కొందరు ఆడవారి శరీరం నుంచి వచ్చే వాసనకు మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు? మహిళల శరీర వాసనకూ, సంతానోత్పత్తికి సంబంధం ఏమిటి?

పురుషులు

స్త్రీ పట్ల పురుషుడు ఆకర్షితుడు కావడంలో ఆమె నుంచి వెలువడే వాసన పాత్ర ఉంటుందా?

కొందరు స్త్రీల శరీరం నుంచి వచ్చే వాసన పట్ల మగవారు ఎందుకు ఆకర్షితులవుతారు, ఇతర మహిళల శరీరం నుంచి వచ్చే వాసన పట్ల ఎందుకు ఆకర్షితులు కారనేది పరిశోధకులు గుర్తించారు.

కొందరు మహిళల బాహుమూలల నుంచి వాసన నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఈ వాసనలు చూసి, రేటింగ్ ఇవ్వమని స్విట్జర్లాండ్‌లో బెర్న్ విశ్వవిద్యాలయంలోని మగవారిని అడిగారు. వారు ప్రతి వాసనను పీల్చి చూసి అది తమను ఆకర్షిస్తోందో, లేదో చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: మహిళ శరీరం నుంచి వెలువడే వాసనకూ, సంతానోత్పత్తికి సంబంధం ఏమిటి?

కొందరు మహిళల నుంచి సేకరించిన వాసన ఎందుకు ఎక్కువ ఆకర్షణీయంగా ఉందో పరిశోధకులు పరిశీలించారు.

హార్మోన్ల స్థాయులను బట్టి వాసన ఉన్నట్లు వారు గుర్తించారు. ఈస్ట్రడియల్ స్థాయులు ఎక్కువగా, ప్రొజెస్టిరాన్ స్థాయులు తక్కువగా ఉండటం కీలకం. మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని వారి నుంచి వచ్చే వాసన సూచించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)