క్రికెట్ వరల్డ్ కప్ 2019: రంగుల జెర్సీలు ఎలా వచ్చాయి... వాటి నంబర్ల వెనుక కథేంటి... శ్రీలంక జెర్సీ ఎందుకంత ప్రత్యేకం?

ఆస్ట్రేలియాలో 1985లో ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో గెలిచిన అనంతరం ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాలో 1985లో ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో గెలిచిన అనంతరం ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు.
    • రచయిత, ప్రవీణ్ కాసం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మెన్ ఇన్ బ్లూ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది భారత క్రికెట్ జట్టు. 10వ నంబర్ చూడగానే మన మదిలో మెదిలేది సచిన్ టెండూల్కర్.

ప్రతీ దేశ క్రికెట్ జట్టు వన్డేలు, టీ20లలో తమకంటూ ప్రత్యేకంగా కేటాయించిన రంగుల జెర్సీలతోనే మ్యాచ్‌లు ఆడుతుంది.

ఇంతకీ ఈ రంగురంగుల జెర్సీలు క్రికెట్‌లోకి ఎలా వచ్చాయి. వాటిపై ఉండే నంబర్ల వెనక కథేంటి?

కెర్రీ ప్యాకర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియాకు చెందిన మీడియా దిగ్గజం కెర్రీ ప్యాకర్ అప్పట్లోనే ఐపీఎల్ తరహాలో వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 1977లో అనధికార టెస్టు, వన్డే మ్యాచ్‌లను ప్రారంభించారు.

అలా మొదలైంది

నిజానికి ఇప్పటికీ టెస్టు క్రికెట్‌లో రంగుల జెర్సీలు లేవు. వన్డేలు, ట్వంటీ20లలోనే కలర్ జెర్సీలు మనకు కనిపిస్తాయి. అయితే, త్వరలో టెస్టు క్రికెట్‌ కూడా రంగుల మయం కాబోతోంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రంగుల జెర్సీలు వాడటం ఆస్ట్రేలియాతో మొదలైంది.

ఆస్ట్రేలియాకు చెందిన మీడియా దిగ్గజం కెర్రీ ప్యాకర్ అప్పట్లోనే ఐపీఎల్ తరహాలో వరల్డ్ సిరీస్ క్రికెట్ పేరుతో 1977లో అనధికార టెస్టు, వన్డే మ్యాచ్‌లను ప్రారంభించారు.

అప్పుడప్పుడే కలర్ టెలివిజన్‌లు రాక మొదలవుతున్న దశలో తన క్రికెట్ సిరీస్‌కు టీవీలలో మరింత ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో వన్డేలలో రంగుల జెర్సీలను ప్రవేశపెట్టాడు. ఒక విధంగా కలర్ జెర్సీలకు ఇతనే ఆద్యుడని చెప్పుకోవాలి.

కెర్రీ ఆలోచనను 1980లలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆచరణలో పెట్టింది. తన ఆటగాళ్లకు కలర్ జెర్సీలను కేటాయించింది.

1983లో భారత్ క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచిన సమయంలో సంప్రదాయ తెలుపు రంగు జెర్సీలతోనే ఆడింది. 1985 తొలినాళ్లలో భారత జట్టు కలర్ జెర్సీలతో వన్డేలు ఆడటం ప్రారంభించింది.

కలర్ జెర్సీలతో 1992లో తొలిసారిగా అన్ని దేశాలు వరల్డ్ కప్ ఆడాయి. ఈ ప్రపంచం కప్‌లో పాకిస్తాన్ విశ్వవిజేతగా నిలిచింది.

ఇప్పుడు అన్ని దేశాల క్రికెట్ జట్లు తమకంటూ ప్రత్యేకంగా కేటాయించిన రంగుల జెర్సీలతోనే వన్డే, 20ట్వంటీలు ఆడుతున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో శ్రీలంక జెర్సీ

ఈసారి ప్రపంచకప్‌లో శ్రీలంక క్రికెటర్లు ధరించిన జెర్సీలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఎందుకంటే శ్రీలంక ఆటగాళ్లు వాడుతున్న జెర్సీలను సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, సముద్ర జీవుల ఆవాసాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. శ్రీలంక నేవీ అధికారుల సహాయంతో సముద్రతీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి ప్రత్యేకంగా ఈ జెర్సీలను తయారు చేశారు.

ఓ భారతీయ కంపెనీ సహకారంతో తాము ఈ జెర్సీలను తీసుకొచ్చినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది.

జెర్సీ నంబర్లు

ఫొటో సోర్స్, Getty Images

జెర్సీ నంబర్లు... ఎన్నో విశేషాలు

రంగుల జెర్సీల తర్వాత వాటిపై ప్రతీ ఆటగాడికి ప్రత్యేకంగా నంబర్ల కేటాయించే సంప్రదాయం కూడా వన్డేలలో వచ్చేసింది. 20ట్వంటీలలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఆటగాడికి ఏ నంబర్ జెర్సీ కేటాయించాలనేదానికి ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో చాలా మంది ఆటగాళ్లు వాళ్లకు నచ్చిన లేదా న్యూమరాలజీని అనుసరిస్తూనో ఇంకేదో కారణంతో నంబర్లను తీసుకుంటున్నారు.

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యేవరకు 10వ నంబర్ జెర్సీతోనే ఆడాడు.

కెప్టెన్ ధోనీ 7వ నంబర్ జెర్సీ ధరిస్తుంటాడు. అతడి పుట్టిన రోజు, నెల కూడా 7 కావడం విశేషం.

భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చాలా సార్లు తన జెర్సీ నంబర్‌ను మార్చాడు. ఒకసారి 1, తర్వాత 99 నంబర్ జెర్సీతో ఆడితే ఆ తర్వాత 47, 24వ నంబర్ జెర్సీలతోనూ ఆడాడు.

గిబ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా ఆటగాడు 2000లో ‘00‘ నంబర్ జెర్సీ ధరించేవాడు.

00 నుంచి 730 వరకు

దక్షిణాఫ్రికా ఆటగాడు హర్షల్ గిబ్స్ జెర్సీ నంబర్లను ఎక్కువగా మార్చుతాడనే పేరుంది. 2000లో 00 నంబర్ జెర్సీతో ఉంటే 2001లో 01వ నంబర్ జెర్సీతో ఆడాడు. ఆ తర్వాత కూడా చాలా నంబర్లు మార్చాడు.

మరికొందరు క్రికెటర్లు తమ జెర్సీ మీద మూడు అంకెల నంబర్లు వచ్చేలా చూసుకుంటున్నారు.

శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో తీసుకున్న వికెట్లకు గుర్తుగా 800వ నంబర్ జెర్సీతో ఐపీఎల్ ఆడేవాడు.

మార్లోన్ శామ్యూల్స్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 730 రోజుల తర్వాత జాతీయ జట్టులో మళ్లీ చోటు దొరకడంతో దానికి గుర్తుగా అదే నెంబర్ జెర్సీని మార్లోన్ శామ్యూల్స్‌ ధరించాడు.

వెస్టిండిస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడు కొన్నాళ్లు జాతీయ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. జాతీయ జట్టులో తన పునరాగమనం తర్వాత 730 నంబర్ జెర్సీతో ఆడాడు. 730 రోజుల తర్వాత జాతీయ జట్టులో చోటు దొరకడంతో దానికి గుర్తుగా ఈ నెంబర్ జెర్సీని ధరించాడు.

టీం ఇండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యా 228 వ నంబర్ జెర్సీని ధరిస్తుంటాడు. ఇందుకు కారణం అండర్ 16 క్రికెట్‌లో బరోడా తరఫున ఆడిన పాండ్యా ఒక మ్యాచ్‌లో 228 పరుగులు చేశాడు. ఇది అతని ఆటను మలుపుతిప్పింది. దీంతో 228 నంబర్‌ను పాండ్యా తన జెర్సీ మీదకు తెచ్చుకున్నాడు.

వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు 333 నంబర్ జెర్సీ ధరిస్తుంటాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గేల్ 333 పరుగులు చేశాడు. ఆ రికార్డుకు గుర్తుగా అదే నంబర్ జెర్సీతో ఆడుతుంటాడు.

సచిన్ టెండూల్కర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీసీసీఐ 10వ నంబర్ జెర్సీకి అనధికారికంగా రిటైర్మెంట్ ఇచ్చింది.

10వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్

భారత బౌలర్ శార్దూల్ టాగోర్ 2017లో శ్రీలంకతో ఆడుతున్న వన్డేలో 10వ నెంబర్ జెర్సీ వేసుకున్నాడు. దీంతో అతడిపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం మొదలైంది. ఆ నంబర్ జెర్సీ ఎలా వేసుకుంటావని కొందరు నెటిజన్లు శార్దూల్‌పై మండిపడ్డారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యేవరకు 10వ నెంబర్ జెర్సీనే వాడాడు. అభిమానులు కూడా 10వ నంబర్ జెర్సీ అంటే సచిన్‌ అన్నట్లు నిర్ణయానికి వచ్చారు.

అందుకే శార్దూల్ ఆ నంబర్ జెర్సీని వాడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. శార్దూల్ వివాదం తర్వాత బీసీసీఐ 10వ నంబర్ జెర్సీకి అనధికారికంగా రిటైర్మెంట్ ఇచ్చింది. అంటే ఇకపై ఏ భారత క్రికెటర్ ఆ నంబర్ జెర్సీ వేసుకోకుండా నిషేధం విధించింది.

ఆస్ట్రేలియా కూడా 64వ నంబర్ జెర్సీకి అనధికారికంగా రిటైర్మెంట్ ఇచ్చింది. ఆ దేశ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఒక మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడి చనిపోయిన విషయం తెలిసిందే. అతనికి గుర్తుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 64వ నంబర్‌ జెర్సీని శాశ్వతంగా ఎవరికీ కేటాయించకూడదని నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)