క్రికెట్ వరల్డ్ కప్ 2019: రిషబ్ పంత్‌ను ఎందుకు తీసుకోలేదో నోరు విప్పిన విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images
అనుభవజ్ఞుడు, ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకోగలడు కాబట్టే రిషబ్ పంత్ బదులు దినేష్ కార్తీక్‌ను జట్టులో రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్‌గా ఉన్నాడు. 15 మంది ఆటగాళ్ల జట్టులో దినేష్ కార్తీక్‌కు రెండో వికెట్ కీపర్‌గా చోటు కల్పించారు. రిషబ్ పంత్‌కు దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడనే పేరుంది. కానీ అతడిని ప్రపంచ కప్‌లో ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది ప్రశ్నించారు.
ఈ ప్రశ్నల తర్వాత రిషబ్ పంత్, అంబటి రాయుడులను ప్రపంచ కప్ జట్టులో అదనపు ఆటగాళ్లుగా చేర్చారు. కానీ, సునీల్ గావస్కర్ పంత్‌ను బయటే ఉంచడంపై ఆశ్చర్యపోయారు. ఇటు రాయుడుని ఎంపిక చేయడంపై గౌతం గంభీర్ ప్రశ్నలు లేవనెత్తాడు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
వారు కూడా సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి
మే 23 వరకు జట్టులో మార్పులు చేయడానికి అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో టీమిండియాకు యువ ఆటగాళ్ల లోటు కనిపిస్తుందని చాలా మంది చెబుతున్నారు. ఇంగ్లండ్‌లో మే 30 నుంచి క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు మొదలవబోతున్నాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రికతో మాట్లాడిన విరాట్ కోహ్లీ "ఒత్తిడి సమయాల్లో దినేష్ కార్తీక్ తట్టుకుని ఆడగలడు. ఆ విషయంతో ప్రతి ఒక్కరూ ఏకీభవించారు. అతడికి అనుభవం ఉంది. ధోనీకి ఏదైనా ఇబ్బంది ఎదురైతే, అలాంటి పరిస్థితుల్లో వికెట్ల వెనక దినేష్ కార్తీక్ చాలా కీలకం అవుతాడు. ఒక ఫినిషర్‌గా కూడా అతడు అద్భుతమైన ఆటగాడు" అన్నాడు.
దినేష్ కార్తీక్ 2004లో వన్డే అంతర్జాతీయ క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. భారత్ కోసం ఇప్పటివరకూ 91 వన్డేలు ఆడాడు. ఏ నంబర్లో అయినా అద్భుతంగా ఆడగలనని ఈ మ్యాచుల్లో అతడు నిరూపించుకున్నాడు.
"ఎంపిక చేసిన 15 మందీ చాలా బలమైన ఆటగాళ్లు. జట్టు ఎంపిక అంత సులభం కాదు. చాలా మంది మంచి ఆటగాళ్లను మిస్ చేశాం అంటున్నారు. మేం వాళ్ల ఉద్దేశం అర్థం చేసుకోగలం. కానీ ఏదైనా జరగరానిది జరిగితే వారు కూడా సిద్ధంగా ఉండాలి" అని టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు మరో ఛాన్స్
ప్రపంచ కప్ జట్టులో తన పేరు లేకపోవడంతో రాయుడు చేసిన ఒక ట్వీట్ గురించి అందరూ చర్చించుకున్నారు. ఏప్రిల్ 16న ట్వీట్ చేసిన రాయుడు "ప్రపంచ కప్ చూడ్డానికి ఇప్పుడే త్రీడీ కళ్లజోడు కోసం ఆర్డర్ ఇచ్చా" అన్నాడు.
1983, 2011 వరల్డ్ కప్ భారత్ గెలుచుకుంది. ఈసారి కూడా భారత జట్టు చాలా బలంగా ఉంది. ఇది మంచి అవకాశం అని కూడా చాలా మంది క్రీడా నిపుణులు భావిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌కు బంతిని స్వింగ్ చేసే సత్తా ఉంది.
ఎంపిక చేసిన ఆటగాళ్ల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని కోహ్లీ చెప్పాడు. ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"ఎవరైనా సక్సెస్ కావడానికి నిబంధనలంటూ ఏవీ ఉండవు. మమ్మల్ని మేం నమ్మవచ్చు, ఆ విజయాన్ని కూడా అందుకోవచ్చు" అన్నాడు.
ఈ ప్రపంచ కప్‌లో భారత్ జూన్ 5న సౌత్ఆంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది.
ఇవి కూడా చదవండి:
- అభిప్రాయం: 'ప్రపంచ కప్ జట్టులో ధోనీ 'బెర్త్'పై ఇక ఎలాంటి డౌట్ లేదు'
- #SRHvDC ఐపీఎల్ ఎలిమినేటర్: ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్పై దిల్లీ క్యాపిటల్స్ గెలుపు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- క్రికెట్: 2019 ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- వన్డే.. టీ20.. ఇప్పుడు 100-బాల్ క్రికెట్
- BBC exclusive: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’
- అమ్మలు లేని ఊళ్లు: 'అమ్మా నిన్ను చూసి తొమ్మిదేళ్లవుతోంది, ఒకసారి వస్తావా...'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








