యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా

ఫొటో సోర్స్, twitter/ReSet_YouTuber
స్పెయిన్‌లో ప్రాంక్ వీడియో చేసి కాంగువా రెన్ అనే యూట్యూబర్ చిక్కులు కొనితెచ్చుకున్నాడు.
ఓరియో బిస్కెట్లలో క్రీమ్‌కు బదులు టూత్‌పేస్టు పెట్టి, ఓ నిరాశ్రయుడి (హోమ్‌లెస్)తో తినిపించినందుకు అతడికి బార్సిలోనా కోర్టు 15 నెలల జైలుశిక్ష విధించింది. బాధిత వ్యక్తికి రూ.15లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
రెన్ ఇచ్చిన ఆ బిస్కెట్లు తిన్న తర్వాత బాధిత వ్యక్తి వాంతులు చేసుకున్నారు.
రెన్ చర్యను కోర్టు తపుపట్టింది. అతడు నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్ 'రీసెట్'ను మూసివేయాలని ఆదేశించింది. 2024 వరకూ అతడు ఎలాంటి వీడియోలూ పోస్ట్ చేయకూడదని నిర్దేశించింది.
అయితే, రెన్ జైలుకు వెళ్లే అవకాశాలు తక్కువే.
తొలి సారి నేరానికి పాల్పడి, రెండేళ్ల కన్నా తక్కువ జైలు శిక్షకు గురైన వ్యక్తులను స్పెయిన్ కోర్టులు క్షమించి, శిక్ష రద్దు చేస్తుంటాయి.
ఈ కేసుకు సంబంధించిన కోర్టు పత్రాల వివరాలను స్పానిష్ పత్రికలు ప్రచురించాయి.

ఫొటో సోర్స్, Getty Images
రెన్ ప్రాంక్ బాధితుడి పేరు జార్జ్ ఎల్ అని స్పానిష్ మీడియా పేర్కొంది. రొమేనియా నుంచి ఆయన బార్సిలోనాకు వలస వచ్చారని తెలిపింది.
రెన్ నడుపుతున్న 'రీసెట్' ఛానెల్‌కు 12 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
2017లో అతడు ఈ వివాదాస్పద ప్రాంక్ వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియోపై ప్రకటనల ద్వారా అతడికి రూ.1.5 లక్షల ఆదాయం వచ్చినట్లు కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.
ఈ ఒక్క ప్రాంక్ మాత్రమే కాదని, చాలా మందిపై ఇలాంటి 'క్రూరమైన' చేష్టలకు రెన్ పాల్పడ్డాడని ఆ పత్రాలు తెలిపాయి.
'టూత్‌పేస్ట్ బిస్కెట్ ప్రాంక్'పై చాలా విమర్శలు రావడంతో, ఆ వీడియోను రెన్ డిలీట్ చేశాడు. రూ.1500 ఇచ్చి బాధితుడిని బుజ్జగించేందుకు ప్రయత్నించాడు.
తనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించకుండా ఉండేందుకు అతడికి రూ.23 వేలు చెల్లించేందుకూ రెన్ సిద్ధపడ్డాడు.
టూత్ పేస్ట్ నింపిన బిస్కెట్లు తినాలని తన ఫాలోవర్ ఒకరు ఛాలెంజ్ చేయడంతో రెన్ ఈ ప్రాంక్ వీడియో చేశాడు.
ఇవి కూడా చదవండి:
- LIVE: #INDvAUS భారత్ బ్యాటింగ్.. లైవ్ అప్డేట్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
- కోహ్లీ - స్మిత్: ఇద్దరిలో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు
- డేటింగ్ యాప్ నుంచి అధునాతన కార్ల వరకు అన్నీ కెనడాలోనే ఎందుకు పరీక్షిస్తారు?
- వాట్సాప్‌లో సమస్య: మొబైల్ ఫోన్లపై హ్యాకర్ల దాడి.. రహస్యంగా నిఘా
- టిక్‌టాక్‌లో ఫేమస్ అయితే డబ్బులు సంపాదించొచ్చా
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
- మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








