INDvsSA: దక్షిణాఫ్రికాపై భారత్ గెలవాలంటూ పాక్ అభిమానులు కోరుకుంటున్నారా

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్రయాణం సవ్యంగా సాగడం లేదు.

తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో, తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో ఓడిపోయి పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలిచింది.

మరొకవైపు దక్షిణాఫ్రికాతో భారత్‌లు మ్యాచ్‌ల ఆడుతోంది. ఈ ఆటలో దక్షిణాఫ్రికాపై భారత్ గెలవాలని పాకిస్తాన్ అభిమానులు కొందరు కోరుకుంటున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

అలాగే ‘ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి’ ఇది అంటూ మరి కొందరు సరదా మీమ్స్ ట్వీట్ చేస్తున్నారు.

అభిమానులు చేసిన కొన్ని సరదా ట్వీట్లను కింద చూడండి..

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

‘తిరిగి రేసులో నిలవగలం’

ఈ మ్యాచ్‌కు ముందు హారిస్ రవూఫ్ మాట్లాడుతూ... ''అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ జట్టును కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతీ జట్టును సీరియస్‌గా తీసుకోవాలి. ప్రతీ జట్టు గెలవడం కోసమే ఇక్కడివరకు వచ్చింది. అందుకే ప్రతీ మ్యాచ్‌లోనూ 100 శాతం ఆటతీరును కనబరచాలి. మాతో మ్యాచ్‌లో జింబాబ్వే చాలా బాగా ఆడింది. అందుకే గెలిచింది.

మేం కోరుకున్న విధంగా టోర్నీని ఆరంభించలేకపోయాం. కానీ, చివరి బంతి వరకు గెలిచేందుకు ప్రయత్నించాం.

వాటి ఫలితాలతో మేం కూడా బాధపడ్డాం. కానీ, ఇంకా మేం టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. తిరిగి మేం రేసులో నిలవగలం. మేం ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వాటిలో మెరుగ్గా రాణిస్తాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో చేసిన తప్పులను విశ్లేషించాం. మా గురించి ఇతరులు ఏం అంటున్నారనే దానిపై కాదు ఆటపైనే మా దృష్టి మొత్తం ఉంది'' అని రవూఫ్ వివరించాడు.

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?

గ్రూపు-2లో పాకిస్తాన్ ప్రస్తుతం అయిదో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు గెలుపొందిన భారత్ 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇప్పుడు పాకిస్తాన్ సెమీఫైనల్ వరకు చేరుకోవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాలి. అంటే ఆ జట్టు కచ్చితంగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలపై నెగ్గాలి.

దీనితో పాటు గ్రూపులోని మిగతా జట్ల గెలుపోటములు కూడా పాక్ సెమీఫైనల్ చేరే అవకాశాలను ప్రభావితం చేస్తాయి.

నవంబర్ 3న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 6న బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ ఆడనుంది.

ఆదివారం నెదర్లాండ్స్‌పై గెలుపొందడంతో పాకిస్తాన్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. దాని నెట్ రన్‌రేట్ 0.765గా ఉంది.

విరాట్ కోహ్లి, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ గెలవాలని పాక్ ఎందుకు కోరుకుంటోంది?

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే మ్యాచ్ ఆ రెండు దేశాల కంటే కూడా పాకిస్తాన్‌కు చాలా కీలకంగా మారింది.

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ భారీ తేడాతో ఓడించాలని పాకిస్తాన్ అభిమానులు కోరుకుంటున్నారు.

కేవలం దక్షిణాఫ్రికాపైనే కాదు మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలని వారు ఆకాంక్షిస్తున్నారు. భారత్ ఇలా అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే పాకిస్తాన్ సెమీస్ చేరే మార్గం సుగమం అవుతుందని వారంతా భావిస్తున్నారు.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోతే పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మాయం అవుతాయి.

ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఖాతాలోని పాయింట్ల సంఖ్య 5కి పెరుగుతుంది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను ఓడించడం కూడా సఫారీలకు అంత కష్టమేం కాదు. కాబట్టి ఆ జట్టు పాయింట్ల సంఖ్య మరింత పెరుగుతుంది.

మరోవైపు ఇప్పటికే భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు ఇంకా బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ జట్లను భారత్ ఓడించగల అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ సెమీస్ చేరడం దాదాపు ఖాయమే. భారత్ రన్‌రేట్ (1.425) కూడా చాలా బాగుంది.

బాబర్ ఆజం

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు జింబాబ్వే, దక్షిణాఫ్రికాలు చెరో 3 పాయింట్లతో ఉన్నాయి. ఒకవేళ జింబాబ్వే, దక్షిణాఫ్రికా మిగిలిన రెండేసి మ్యాచ్‌లు గెలిస్తే పాక్ సెమీస్ చేరే అవకాశాలు గల్లంతు అవుతాయి.

కాబట్టి పాకిస్తాన్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే దాని ఖాతాలో 6 పాయింట్లు ఉంటాయి. అయినప్పటికీ మిగతా జట్ల ఫలితాలపై పాకిస్తాన్ ఆధారపడాల్సిందే. దీని ప్రకారం భారత్ మిగిలిన మూడు విజయాలు సాధించడం కూడా పాక్‌కు కీలకంగా మారింది.

అలాగే దక్షిణాఫ్రికా, జింబాబ్వే తమ మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోవాల్సి ఉంటుంది. అలా అయితేనే భారత్, పాకిస్తాన్‌లు సెమీస్‌కు చేరుకోగలవు.

ఒకవేళ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించినా పాక్ ఆశలు గల్లంతవుతాయి.

వీడియో క్యాప్షన్, #T20WorldCup: పాకిస్తాన్‌పై భారత్ విజయం తరువాత మెల్‌బోర్న్‌లో అభిమానుల సంబరాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)