ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలు.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 95 పరుగులతో భారత్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
క్రికెట్ ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో కార్డిఫ్‌లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయం సాధించింది.
భారత్ బంగ్లాదేశ్‌ను 95 రన్స్ తేడాతో ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో 359 రన్స్ చేసింది. 360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 264 పరుగులే చేయగలిగింది.
రెండు వికెట్లు త్వరగానే కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టును ఓపెనర్ లిటన్ దాస్, వికెట్ కీపర్ రహీమ్ ఆదుకున్నారు. కానీ 73 పరుగులు చేసిన లిటన్ దాస్‌ను స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ స్టంప్డ్ చేశాడు.
బాగా ఆడుతున్న ముష్ఫికర్ రహ్మాన్ కూడా 90 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కులదీప్ యాదవ్ బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
జట్టులో మెహిదీ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్ మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముగ్గురు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు.
49.3 ఓవర్లలో బంగ్లాదేశ్ 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్, యజువేంద్ర చహల్ మూడేసి వికెట్లు తీయగా, జస్‌ప్రీత్ బుమ్రా 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతకు ముందు...
భారత జట్టు ప్రధాన వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో 78 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 113 పరుగులు సాధించాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ సైతం 99 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 108 పరుగులు చేశాడు.
మిగతా బ్యాట్స్‌మెన్లలో.. శిఖర్ ధావన్ 1, రోహిత్ శర్మ 19, కెప్టెన్ విరాట్ కోహ్లీ 47, విజయ్ శంకర్ 2, హార్దిక్ పాండ్యా 21, రవీంద్ర జడేజా 11, దినేశ్ కార్తీక్ 7 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో ధోనీ, దినేశ్ కార్తీక్ ఇద్దరూ కీపింగ్ చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో రూబెల్ హొస్సైన్, షకీబ్ అల్ హసన్ చెరో రెండు వికెట్లు, ముస్తఫిజుర్ రహ్మాన్, మొహమ్మద్ సైఫుద్దీన్, సబ్బీర్ రహ్మాన్ తలా ఒక వికెట్ తీశారు.
వరల్డ్ కప్‌లో భారత్ జూన్ 5న తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది.
ఇవి కూడా చదవండి:
- విరాట్ కోహ్లీకి ధోనీ ఎంత అవసరం?
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- ధోని పొరపాటు చెన్నైకి ఐపీఎల్ టైటిల్‌ను దూరం చేసిందా?
- అభిప్రాయం: 'జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు'
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకోలేదంటే...: విరాట్ కోహ్లీ
- ‘అందరికీ చెడ్డ రోజులుంటాయి’.. ధోనీ ‘డిఫెన్స్’కి కోహ్లీ సమర్థన
- వరల్డ్ కప్ క్రికెట్ 2019: ఎంఎస్కే ప్రసాద్ అండ్ కంపెనీ ఆడిన క్రికెట్ ఎంత...
- రోహిత్ శర్మ లాంగ్ ఇన్నింగ్స్ రహస్యమేంటి?
- హనుమ విహారి: ‘ప్రపంచంలో బెస్ట్ బ్యాట్స్‌మన్ కావాలన్నదే జీవితాశయం’
- ‘ఏసుక్రీస్తును అలా భావించలేను.. మీ స్టాంపును వాడలేను’
- విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అందించగలడా?
- ఆస్ట్రియా ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన రహస్య వీడియో
- ‘‘అమరావతి భూసేకరణ కేసుతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








