Dinesh Karthik: 12 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ జట్టులోకి రీఎంట్రీ.. ‘కలలు నిజమవుతాయి’ అంటూ ఎమోషనల్ ట్వీట్

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
విరాట్ కోహ్లీ తన స్థానాన్ని కాపాడుకోగా జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు.
గతం కొంత కాలంగా పరుగులు చేయడానికి విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతుండటంతో టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్ట్ అవుతాడా? కాడా? అనే సందేహం ఇంత కాలం ఉండేది. కానీ ఆసియా కప్‌లో రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ చేసిన కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్లుగా కనిపించాడు.
మోకాలి ఆపరేషన్ చేయించుకున్న రవీంద్ర జడేజా ఈ వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఇక ఆసియా కప్‌లో ఆడిన రవీ బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్‌లకు ప్రపంచ కప్ తుది జట్టులో స్థానం లభించ లేదు.
సీనియర్ పేసర్ మహ్మద్ షమీతోపాటు శ్రేయస్ అయ్యర్‌ను స్టాండ్ బై ప్లేయర్స్‌గా తీసుకున్నారు.
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ జట్టు:
- రోహిత్ శర్మ(కెప్టెన్)
- కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్)
- విరాట్ కోహ్లీ
- సూర్యకుమార్ యాదవ్
- దీపక్ హుడా
- రిషబ్ పంత్(వికెట్ కీపర్)
- దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్)
- హార్దిక్ పాండ్య
- రవిచంద్రన్ అశ్విన్
- యజువేంద్ర చాహల్
- అక్షర్ పటేల్
- జస్‌ప్రీత్ బుమ్రా
- భువనేశ్వర్ కుమార్
- హర్షల్ పటేల్
- అర్షదీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్స్: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ వచ్చే నెల 16 నుంచి ప్రారంభం కానుంది.
ఇక టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లకు కూడా జట్టును ప్రకటించారు.
ఆస్ట్రేలియా సిరీస్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
సౌతాఫ్రికా సిరీస్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘కలలు నిజమవుతాయి’
కాగా, టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించిన తర్వాత ‘కలలు నిజమవుతాయి’ అని దినేశ్ కార్తీక్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
టీ20 ప్రపంచకప్ 2007లో ప్రారంభమైంది. అప్పుడు భారత జట్టు విజేతగా నిలిచింది.
ఆ జట్టులో దినేశ్ కార్తీక్ సభ్యుడు. తర్వాత 2010లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా అతడు జట్టు సభ్యుడు. ఆ తర్వాత మాత్రం అతడికి చోటుదక్కలేదు.
మళ్లీ 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్‌కు చోటు లభించింది. ఇప్పుడు అతని వయసు 37 ఏళ్లు.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దినేశ్ కార్తీక్ చక్కటి ప్రదర్శన చేశాడు. ఫినిషర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు.
కాగా, అందరి కలలూ నిజం కావంటూ కొందరు యూజర్లు సంజూ శాంసన్‌ను ఉద్దేశించి ట్వీట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణంరాజు: మొగల్తూరు నుంచి మొదలై దిల్లీ దాకా సాగిన రెబెల్ స్టార్ ప్రయాణం
- భారత్-పాకిస్తాన్: మరపురాని అయిదు ప్రపంచ కప్ మ్యాచ్‌లు
- బ్రిటన్ రాజరికం: కింగ్ చార్లెస్ 3 భార్య కామిలా ఎవరు, క్వీన్ కన్సొర్ట్ అని ఎందుకు పిలుస్తున్నారు?
- కొత్త రాజు చార్లెస్ 3 వ్యక్తిత్వం ఎలా ఉండబోతోంది?
- క్వీన్ ఎలిజబెత్ 2: బ్రిటన్ రాణికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













