ఎవరీ నెసమణి.. ఆయన కోలుకోవాలని ట్విటర్‌లో జనాలు ఎందుకు ప్రార్థిస్తున్నారు

ఫొటో సోర్స్, Twitter
- రచయిత, ఆయేషా పెరీరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ట్విటర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా, అందరూ నెసమణి కోలుకోవాలని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా #Nesamani, #Pray_for_Nesamani (నెసమణి కోసం ప్రార్థించండి) హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
ఎవరీ నెసమణి, ఆయనకు ఏం కష్టం వచ్చి పడిందనుకుంటున్నారా?
నెసమణి.. 2001లో వచ్చిన 'ఫ్రెండ్స్' అనే తమిళ సినిమాలో ఓ పాత్ర. ప్రముఖ కమెడియన్ వడివేలు దీన్ని పోషించారు.
ఆ సినిమాలో బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా ఉండే నెసమణి, తన ఉద్యోగులతో సరిగ్గా పనిచేయించుకునేందుకు అష్టకష్టాలు పడిపోతుంటాడు.
ఆ ఉద్యోగులు పరమానందయ్య శిష్యుల్లా నెసమణి చెప్పింది తు.చ. తప్పకుండా చేస్తూ, అతడికే కష్టాలు తెస్తుంటారు.
ఓ రోజు ఓ ఉద్యోగి కాస్త ఎత్తులో పనిచేస్తుండగా, అతడి చేతిలో ఉన్న సుత్తి కాస్తా జారిపోతుంది. అది కిందున్న నెసమణి తల మీద పడుతుంది. దీంతో అతడు స్పృహ తప్పి కింద పడిపోతాడు.

ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతోందంటే..
పాకిస్తాన్‌కు చెందిన ఓ ఫేస్‌బుక్ మీమ్స్ పేజీ పెట్టిన పోస్టు నెసమణి ట్రెండ్‌కు ఆజ్యం పోసిందని 'ద న్యూస్ మినిట్' వెబ్‌సైట్ ఫిల్మ్, ఫీచర్స్ ఎడిటర్ సౌమ్య రాజేంద్రన్ వివరించారు.
"సివిల్ ఇంజినీరింగ్ లెర్నర్స్" అనే ఆ పేజీ, సుత్తి ఫోటో షేర్ చేస్తూ "దీన్ని మీ మీ దేశాల్లో ఏమంటారు" అని ప్రశ్నించింది.
దీనికో తమిళ యువకుడు సుత్తియల్ (సుత్తి) అంటారని బదులిచ్చాడు. అయితే, అతడు అంతటితో ఆగిపోలేదు. ఈ సుత్తి మీద పడటంతోనే కాంట్రాక్టర్ నెసమణి తల పగిలిందంటూ రాసుకొచ్చాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''నెసమణి ఇప్పుడు ఎలా ఉన్నాడు’’ అంటూ మరో తమిళ యువకుడు ఈ సంభాషణను ఇంకా పొడిగించాడు.
ఇక దీనికి మరింత మంది తమిళులు స్పందించడం మొదలుపెట్టారు. సినిమాలోని ఆ సీన్‌ను ప్రస్తావిస్తూ అనేక జోక్‌లు, మీమ్స్ పెట్టడం ప్రారంభించారు.
ఇటు ట్విటర్‌లో 'నెసమణి కోసం ప్రార్థనలు' మొదలయ్యాయి. మీమ్స్, జోక్‌ల వరద పారింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కొందరు నెసమణి ఆరోగ్యం గురించి హెల్త్ బులిటెన్‌లు పెట్టి మరీ అప్‌డేట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇంకొందరు నెసమణి కోలుకోవాలని ప్రపంచ నేతలంతా ప్రార్థిస్తున్నట్లు నకిలీ ట్వీట్లు సృష్టించేశారు.
ఈ ట్రెండ్‌పై రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, సినీ తారలు కూడా స్పందించడం ప్రారంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రాజకీయాలతో పోలిక
తమిళులకు తప్ప భారత్‌లోని మిగతా వారికి ఈ నెసమణి ట్రెండ్ పెద్దగా అర్థం కాలేదు.
ఈ ట్రెండ్‌ను ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పోల్చారు సౌమ్య రాజేంద్రన్.
''లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి దేశమంతా ఘన విజయం కట్టబెడితే, తమిళనాడు ప్రజలు మాత్రం పూర్తి భిన్నంగా తీర్పు ఇచ్చారు. అందరి కన్నా భిన్నంగా ఉండటం పట్ల, సొంత సంస్కృతి పట్ల తమిళ ప్రజలు గర్వంగా ఉంటారు. మాదైన దారిలో మేం నడుస్తాం. భారత్‌లోని మిగతా జనాలకు ఇది అర్థం కాదు'' అని సౌమ్య వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
తమిళనాడులో మీమ్స్ సంస్కృతి బాగా పాకిందని సౌమ్య వివరించారు. రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలను సంధించేందుకు వడివేలు సినిమాల్లోని చాలా సీన్లను నెటిజన్లు ఉపయోగించుకుంటుంటారని చెప్పారు.
''ఈ ట్రెండ్ గురించి వడివేలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మేము, మరికొన్ని టీవీ ఛానెళ్లు ప్రయత్నించాం. ఆయన సోషల్ మీడియాలో లేరు. అసలు ఏం జరుగుతుందో తనకు ఒక్క ముక్క కూడా తెలియదని ఆయన అన్నారు'' అని సౌమ్య తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- చంద్రాణి ముర్ము: పోటీ పరీక్షలకు చదువుకుంటున్న యువతికి ఎంపీ పదవి
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)