లబ్‌డబ్బు: జీఎస్టీకి ఏడాది.. ఇదీ దాని చరిత్ర

ఈ నెలతో సంవత్సరం అయిపోతుంది. దేనికా? మన జీవితాలలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ, మనం చేసే ప్రతి కొనుగోలులో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ.. ‘నిను వీడని నీడను నేనే’ అంటూ మనని ఫాలో అవుతూ, ఒక సంవత్సర కాలంగా అందరి నోళ్ళల్లో నానిన, నానుతోన్న, నానబోతున్న మూడక్షరాలు- జీఎస్టీకి.
గత సంవత్సరం జూలై 1 నుంచి ఎఫెక్ట్ లోకి వచ్చిన ఈ పరోక్ష పన్ను వసూళ్లు మొదలై ఏడాది గడిచిన సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ వచ్చింది.. ప్రభుత్వం కొద్దిగా పన్ను రేట్లు తగ్గించింది. ఈ నేపథ్యంలో ఒకసారి జీఎస్టీ గురించి మాట్లాడుకుందాం.
జీఎస్టీ పన్ను విధానం
గత వారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటిదాకా 12% జీఎస్టీ ఉన్న శానిటరీ నాప్కిన్‌లను జీఎస్టీ పరిధి నుంచి తీసేశారు. అంతేకాదు అత్యధికంగా 28% జీఎస్టీ ఉన్న ఖరీదైన వస్తువుల జాబితాలో గతేడాది 226 ఉండేవి. ప్రస్తుతం 35 వస్తువులు మాత్రమే ఉన్నాయి.
ఈ వస్తువులు, సేవల పన్నును హడావిడిగా అమలు చేశారని చాలా మంది విమర్శించారు. కాదని ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టింది. అయితే గత సంవత్సర కాలంలో 191 వస్తువులపై పన్ను శాతాన్ని మార్చింది.
జీఎస్టీ కింద మొత్తం మూడు రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంటర్ స్టేట్.. అంటే అంతర్-రాష్ట్ర జీఎస్టీ.
సెంట్రల్ జీఎస్టీ: పేరుకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది.
స్టేట్ జీఎస్టీ: మళ్లీ పేరుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది.
ఇంటర్-స్టేట్ జీఎస్టీ: పన్ను లావాదేవీలను రాష్ట్రాల మధ్య విభజించాల్సి వచ్చినపుడు దీన్ని వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు పంచుతుంది.

జీఎస్టీ చరిత్ర
జీఎస్టీ అనేది మన దేశానికి కొత్తేమో కానీ ఇతర ప్రపంచ దేశాలకు మాత్రం కాదు. ఎపుడో 64 ఏళ్ళ క్రితం 1954లో ఫ్రాన్స్ మొదటిసారి ఈ జీఎస్టీని తమ దేశంలో అమలు చేసింది. అనంతర కాలంలో 150కి పైగా దేశాలు ఈ పన్ను విధానాన్ని అమలు చేయడం ప్రారంభించాయి.
భారత్ విషయానికొస్తే ఇది ఈమధ్య కాలంలో ప్రారంభమైన అంశం కాదు. 15 ఏళ్ళ క్రితం 2003లోనే దీన్ని అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తరువాత ఒక టాస్క్ ఫోర్స్ దీని కార్యాచరణ, అమలుపై పనిచేసింది. 2007లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం 2010 ఏప్రిల్ నుంచి జీఎస్టీ అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక ఎంపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
2011లో అప్పటి ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే కొంతమంది దీన్ని వ్యతిరేకించారు. అలా చర్చలు, వివాదాలు, వ్యతిరేకతలు 2014 వరకు కొనసాగాయి. ఏ విధమైన ఏకాభిప్రాయం లభించకపోవడంతో జీఎస్టీ మరుగున పడింది. ఇక మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జీఎస్టీని అమల్లోకి తెచ్చి, ప్రస్తుత స్థితికి తీసుకొచ్చారు.
ఇవి కూడా చూడండి:
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- లబ్ డబ్బు : వర్షాలకు, వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి?
- లబ్..డబ్బు: బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?
- లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
- లబ్ డబ్బు: జాబు వస్తుందా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
- లబ్‌డబ్బు: బ్యాంకులపై మొండి బకాయిల ప్రభావం ఎలా ఉండబోతోంది?
- లబ్ డబ్బు : కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కీలక మార్పులు
- #లబ్‌డబ్బు: పీఎఫ్ నిబంధనల్లో మార్పులతో ప్రయోజనాలివే
- #లబ్‌డబ్బు: గోల్డెన్ వీసా అంటే ఏంటి? ఇది పొందడం ఎలా?
- లబ్..డబ్బు: ఫిఫా ప్రపంచకప్‌తో ఎవరెవరికి ఎంతెంత లాభమో తెలుసా
- లబ్ డబ్బు: ముడిచమురు ధర పెరుగుదల ప్రభావం ఎలా ఉండనుంది?
- #లబ్‌డబ్బు: ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయండి ఇలా..
- లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- లబ్‌డబ్బు: వాట్సాప్ పే.. తప్పక తెలుసుకోవాల్సిన ఫీచర్ ఇది
- లబ్‌డబ్బు: రుణం తీసుకోవాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి
- లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?
- డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? దీని ప్రభావం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









