జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణికులకు అస్వస్థత : విమానంలో కేబిన్ ప్రెషర్ పోయినప్పుడు ఏం చేయాలి?

విమానంలో కేబిన్ ప్రెషర్ (గాలి ఒత్తిడి)ని నియంత్రించే స్విచ్‌ను ఆన్ చేయటాన్ని పైలట్లు మరచిపోవటంతో.. 30 మందికి పైగా ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరికి ముక్కులు, చెవుల నుంచి రక్తస్రావం జరిగిందని.. అందరికీ చికిత్స అందించామని అధికారులు తెలిపారు.
జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ 697 విమానం.. ముంబై నుంచి జైపూర్ వెళ్లటానికి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే వెనుదిరిగింది.
ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో దృశ్యాల్లో.. ప్రయాణికులు ఆక్సిజన్ మాస్కులను ఉపయోగిస్తుండటం కనిపించింది.
బోయింగ్ 737 రకానికి చెందిన ఈ విమానంలో 166 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం క్షేమంగా ల్యాండయింది.
దర్శక్ హాథీ అనే ప్రయాణికుడు.. విమానం లోపల గాలి ఒత్తిడి పడిపోయి, ఆక్సిజన్ మాస్కులు కిందికి వేలాడుతున్న దృశ్యాలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
విమానం కాక్‌పిట్ సిబ్బందిని విధుల నుంచి తొలగించామని.. ఈ ఉదంతం మీద దర్యాప్తు జరుగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ చెప్పింది.
విమానంలో కేబిన్ ప్రెషర్‌ను నియంత్రించే స్విచ్‌ని ఆన్ చేయటం సిబ్బంది మరచిపోయారని.. భారత విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి లలిత్‌గుప్తా ‘హిందుస్తాన్ టైమ్స్’ వార్తాపత్రికకు తెలిపారు.
ఆ విమానంలోని మరొక ప్రయాణికుడు.. తన ముక్కు నుంచి రక్తం కారుతున్న ఫొటోను ట్వీట్ చేశారు. విమానయాన సంస్థ ‘‘ప్రయాణికుల భద్రతను పూర్తిగా విస్మరించింది’’ అని ఫిర్యాదు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
విమానం ‘కేబినెట్ ప్రెషర్ కోల్పోవటం వల్ల’ వెనక్కు వచ్చిందని.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ‘చింతిస్తున్నామ’ని జెట్ ఎయిర్‌వేస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘ఈ బి737 విమానం.. 166 మంది అతిథులు, ఐదుగురు సిబ్బందితో ముంబైలో సాధారణంగా దిగింది. అతిథులందరినీ క్షేమంగా విమానం నుంచి దించి టెర్మినల్‌కు తీసుకెళ్లటం జరిగింది. చెవినొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం తదితర సమస్యలు చెప్పిన కొందరు అతిథులకు ప్రధమ చికిత్స అందించటం జరిగింది’’ అని ఆ ప్రకటన చెప్తోంది.
డీజీసీఏ దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని సదరు విమానయాన సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికురాలు.. తమ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండయిందని.. ఎటువంటి సమాచారం లేదని.. విమానాశ్రయంలో చిక్కుకుపోయి ఉన్నానని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరిలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ.. లండన్ నుంచి ముంబై వస్తున్న తమ విమానం కాక్‌పిట్‌లో కొట్టుకున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించింది. మొత్తం 324 మంది ప్రయాణికులతో వస్తున్న ఆ విమానం క్షేమంగా ల్యాండయింది.

విమానంలో కేబిన్ ప్రెషర్ పోయినప్పుడు ఏం చేయాలి?
విమానం బయలుదేరటానికి ముందు.. సిబ్బంది కొన్ని సూచనలు చేస్తారు. ‘‘మీ పైన ఉన్న ఆక్సిజన్ మాస్క్ కిందికి వస్తుంది. దానిని కిందికి లాగి మీవైపు లాక్కోవాలి. పిల్లలకు మాస్కు పెట్టే ముందు మీరు పెట్టుకోవాలి..’’
విమానాల్లో తరచుగా ప్రయాణించే వాళ్లు కొందరికి అవి బట్టీగా కూడా వచ్చుంటాయి. ఇలా చెప్పటం ఎందుకు అనే దానికి తాజా సంఘటన ఒక ఉదాహరణ.
ప్రయాణికులను తీసుకెళ్లే విమానాలు సాధారణంగా సముద్రం మట్టం నుంచి 40 వేల అడుగుల ఎత్తుల్లో ప్రయాణిస్తుంటాయి. ఆ ఎత్తులోని గాలిలో ఆక్సిజన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ మామూలుగా ఊపిరి తీసుకుంటే.. 12 సెకన్లలోనే స్పృహ కోల్పోయి కొద్ది సేపటికి చనిపోవటం జరుగుతుంది.
2005 ఆగస్టు 14న సైప్రస్ విమానం ఒకటి లార్నాకా నుంచి గాలిలోకి ఎగిరింది. అది గ్రీస్ లోని ఏథెన్స్‌లో ఆగి అక్కడి నుంచి చెక్ రిపబ్లిక్ లోని ప్రాగ్ వెళ్లాల్సి ఉంది. అయితే.. విమానం బయలుదేరేటపుడు కేబిన్ ప్రెషర్ ఆన్ చేయటాన్ని సిబ్బంది మరచిపోయారు. గాలి ఒత్తిడిలో తేడాను సిబ్బంది గమనించలేదు.
విమానం అలాగే ఇంకా పైకి వెళ్లింది. పైలట్లు స్పృహ తప్పారు. కేబిన్ సిబ్బంది కాక్‌పిట్‌లోకి వెళ్లలేకపోయారు. చివరికి విమానంలో ఉన్నవారందరూ స్పృహ కోల్పోయారు. విమానం ఆటో పైలట్ మోడ్‌లో ప్రయాణిస్తూనే ఉంది. ఇంధనం అయిపోయిన తర్వాత కుప్పకూలిపోయింది. అందులో ఆరుగురు సిబ్బంది, 121 మంది ప్రయాణికులు.. అందరూ చనిపోయారు. అయితే.. వారిలో చాలా మంది విమానం కూలిపోవటానికి ముందే చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానం గాలిలో పైకి వెళ్తూ.. కిందికి దిగుతూ ఉంటుంది కాబట్టి.. అందులో కేబిన్ ప్రెషర్ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. విమానం పైకి, కిందికి వెళ్లేటపుడు చెవులు నొప్పి చేసేది ఇందుకే. గాలి ఒత్తిడి విఫలమైనపుడు తీసుకోవలసిన జాగ్రత్తలను బాగా ప్రాక్టీస్ చేసి వుంటారు. తక్షణమే అమలులోకి తెస్తారు కూడా.
విమానాన్ని శరవేగంగా 8,000 అడుగల ఎత్తుకు దించాల్సి ఉంటుంది. ఆ ఎత్తు వరకూ మామూలుగా గాలి పీల్చుకోవటం సాధ్యమవతుంది. అత్యవసర తనిఖీలు చేయాలి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడి.. దిుగువ ఎత్తులో విమానం ప్రయాణిస్తున్న ప్రాంతం ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. విమానంలో ఇతర వ్యవస్థలేవైనా విఫలమయ్యాయా అనేది తనిఖీ చేయాలి.
విమానంలోని ఆక్సిజన్ వ్యవస్థల్లో సుమారు 12 నిమిషాలకు సరిపోయే నిల్వలు ఉంటాయి. కాబట్టి జాప్యం చేయటానికి లేదు.
కేబిన్‌లో గాలి ఒత్తిడి విఫలమైన పరిస్థితుల్లో ప్రయాణికులు రెండు రకాల ఫిర్యాదులు చేస్తుంటారని అనుభవజ్ఞులైన కేబిన్ సిబ్బంది చెప్తారు. ఒకటి.. ఆక్సిజన్ మాస్కులు పని చేయటం లేదనేది ఒకటైతే.. సిబ్బంది తమకు ఏమీ చెప్పలేదనేది రెండోది.
సాధారణంగా.. ఆ మాస్కుల నుంచి ఆక్సిజన్ ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ మాస్కులు పనిచేయటం లేదని ప్రయాణికులు భావించే అవకాశం ఉంటుంది.
ఇక కొన్ని సందర్భాల్లో.. అత్యవసర పరిస్థితిని పరిష్కరించటంలో సిబ్బంది తలమునకలై ఉన్నపుడు.. ఏం జరుగుతోందో ప్రయాణికులకు వివరించే సమయం సిబ్బందికి ఉండదని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- అత్యధిక సమయం ప్రయాణించే నాన్‌స్టాప్ విమానం ఇదే
- ఈ వీడియో చూసేలోపు ఈ విమాన ప్రయాణం పూర్తవుతుంది
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు.. ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- పూజకు ముందు.. పీరియడ్లను వాయిదా వేసే పిల్ తీసుకుంటున్నారా?
- నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పిల్లలు ఎందుకు పుడతారు?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- అమృత కన్నీటి కథ : ‘‘నన్ను గదిలో బంధించే వారు... ప్రణయ్‌ని మరచిపోవాలని రోజూ కొట్టేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








