Khushboo: నటి ఖుష్బుపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు-మహిళను ‘ఐటెం’ అని పిలవడం నేరమేనా, కోర్టులు ఏం చెప్పాయి

బీజేపీ నేత ఖుష్బు

ఫొటో సోర్స్, Twitter/KhushbuSundar

'ఐటెం'... ఈ పదం నిత్య జీవితంలో వినిపించేదే. సినిమాల్లో 'ఐటెం సాంగ్' అనేది తరచూ వినే పదం.

ఫుడ్ ఐటెమ్స్ వంటి వాడుకా ఎక్కువే.

అయితే, ఇప్పుడు ఈ పదం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది.

‘ఐటెం’ అన్నందుకు జైలు

ఒక మైనర్ బాలికను 'ఐటెం' అన్నందుకు ఒక వ్యక్తికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది ముంబయిలోని స్పెషల్ కోర్టు. అంతే కాదు రూ.500 జరిమానా కూడా విధించింది.

2015 నాటి కేసులో ముంబయి స్పెషల్ కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది. ఘటన జరిగినప్పుడు బాలికకు 16 ఏళ్లు కాగా నిందితుని వయసు 25 ఏళ్లు.

'2015 జులైలో స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో బాలికను ‘ఐటెం’ అని పిలవడంతో పాటు ఆ అమ్మాయి జుట్టును లాగాడు. 'ఇలా చేయడం ఆ అమ్మాయి గౌరవాన్ని భంగపర్చడమే’నని కోర్టు స్పష్టం చేసింది.

అమ్మాయిలను 'సెక్సువల్'గా ఆబ్జెక్టిఫై చేసేందుకు అబ్బాయిలు ఇలాంటి పదాలు వాడతారని అభిప్రాయపడింది. కాబట్టి మహిళలు, అమ్మాయిలను ఉద్దేశించి 'ఐటెం' అని పిలవడమంటే వారిని 'అవమానించినట్లే' అని కోర్టు వ్యాఖ్యానించింది.

అది ముంబయికి సంబంధించిన వార్త. ఇక ఇప్పుడు తమిళనాడుకు వెళ్దాం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

మరొకవైపు ఒక రాజకీయ నేత మహిళలను ఉద్దేశించి 'ఐటెం' అన్నారు.

తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) నేత సాదిఖ్, ఆర్‌కే నగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ 'ఐటెమ్స్' మీద ఆధారపడుతోందని అన్నారు.

'మీరు బీజేపీని తమిళనాడులో ఎలా విస్తరిస్తారు? బీజేపీలో నలుగురు నటీమణులున్నారు. వారు ఖుష్బు, నమిత, గాయత్రి రఘురామన్, గౌతమి.

ఉత్తర మద్రాస్‌లో గతంలో టీఆర్ బాలు, బాల్‌రామన్... ఇప్పుడు ఇళయ అరుణ్ వంటి వాటితో డీఎంకే పార్టీని నిర్మిస్తున్నాం.

మనం పార్టీని బలమైన నేతలతో నిర్మిస్తున్నాం. కానీ బీజేపీలోని నేతలను చూడండి, ఆ నలుగురు మహిళలు 'ఐటెమ్స్'. ఇలాంటి వాళ్లు డీఎంకేని నాశనం చేస్తారా?' అని సాదిఖ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

బీజేపీ నేత ఖుష్బు

ఫొటో సోర్స్, Facebook/KhushbuSundar

'ద్రవిడ మోడల్ ఇదేనా?'

తనతో పాటు ఇతర బీజేపీ మహిళా నేతలను ఉద్దేశించి డీఎంకే నేత చేసిన వ్యాఖ్యలను ఖుష్బూ ఖండించారు.

'మహిళలను మగవారు కించపరిచినప్పుడు... వారిని ఎలా పెంచారో, ఎలాంటి విషపూరితమైన వాతావరణంలో వారు పెరిగారో తెలుస్తుంది.

ఒక మహిళ గర్భాన్ని వారు అవమానించారు.

ఇలాంటి మగవారు కలైంగర్ అనుచరులమని చెప్పుకొంటున్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని కొత్త ద్రవిడ మోడలా? ఇది' అంటూ ఖుష్బు ఆమె వరస ట్వీట్‌లు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తాజాగా మరోసారి ట్వీట్ చేసిన ఖుష్బూ, తనను ఇలా కామెంట్ చేసిన వ్యక్తులను క్షమించనని స్పష్టం చేశారు. ఇది తనను అవమానించడం కాదని, ఇలాంటి కామెంట్ల ద్వారా ఆ వ్యక్తి తన కుటుంబంలోని మహిళలను కూడా అవమానించినట్లేనని ఆమె అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

డీఎంకే నేత కనిమొజి

ఫొటో సోర్స్, Twitter/Kanimozhi (Kanimozhi)

కనిమోళి క్షమాపణలు

బీజేపీ మహిళా నేతలను కింపపరిచేలా డీఎంకే పార్టీ నేత చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ మహిళా విభాగం సెక్రటరీ కనిమోళి ఖండించారు. క్షమాపణలు చెప్పారు.

కనిమోళి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోదరి. మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి కూతురు.

'ఒక మనిషిగా ఒక మహిళగా ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నా.

ఎంతటి వారైనా సరే ఇలా ప్రవర్తిస్తే ఏ మాత్రం సహించం.

ఈ తీరును మా నేత స్టాలిన్ కానీ మా పార్టీ డీఎంకే కానీ అంగీకరించదు. అందుకే బహిరంగంగా క్షమాపణలు చెప్పగలుగుతున్నా' అంటూ ఆమె ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

గతంలో స్టాలిన్ వార్నింగ్

అక్టోబరు 4న జరిగిన డీఎంకే సమావేశంలో మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్టీకి చెడ్డపేరు తెచ్చే మాటలు లేదా చర్యలను ఉపయోగించే పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంతేగాక, పార్టీ సభ్యులు గౌరవంగా, బాధ్యతగా వ్యవహరించాలని, ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధంలో ఉండే స్థానిక నేతలు వ్యవహరించాలని స్టాలినా సమావేశంలో ఆదేశించారు.

తమ వైపు నుంచి తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదని, ఏదైనా సంఘటనలు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి చెప్పారు.కాగా, ఖుష్బును సైదా సాదిక్ దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్ర గిరిజన కళల్ని ప్రపంచానికి చూపిస్తున్న యువ యూట్యూబర్స్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)