లబ్ డబ్బు : కొత్త ఆర్థిక సంవత్సరంలో 10 కీలక మార్పులు

ఫొటో సోర్స్, Getty Images
ప్రేక్షకులందరికీ నూతన ‘ఆర్థిక’ సంవత్సర శుభాకాంక్షలు! మరి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయిన కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త కొత్త మార్పులు అమల్లోకి రాబోతున్నాయి కదా.. బడ్జెట్ ప్రసంగంలో ప్రవేశ పెట్టిన ఈ మార్పులు మన జేబులను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం..
రూ.40 వేలకు పన్ను లేదు!
మీ మొత్తం జీతం నుంచి ఏడాదికి ఒక నలభై వేల రూపాయలు పక్కన పెట్టిన తరువాత మిగిలిన మొత్తం మీద మీరు పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే.. ఆ నలభై వేల రూపాయలకు టాక్స్ పడదు.
ఇంతకుముందు ప్రయాణ ఖర్చులు, మెడికల్ రీఎంబర్స్‌మెంట్ అని కట్టింగ్స్ ఉండేవి. ఇపుడు అవి ఉండవు.
ఆదాయ పన్నుపై 4% సెస్
ఇక ఇన్‌కమ్ టాక్స్ మీద నాలుగు శాతం సెస్ కట్టాలి. ఇంతకు ముందు ఇది మూడు శాతం మాత్రమే ఉండేది. అంటే మీరు కడుతున్న ఇన్‌కమ్ టాక్స్‌పై 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ కట్టాలి.
ఈ వీడియోను చూడండి..!
లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్ టాక్స్
షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లాభాల మీద ఇక నుంచి లాంగ్ టర్మ్ కాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ స్టాక్ మార్కెట్‌లో మీరు లక్ష రూపాయలకంటే ఎక్కువ లాభాలు పొందితే 10% పన్ను కట్టాల్సి ఉంటుంది. అంతే కాదు 4% సెస్ అదనంగా కట్టాలి.
అయితే.. 31 జనవరి 2018కు ముందు పొందిన లాభాలకు ఇది వర్తించదు.
సింగిల్ ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్పై పన్ను ఆదా
రాబోయే సంవత్సర ప్రీమియం కూడా ముందుగానే కట్టేస్తే పన్ను మినహాయింపులు ఉంటాయి కదా! ఈ ఏడాది బడ్జెట్ ప్రకటన ప్రకారం ఒక సంవత్సరానికి మించి ప్రీమియం కట్టేస్తే మన బీమా పాలసీకి సంబంధించిన నిష్పత్తిలో డిస్కౌంట్ ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి.. ఎన్పీఎస్ సంగతి?
ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఉద్యోగులే కాకుండా ఇతర పనులు చేసుకునేవారు కూడా తమ ఎన్‌పీఎస్ వ్యవధి పూర్తయి బయటకు వచ్చేసిన తరువాత లభించే డబ్బులో 40% మీద ఇకపై టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!
2017-18 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే జరిమాన విధించనున్నారు. ఆలస్యం చేయకుండా.. గడువు లోపలే మీ రిటర్న్స్ ఫైల్ చేసేయండి.
ఇక వృద్ధులవిషయానికొస్తే..

ఫొటో సోర్స్, Getty Images
సీనియర్ సిటిజన్లకు లాభాలు
01. సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో తెరిచే సేవింగ్స్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ యాభై వేలకంటే తక్కువ ఉంటే దానిపై పన్ను ఉండదు.
02. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ‘80డి’ ప్రకారం సీనియర్ సిటిజన్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులో యాభై వేల దాకా ఎటువంటి టాక్స్ విధించరు.
03. వృద్ధులకు కొన్ని వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు లక్ష రూపాయల లోపే ఉంటే.. దానిపై పన్ను ఉండదు.
04. ప్రధాన మంత్రి వయో వందన యోజన పేరుతో వృద్దులకు ఓ పెన్షన్ స్కీం ఉంది. ఈ పథకంలో పెట్టుబడుల పరిమితిని పదిహేను లక్షల వరకు పెంచారు. ఇదివరకు దీని పరిమితి రూ.7.5 లక్షలు మాత్రమే ఉండేది.
ఇవీ.. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలోని సరికొత్త మార్పులు. వీటిని పరిశీలించి లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహిస్తే లాభం. ఎవరికైనా వీటి గురించి తెలియకపోతే వాళ్లక్కూడా చెప్పండి. ఇదీ ఈ వారం ‘లబ్ డబ్బు.’
మా ‘లబ్ డబ్బు’ షో గురించి ఏదైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటే.. బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజ్‌లో కామెంట్ చేయండి, మరిన్ని వార్తల కోసం బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ను సబస్క్రైబ్ చేయండి.
వచ్చే వారం మరొక అంశంతో మళ్లీ కలుద్దాం..
ఇవి కూడా చదవండి
- లబ్..డబ్బు: దొంగతనాలు , ఫ్రాడ్ల నుంచి ఎలా రక్షించుకోవాలి?
- లబ్..డబ్బు: స్టార్టప్ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి?
- లబ్..డబ్బు: డిస్కౌంట్లు, ఆఫర్ల వలలో పడుతున్నారా?
- ఆమె పులితో పోరాడింది.. సెల్ఫీ తీసుకుంది!
- #UnseenLives: బాలింతలైతే 3 నెలలు ఊరి బయటే: ఇదేం ఆచారం?
- #UnseenLives: పీరియడ్స్ సమయంలో గుడికి వెళ్తే తేనెటీగలు కుడతాయా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- లబ్..డబ్బు: బీమా తీసుకునేటపుడు ఏ విషయాలు పరిశీలించాలి?
- లబ్..డబ్బు: స్టాక్ మార్కెట్ పతనమౌతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- లబ్..డబ్బు: ట్రేడ్ వార్ అంటే ఏంటి? దాని ప్రభావం భారత్‌పై ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









