మైక్రోనేసియా: సరస్సులో పడ్డ విమానం.. ప్రయాణికులు, సిబ్బంది క్షేమం

విమానం వద్ద పడవల్లో ప్రజలు

ఫొటో సోర్స్, AFP

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మైక్రోనేసియా దేశంలోని చుక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక విమానం.. విమానాశ్రయానికి సమీపంలోని సరస్సులో పడింది.

పపువా న్యూ గినియా దేశానికి చెందిన ఎయిర్ నిగిని సంస్థ నడుపుతున్న ఈ ఏఎన్‌జీ73 నంబరు బోయింగ్ విమానంలో 35 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న ఫొటోలను బట్టి చూస్తే.. తీరంలో విమానం మునిగిపోతోంది.

అయితే, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవ్వరూ తీవ్రంగా గాయపడలేదని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందనేది స్పష్టంగా తెలియలేదు. త్వరలోనే దీనిపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు తెలిపారు.

నీటిలో విమానం

ఫొటో సోర్స్, AFP

విమానం వద్ద పడవల్లో ప్రజలు

ఫొటో సోర్స్, James Yaingeluo

‘‘రన్‌వే నుంచి 160 గజాల దూరంలోని సరస్సులో విమానం పడిపోయింది’’ అని చుక్ విమానాశ్రయ మేనేజర్ జిమ్మీ ఇమిలియో బీబీసీకి చెప్పారు.

‘‘ఏం జరిగిందనేది ఇప్పుడు మాకు తెలియదు. రేపు దర్యాప్తు ప్రారంభమవుతుంది. విమానాశ్రయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి’’ అని జిమ్మీ వెల్లడించారు.

విమానంలోని ప్రయాణికులను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించామని, వారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, వీరిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు.

మైక్రోనేసియాలోని పొన్పీ దీవి నుంచి బయలుదేరిన ఈ విమానం మైక్రోనేసియాలోని వెనో దీవి వద్ద ఆగి.. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మొరెస్బే నగరం చేరుకోవాల్సి ఉంది.

నీటిలో విమానం

ఫొటో సోర్స్, Reuters

విమానం వద్ద పడవల్లో ప్రజలు

ఫొటో సోర్స్, AFP

విమానం వద్ద పడవల్లో ప్రజలు

ఫొటో సోర్స్, AFP

పపువా న్యూ గినియా మ్యాప్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)