హిమాలయ పర్వతాలపై తేనె సేకరించేందుకు ప్రాణాలు పణంగా పెడుతున్న నేపాలీలు

తేనె తుట్టె

తేనె అంటే అందరికీ ఇష్టం... కానీ మారుమూల కొండ ప్రాంతాల్లో తేనెను తీయాలంటే ఎంతో కష్టపడాలి.

నేపాల్లోని ఓ పర్వత ప్రాంతంలో ఎత్తైన రాళ్ల కింది భాగంలో వేలాడే తేనెతుట్టెల వద్దకు ఒడుపుగా చేరుకొని... అందులోంచి తేనె సేకరించడానికి స్థానికులు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఒక్కోసారి వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. బీబీసీ ప్రతినిధులు ఆమీర్ పీర్జాదా, నేహా శర్మలు అందిస్తున్న కథనం...

నేపాల్ గ్రామం

ఇది అత్యంత ప్రమాదకరమైన వేట.

తేనె తుట్టె

ఇది తేనెతుట్టెల్లో తేనె తయారయ్యే సీజన్. అందుకే ఇప్పుడు తేనె తీయడం కోసం ఈ గ్రామం సన్నద్ధమవుతుంది.

వెదురు నిచ్చెన

వెదుర్లతో చేసిన ఈ నిచ్చెన ఒక్కటే వారికి ప్రాణాధారం.

మిన్ బహదూర్ గురుంగ్, దిల్ బహదూర్ గురుంగ్

మిన్ బహదూర్ గురుంగ్, దిల్ బహదూర్ గురుంగ్‌లు ఇద్దరూ విశ్వాసంతో అడుగులు వేస్తున్నారు.

‘‘తరతరాలుగా మేం ఈ కొండల్లో తేనె తీస్తున్నాం, ఇది మా సహజ వనరు’’ అని వారు తెలిపారు.

లోయ

తేనె తీయడం కోసం గ్రామస్థులందరూ ఒక్కటై కదులుతారు.

దిల్, మిన్‌లు తేనె తీసేది ఇక్కడే. అందుకోసం వారు ఈ లోయలోకి దిగుతారు.

లోయ

దీని కోసం వాడే నిచ్చెన చాలా దృఢంగా ఉండాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం కూడా అంతే గట్టిగా ఉండాలి.

"మీలో పట్టుదల లేకపోతే మీరీ పని చేయలేరు."

"మొదట్లో కిందకు వెళ్లగానే చాలా భయం వేస్తుంది. ఒకసారి అక్కడికి చేరుకున్నామంటే అన్నీ మర్చిపోతాం. తేనెటీగలను చెదరగొట్టడానికి కింద నుంచి పొగ పెడతాం. కానీ అది సరిపోదు."

తేనె టీగలకు పొగ పెడుతున్న నేపాలీ

"తేనెటీగలు కుట్టినా ఆ నొప్పిని భరించగలగాలి. మా వద్ద ఉండే రక్షణ సామగ్రి చాలా ప్రాథమికమైంది. తేనెటీగలు కుట్టకుండా ఇవి కాపాడలేవు."

"ప్రతిసారీ మమ్మల్ని దాదాపు 200-300 తేనెటీగలు కుడతాయి. గుండె ధైర్యం తక్కువ ఉన్న వాళ్లు ఈ పని చేయలేరు."

తేనె సేకరిస్తున్న నేపాలీలు

దీనికి సాహసం, మంచి నైపుణ్యం కావాలి. అలాగే కొండ అంచుపై కూర్చునే గ్రామస్తుల సహకారం కూడా తప్పనిసరి.

వేటగాళ్లు తమ స్థానాల్లోకి చేరుకున్నాక, ఇక చకచకా పని మొదలుపెడతారు. తేనెపట్టుల్లోంచి తేనె తీస్తారు.

తేనె సేకరిస్తున్న నేపాలీ

అడవి తేనె సంవత్సరంలో రెండుసార్లు తయారవుతుంది. వసంత కాలంలో ఒకసారి, శరత్కాలంలో మరోసారి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

తేనె వేటను వీరు శతాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. తమ గొప్ప సంస్కృతిని కాపాడుతున్నారు. అయితే ఇది ఇప్పుడు పర్యటక ఆకర్షణగా మారింది.

తేనె

అలానే ఆదాయ మార్గంగా కూడా అయ్యింది.

తేనె

"మా ఈ ప్రదర్శనను చూసేందుకు విదేశీ పర్యాటకులు 30 నుంచి 60 వేల రూపాయల వరకు డబ్బు చెల్లిస్తారు."

"ఆ డబ్బును మా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తాం."

రోడ్డు

ఈరోజు వచ్చిన డబ్బును ఈ రోడ్డు కోసం ఉపయోగించబోతున్నారు.

ఇప్పటికైతే, ఇది సంబరం చేసుకునే సమయం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)