లబ్‌డబ్బు: రుణం తీసుకోవాలనుకుంటున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి

మీ కలలను సాకారం చేసుకోండి. ఎటువంటి క్లిష్టమైన అప్లికేషన్ ప్రాసెస్ లేకుండా లోన్ పొందండి. అతి తక్కువ వడ్డీతో ఎక్కువ లాభాలు పొందండి.. ఇవ్వన్నీ మీరు వినే ఉంటారు. బ్యాంకులు లోన్ లు ఇవ్వడం కోసం రకరకాల ఆకర్షణీయ ప్రకటనలు చేస్తూ ఉంటాయి. అయితే తొందరపడకుండా ఈ లోన్ లు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అసలు ఎంత లోన్ తీసుకోవాలి అనేది నిర్ణయించుకున్న తరువాత నెల నెలా కట్టాల్సిన వాయిదాలు మీ మీద భారం కాకుండా చూసుకోవాలి. దానికి తగట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి లోన్ లు తీసుకున్నప్పుడు నెలనెలా కట్టాల్సిన వాయిదాలు మీ ఆదాయం లో 15 శాతానికి మించి ఉండకూడదు అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అలాగే పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రతి నెలా కట్టాల్సిన వాయిదా నెలసరి ఆదాయం లో 10 శాతానికి మించకూడదు.
ఇది చాలా ముఖ్యమైన విషయం. నెలనెలా రుణాల చెల్లింపులు ఇతర ఖర్చులు మీ నెల జీతంలో 50% మించకుండా చూసుకోండి.
మీరు రిటైర్ అయిన తరువాత జీవితం హాయిగా ఉండాలి. అందుకే అన్ని ఆర్థిక లక్ష్యాలనూ సమయంలో పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోండి.
ఇక మరొక ముఖ్యమైన అంశం తీసుకున్న రుణాలు ఎప్పటిలోగా చెల్లించేయాలనేది.
ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే నెలనెలా కాట్టాల్సిన వాయిదా అంత తక్కువ అవుతుంది. అలాగే దీని పై పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. అయితే ఎక్కువ సమయం తీసుకుంటే మాత్రం వడ్డీలు కూడా ఎక్కువగానే కట్టాల్సి ఉంటుంది. అంటే మనకు ఎన్ని పన్ను రాయితీ లాంటి ప్రయోజనాలు వచ్చినా ఎక్కువ వడ్డీ రూపంలో అవి వచినట్టే వచ్చి జారిపోతాయి.
ఎక్కువ కాలం మీరు పెట్టుబడి పెడితే.. మీకు చక్రవడ్డీ వల్ల ఎక్కువ లాభం ఉంటుంది.
అదే విధానం రుణాలకూ వర్తిస్తుంది. రుణాలు తిరిగి చెల్లించే సమయం ఎంత ఎక్కువగా ఉంటె అంతే పెద్ద మొత్తంలో వడ్డీలు కట్టాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక చిన్న లెక్క వేద్దాం. మీరు పదేళ్లకు 9.75% ఇంటరెస్ట్ రేట్ తో ఏదైనా లోన్ తీసుకుంటే మీ మొత్తం వడ్డీ రేటు 57% అధికం అవుతుంది. అదే 15 ఏళ్లకు లోన్ తీసుకుంటే ఆ వడ్డీ రేటు 91% కి చేరుతుంది. అదే 20 ఏళ్లకు లోన్ తీసుకుంటే మీ వడ్డీరేటు 128% కు చేరుకుంటుంది.
ఆన్లైన్ లోన్ కు దరఖాస్తు చేసేటప్పుడు ఆ రుణాలతో పాటు కొన్ని జోడింపులు కనిపిస్తాయి. స్టాంప్ డ్యూటీ, ప్రాసెసింగ్ ఫి గురించి అడిగి తెలుసుకోవడం తప్పనిసరి. కొన్ని బ్యాంకులు ప్రీ పెమెంట్ చేసినా, లోన్ ట్రాన్స్‌ఫర్ చేసినా పెనాల్టీ వేస్తాయి. అందుకే వీటి గురించి కూడా తెలుసుకోవడం మంచిది. లోన్ తీసుకునేటపుడు ఎటువంటి డాకుమెంట్స్ ఇవ్వాలో కూడా స్పష్టంగా తెలుసుకోవాలి.
లోన్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగి ఆ వ్యక్తి రుణాలు చెల్లించలేకపోతే ఆ వ్యక్తి ఆస్తులను బ్యాంకు వారు స్వాధీనం చేసుకుంటారు. అందుకే నిపుణల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకుంటే ఇన్సూరెన్స్ చేయించడం మంచిది. ఈ ఇన్సూరెన్స్ కూడా రుణ మొత్తంతో సరిసమానంగా ఉండేటట్టు చూసుకోండి.
మరిన్ని వివరాలకు పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









