హిమగిరి అంచుల్లో బౌద్ధ సన్యాసినుల జీవన'చిత్రం'

లడఖ్

ఫొటో సోర్స్, Deepti Asthana

ఆకాశాన్ని అందుకునేలా ఉండే హిమాలయాల అంచుల్లోని శివారు ప్రాంతం లడఖ్. ఉత్తరాదిన భారత్ చివరి ప్రాంతం కూడా ఇదే. బౌద్ధులు, వారి మఠాలతో కిక్కిరిసి ఉండే ఈ ప్రాంతం ప్రతీఏటా వేలాదిమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది 28 మంది బౌద్ధసన్యాసినుల నివాస కేంద్రం కూడా.

లడఖ్‌లోని కుగ్రామం నయిమాలో ఉండే ఈ బౌద్ధసన్యాసినుల జీవితంపై ఫొటోగ్రాఫర్ దీప్తి ఆస్థానా అందిస్తున్న చిత్రకథనం.

బౌద్ధ సన్యాసిని

ఫొటో సోర్స్, Deepti Asthana

మహిళలకూ హక్కులుండాలని ప్రతిపాదించినవారిలో బుద్ధుడు కూడా ఒకరని విశ్వసిస్తుంటారు. బౌద్ధం వ్యాప్తిచెందిన కాలం నుంచి ఈ మతంలో సన్యాసినులు ఉండే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే, వందల ఏళ్ల నుంచి సన్యాసం స్వీకరించే మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోంది. బౌద్ధసన్యాసుల మాదిరిగా మఠాలలో ఉంటూ ధ్యానం చేసే అవకాశం ఈ మతంలోని సన్యాసినులకు లేదు.

నన్నరీలో బౌద్ధ సన్యాసినులు

ఫొటో సోర్స్, Deepti Asthana

అయితే, 2012‌లో లడఖ్‌లోని సన్యాసినులంతా ఛట్న్‌యాన్లింగ్ కేంద్రంలో ఉంటున్నారు. దీన్ని లడఖ్ నన్స్ అసోసియేషన్ స్థాపించింది. ఇక్కడి మహిళలకు నిరంతరం సహాయం అవసరమని అంటున్నారు డాక్టర్ సెరింగ్ ప్లామో. ఛట్న్‌యాన్లింగ్ కేంద్ర స్థాపకుల్లో ఈయన ఒకరు. "వాళ్లకు తినడానికి తిండిలేదు, ఇంటిపనులు చేస్తూ కొంతమంది బతుకువెళ్లదీస్తున్నారు" అని ఆయన చెప్పారు.

బౌద్ధ సన్యాసిని

ఫొటో సోర్స్, Deepti Asthana

ఛట్న్‌యాన్లింగ్‌లోని అత్యంత వృద్ధురాలు లొబ్జాంగ్ డొల్మా (85). ఆమె ఇక్కడికి రాకముందు పొలం పనులకు వెళ్లేది.

బౌద్ధ సన్యాసులు

ఫొటో సోర్స్, Deepti Asthana

స్థానిక బడికి వెళ్లే యువ సన్యాసినులతో ఉన్న ప్లామో (కుడి నుంచి మధ్యలోని వ్యక్తి) ను ఇక్కడ చూడొచ్చు. బౌద్ధతత్వం, వైద్యం గురించి కూడా ఆయన చదువుకున్నారు. మొదట్లో కేవలం బౌద్ధసన్యాసులు మాత్రమే ఇక్కడికి వచ్చి సంస్కార విధులను నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు యువ సన్యాసినులను కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆచారక్రియలను జరిపిస్తున్నారు.

బౌద్ధ సన్యాసిని

ఫొటో సోర్స్, Deepti Asthana

స్కర్మా చుక్సిట్(8) ఇక్కడున్న సన్యాసినుల్లో అత్యంత పిన్నవయస్కురాలు. 2008‌లో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు పోషకాహార లోపంతో రికెట్స్ బారినపడింది. మతసంబంధ సంస్థల్లో తీవ్రమైన లింగవివక్షను ఆమె చూసినట్లు డాక్టర్ ప్లామో చెప్పారు. ఆధునిక విద్య ఈమెలాంటి యువ సన్యాసినుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుందని, సంప్రదాయ పద్ధతులను ఎదిరించే శక్తినిస్తుందని ఆయన అంటున్నారు.

లడఖ్‌లో బౌద్ధ సన్యాసిని

ఫొటో సోర్స్, Deepti Asthana

ఛట్న్‌యాన్లింగ్‌లోని సన్యాసినుల్లో చాంబ ఒకరు. ఈమె సైక్లింగ్ సాధన చేస్తోంది. ఈ సన్యాసినుల కేంద్రంలో గ్రంథాలయం, కూరగాయల క్షేత్రం కూడా ఉంది. ఇక్కడున్న యువ సన్యాసినులు ఆడుకోడాన్ని, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని డాక్టర్ ప్లామో ప్రోత్సహిస్తున్నారు.

బౌద్ధ సన్యాసిని

ఫొటో సోర్స్, Deepti Asthana

ఏడేళ్లున్నప్పుడే సెరింగ్ కున్‌జొమ్ సన్యాసినిగా మారాలని నిర్ణయించుకుంది. "అంతరాత్మ పిలుపు మేరకే ఎవరైనా సన్యాసిగా మారాలని అనుకుంటారు. ఎప్పుడైతే ప్రేమ, కరుణలతో ఇతరులకు సేవచేయాలనుకుంటారో వారిని ఇక ఎవరూ ఆపలేరు" అని డాక్టర్ ప్లామో చెప్పారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)