#ENGvSA దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో ఇంగ్లండ్ భారీ విజయం.. ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచకప్ 2019 ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది.
నలుగురు బ్యాట్స్‌మెన్ అర్థ సెంచరీలు చేశారు.
బెన్ స్టోక్స్ 89 పరుగులు, మోర్గాన్ 57 పరుగులు, జేసన్ రాయ్ 54 పరుగులు, జో రూట్ 51 పరుగులు, బట్లర్ 18 పరుగులు, వోక్స్ 13 పరుగులు, ప్లంకెట్ 9 పరుగులు, ఆర్చర్ 7 పరుగులు, మొయిన్ అలీ 3 పరుగులు చేయగా.. బెయిర్ స్ట్రో సున్నా పరుగులకు ఔటయ్యాడు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్‌గిడి 3 వికెట్లు, ఇమ్రాన్ తాహిర్, రబాడా చెరో రెండు వికెట్లు, ఫెహ్లువాయో ఒక వికెట్ తీశారు.
312 పరుగుల విజయలక్ష్యంతో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
డికాక్ 68 పరుగులు, దుస్సెన్ 50 పరుగులు, ఫెహ్లువాయో 24 పరుగులు, హషీం ఆమ్లా 13 పరుగులు, మార్‌క్రమ్ 11 పరుగులు, రబాడా 11 పరుగులు, జేపీ డుమినీ 8 పరుగులు, డుప్లెసిస్ 5 పరుగులు, ప్రిటోరియస్ 1 పరుగు చేసి ఔటయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, ప్లంకెట్, స్టోక్స్ చెరో 2 వికెట్లు, రషీద్, మొయిన్ అలీ చెరో ఒక వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ ప్రపంచకప్ 2019 షెడ్యూలు.. ఎవరు ఎవరితో పోటీ పడుతున్నారు?
- భారత 15వ ప్రధానిగా మోదీ ప్రమాణం.. క్యాబినెట్ మంత్రులు 25, స్వతంత్ర హోదా 9, సహాయ మంత్రులు 24 మంది
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
- వరల్డ్ కప్ 1983: టీమ్ ఇండియా తొలి ప్రపంచ కప్ విజయం వెనుక కథ ఇదే..
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలు.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 95 పరుగులతో భారత్ విజయం
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకోలేదంటే...: విరాట్ కోహ్లీ
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








