Narendra Modi: నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్‌ అంతర్జాతీయ శక్తిగా మారిందా...

నరేంద్ర మోదీతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, రజనీశ్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఈ ఏడాది జూన్‌లో జర్మనీ వేదికగా జరిగిన జీ7 సదస్సుకు అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.

ప్రపంచంలో పారిశ్రామికంగా శక్తిమంతమైన అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ దేశాల కూటమే జీ7. నాడు ఆ సదస్సుకు వెళ్లినప్పుడు ఒక సందర్భంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. అప్పుడు వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మోదీ మీద చేయి వేశారు. మోదీ వెనక్కి తిరిగి చూడగా బైడెన్ కనిపించారు. అప్పుడు ఇద్దరి మధ్య నవ్వులు విరిశాయి.

ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్తా సంస్థ ఏఎన్‌ఐ, భారత ప్రధాని నరేంద్ర మోదీని తానే స్వయంగా కలిసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చారంటూ రాసుకొచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఒకప్పుడు జీ7 కూటమి జీ8గా ఉండేది. 2014లో క్రైమియాను ఆక్రమించుకోవడంతో జీ8 నుంచి రష్యాను తొలగించారు. అలా ఆ కూటమి జీ7గా మారింది. రష్యా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

జర్మనీలో జీ7 సదస్సు జరిగిన మూడు నెలల తరువాత ఇటీవలే ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై కోపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సు జరిగింది.

చైనా నేతృత్వంలోని ఎస్‌సీఓలో భారత్, రష్యా, పాకిస్తాన్ కూడా సభ్యదేశాలు. ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటి అయ్యారు.

'ఇది ప్రజాస్వామ్యానికి, దౌత్యానికి, చర్చలకు సమయం. యుద్ధాలకు కాదు' అంటూ కెమెరా ముందే పుతిన్‌కు మోదీ చెప్పారు. యుక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ చేసిన ఆ వ్యాఖ్యలకు పశ్చిమ దేశాల నుంచి ప్రశంసలు లభించాయి. యుక్రెయిన్, రష్యా యుద్ధంలో భారత్ వైఖరీ మీద అవి అసంతృప్తిగా ఉన్నాయి. యుక్రెయిన్ మీద దాడిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాలకు ఓటు వేయకుండా భారత్ గైర్హాజరైంది.

అమెరికాతోపాటు యూరప్ దేశాలు కూడా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయాలని కోరుకున్నాయి.

ఇక యుక్రెయిన్ మీద దాడి మొదలైన నాటి నుంచి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం పెరిగింది. ఇదే సమయంలో రష్యా మీద పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

ఫొటో సోర్స్, EPA

మేక్రాన్ ప్రశంసలు

ఐక్యరాజ్య సమితి 77వ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రశంసించారు. 'ఇది యుద్ధాలు చేసే కాలం కాదు' అంటూ అందరి ముందే పుతిన్‌కు మోదీ చెప్పడం మంచిపని అని ఆయన అన్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడు జనరల్ అసెంబ్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని అభినందించడాన్ని ముఖ్యమైన పరిణామంగా చూడొచ్చు.

మోదీ గురించి మేక్రాన్ మాట్లాడిన వీడియో క్లిప్‌ను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకుర్, కిరెన్ రిజీజు ట్వీట్ చేశారు. తద్వారా ఇప్పుడు భారత్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కుతోందనే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో చాలా దేశాలు భారత్‌ను ప్రస్తావించాయి. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు బ్రిటన్ కృషి చేస్తుందని ఆ దేశ ప్రధాని లిజ్ ట్రస్ అన్నారు. భారత్‌ పేరును ప్రస్తావించిన దేశాల్లో జర్మనీ, పోర్చుగల్, యుక్రెయిన్, టర్కీ, మెక్సికో, వెనెజ్వేలా వంటివి కూడా ఉన్నాయి.

రష్యా, యుక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం...నరేంద్ర మోదీ, పోప్ ఫ్రాన్సిస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటేరస్‌లతో ఒక కమిటీని వేయాలని మెక్సికో విదేశాంగ మంత్రి ప్రతిపాదించారు.

మెక్సికో చేసిన ప్రతిపాదనను వెనెజ్వేలా సమర్థించింది.

ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బ్రెజిల్, భారత్‌లకు శాశ్వత సభ్యత్వం లభించేందుకు తాము మద్దతు ఇస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఇక భద్రతా మండలిని సంస్కరించేందుకు తాము కూడా మద్దతు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను పెంచేందుకు తాము సుముఖంగానే ఉన్నామని తెలిపారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడానికి సహకరిస్తామని అమెరికా తెలిపింది.

విదేశాంగశాఖ మంత్రి అయిన తరువాత తొలిసారి ఎస్.జైశంకర్ సౌదీ అరేబియాకు వెళ్లారు.

‘‘భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయిదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. టెక్నాలజీ హబ్‌ కూడా. ఎప్పటి నుంచో అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందే అర్హత భారత్‌కు ఉంది' అని సౌదీ గెజెట్ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ అన్నారు.

జైశంకర్ వ్యాఖ్యలకు కొద్ది రోజుల తరువాత భద్రతా మండలిని సంస్కరించేందుకు తాము మద్దతు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అలాగే భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించేలా అండగా ఉంటామని రష్యా కూడా తెలిపింది.

‘అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న మోదీ’

న్యూయార్క్ టైమ్స్‌ సౌత్ ఏసియా బ్యూరో చీఫ్ ముజీబ్ మషాల్ సెప్టెంబర్ 24న, భారత్ గురించి ఒక వ్యాసం రాశారు.

'అంతర్జాతీయ వేదికల మీద భారత్ ప్రభావం పెరుగుతోంది. కరోనా సంక్షోభం, యుక్రెయిన్ మీద రష్యా దాడి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనా విస్తరణవాదం కూడా మరొక సవాలుగా మారింది.

ఈ నేపథ్యంలో ఆ అవకాశాలను వినియోగించుకుని అంతర్జాతీయ వేదికల మీద భారత్‌ను నిలబెట్టేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.

ఇటు రష్యాతోనూ అటు అమెరికాతోనూ కలిసి సైనిక విన్యాసాలు చేపట్టింది భారత్. అమెరికా, యూరప్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంది.

అయితే భారత్‌లో ప్రజాస్వామ్యపు విలువలు తగ్గిపోతున్నాయని, వీటిని పశ్చిమ దేశాలు పట్టించుకోవడం లేదని, వాణిజ్యం మీద దృష్టి పెట్టి మానవ హక్కులను వదిలేస్తున్నారనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

‘‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని మాత్రమే యూరోపియన్ యూనియన్ భావిస్తోందని దిల్లీలోని ఒక డిప్లొమాట్ చెప్పారు’’ అని ముజీబ్ తన వ్యాసంలో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

మోదీ నాయకత్వంలో భారత్, ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించిందనే దాని మీద కూడా భిన్నమైన అభిప్రాయాలున్నాయి.

మానవాభివృద్ధి సూచిక(హెచ్‌డీఐ)లో భారత్ స్థానం దిగజారుతోంది. 2020లో 130వ స్థానంలో ఉన్న భారత్, 2021 నాటికి 132కు పడి పోయింది.

సగటు జీవన ప్రమాణం, విద్య, తలసరి ఆదాయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని హెచ్‌డీఐని రూపొందిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఇది 0.4శాతం తగ్గితే భారత్ విషయంలో 1.4శాతం తగ్గింది. 2015 నుంచి 2021 మధ్య భారత్ స్థానం తగ్గుతూ వస్తే చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, భూటన్, మాల్దీవుల ర్యాంకులు పెరుగుతూ పోయాయి.

మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ శక్తిగా ఎదుగుతోందని సెప్టెంబరు 21న, ఫైనాన్సియల్ రివ్యూకు రాసిన ఆర్టికల్‌లో గతంలో భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారిగా పని చేసిన జాన్ మెక్‌కర్తీ పేర్కొన్నారు.

'ఇది యుద్ధాలు చేసే కాలం కాదు అని ప్రకటించడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ కాస్త దూరం జరిగారు. ప్రచ్ఛన్నయుద్ధం సమయంలో పాకిస్తాన్‌ వైపు చైనా చూడగా భారత్‌తో రష్యా దోస్తీ చేసింది. అదంతా చరిత్ర.

చారిత్రకంగా చూస్తే రష్యాతో బంధాలను భారత్‌ గౌరవిస్తూ వస్తోంది. సమర్‌కండ్‌లో సమావేశం ద్వారా మోదీ విజయవంతమైన నేతగా అవతరించారు. అదే సమావేశంలో షీ జిన్‌పింగ్‌ను పట్టించుకోలేదు. తన దేశంలోని ఓటర్లలో చైనా మీద కోపం ఉందనే విషయం మోదీకి తెలుసు. అలాగే క్వాడ్ దేశాలు కూడా సంతోషిస్తాయి' అని జాన్ విశ్లేషించారు.

నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

'2003 నుంచి భారత ఆర్థికవ్యవస్థ పెరుగుతూ వస్తోంది. మన్మోహన్ సింగ్ కాలంలోనూ భారత్ జీడీపీ రేటు 8శాతంగా ఉంది. 2014 తరువాత అది నెమ్మదించింది. కాబట్టి మోదీ ప్రభుత్వంలోనే భారత్‌కు ప్రాధాన్యం పెరిగిందని చెప్పలేం.

మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత విదేశాంగ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయడంలో సందేహం లేదు. ఎస్.జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన తరువాత విదేశాంగ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

గతంలో అలీన విధానాన్ని భారత్ పాటించేది. కానీ ఇప్పుడు అనేక దేశాలకు దగ్గరగా భారత్ జరుగుతోంది. గతంలో ఏ కూటమిలోనూ చేరకూడదనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఏ కూటమిలోనైనా చేరొచ్చనే విధానంలోకి వచ్చింది' అని రజన్ కుమార్ అన్నారు.

దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గల సెంటర్ ఫర్ ఏసియా అండ్ రష్యన్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా రజన్ కుమార్ పని చేస్తున్నారు.

రాబోయే కాలంలో అంతర్జాతీయ వేదికల మీద భారత్ అనేక కీలక బాధ్యతలు చేపట్టనుంది. వచ్చే ఏడాది ఇండోనేసియా నుంచి జీ20 చైర్మన్‌షిప్‌ను భారత్ స్వీకరించనుంది. అలాగే. ఎస్‌సీఓ సమ్మిట్ భారత్ ఆధ్వర్యంలో జరగనుంది. డిసెంబరు నెలకు యూఎన్ భద్రతా మండలికి భారత్ అధ్యక్షత వహించనుంది.

వీడియో క్యాప్షన్, INDvAUS: ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ నెగ్గింది సరే, వరల్డ్ కప్‌కు టీమిండియా సన్నద్ధంగా ఉందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)