వరల్డ్ కప్ 2019: ఆ జింగ్ బెయిల్స్‌కి ఏమైంది? బాల్ వికెట్లకు తాకినా అవి కింద పడట్లేదు

ఫొటో సోర్స్, Getty Images
353 పరుగుల భారీ స్కోరును ఛేజ్ చేసేందుకు ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ మైదానంలోకి వచ్చారు. భువనేశ్వర్ కుమార్ వేసి మొదటి ఓవర్‌లో మూడు పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ వేసేందుకు బుమ్రా సిద్ధమయ్యాడు. వార్నర్ బ్యాటింగ్. మొదటి బంతి పడింది.. బ్యాట్‌ను బంతికి తాకించిన వార్నర్ వెంటనే షాకయ్యాడు. బుమ్రా కూడా షాక్‌లో ఉన్నాడు. భారత జట్టు సభ్యులంతా ఏం చేయాలో పాలుపోక కొద్ది సేపు బంతి వంకే చూశారు. ఎందుకంటే.. బ్యాట్‌కు తగిలిన బంతి వెంటనే వికెట్లను తాకింది. కానీ, బెయిల్స్ మాత్రం కిందపడలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘బంతి స్టంప్స్‌కు తాకినా బెయిల్స్ కింద పడకపోవడం ఈరోజుతో ఐదోసారి. ఐదు సార్లు.. ఈ ప్రపంచకప్‌లోనే. ఏం జరుగుతోంది? ఒక టోర్నమెంట్‌లో, అదీ 10 రోజుల వ్యధిలో మాత్రమే కాదు.. నా జీవితంలో ఎప్పుడూ ఐదుసార్లు ఇలా జరగడం చూడలేదు’’ అని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అఖ్తర్ ట్వీట్ చేశాడు.
ఇప్పుడు జింగ్ బెయిల్స్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘మళ్లీమళ్లీ జరిగితే ఎలా?’
‘బెయిల్స్ విషయంలో.. ఇది మళ్లీ మళ్లీ ఇలాగే జరిగితే ఎలా? ఈ రోజుల్లో బౌలర్‌గా ఉండటం చాలా కష్టమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చాలి’ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘బెయిల్స్ రాళ్లలాగా బరువుగా ఉన్నాయి’
‘‘ఈ బెయిల్స్ రాళ్లలాగా గట్టిగా, బరువుగా ఉన్నాయి. బ్రిస్టోల్‌లో శుక్రవారం నేను ఒకదాన్ని పట్టుకుని చూశా. కార్బెర్ (సానబెట్టిన చెట్టు కొమ్మ)ను పైకెగరేసినట్లు ఉంది’’ అని లండన్‌లోని క్రికెట్ విశ్లేషకుడు సైమన్ మన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
‘ఐపీఎల్‌లో వాడినవే.. సమస్యేం లేదన్నారు’
‘‘ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జింగ్ బెయిల్స్ గురించి నేను ప్రశ్నించాను. ఐపీఎల్‌లో వాడినవే వాడుతున్నారా అని అడిగా. ఔను అని సమాధానం ఇచ్చారు. ఎలాంటి సమస్యా లేదన్నారు. కానీ, సమస్య ఉంది. అది ఇంకా ముదురుతోంది. ఇప్పటికి నాలుగుసార్లైనా ఇలా జరిగి ఉంటుంది. బంతి వికెట్లకు తగిలినా బెయిల్స్ మాత్రం కింద పడట్లేదు’ అని బ్రిటన్ విలేకరి జాన్ ఎతెరిడ్జ్ ట్వీట్ చేశారు.
‘అవి రెగ్యులర్ బెయిల్స్ లాంటివే’ - ఐసీసీ
కాగా, జింగ్ బెయిల్స్ కూడా సాధారణ బెయిల్స్ లాగే పనిచేస్తాయని, బాగా గాలి వీచేప్పుడు అంపైర్లు వాడే బెయిల్స్ కంటే ఇవే తేలికగా ఉంటాయని పైగా బంతి తగిలితే వెలుగుతాయని ఐసీసీ గత వారం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కీపింగ్ గ్లవ్స్ మార్చిన మహేంద్ర సింగ్ ధోనీ
- #INDvAUS ఆస్ట్రేలియా 316 ఆలౌట్.. 36 పరుగులతో భారత్ విజయం
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- వరల్డ్ కప్‌లో 10 జట్లే ఉండటానికి బీసీసీఐ అత్యాశే కారణమా
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)