రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?

ఫొటో సోర్స్, PANKAJ NANGIA
టి20 ప్రపంచ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో భారత్ టి20 సిరీస్‌లు ఆడుతుంది.
ఆస్ట్రేలియాతో 3 టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం మొహాలీలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది.
అయితే, ఈమ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈ సిరీస్ కంటే ముందు జరిగిన ఆసియా కప్ టోర్నమెంట్‌లో కూడా భారత్ పేలవ ఆటతీరు కనబరిచింది.
మంగళవారం నాటి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్, ఆస్ట్రేలియాకు 209 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
మొహాలీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దీంతో తొలుత నెమ్మదిగా పరుగులు చేసిన భారత్, తర్వాత బ్యాటింగ్‌లో ధాటిని పెంచింది. చివరకు ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
208 పరుగులు స్కోర్ చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంతో, భారత బౌలర్ల ప్రదర్శనపై అంతటా చర్చ జరిగింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ కూడా బౌలర్ల వైఫల్యం గురించి మాట్లాడారు.
కానీ, వీటన్నింటి కంటే కూడా రోహిత్ కెప్టెన్సీ గురించి, మైదానంలో తన ప్రవర్తన గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
ఆసియా కప్ టోర్నమెంట్ నుంచే రోహిత్ కెప్టెన్సీ చర్చల్లో నిలిచింది. చాలామంది మాజీ క్రికెటర్లు, నిపుణులు అతని కెప్టెన్సీపై నిరాశ చెందారు.
అయితే, మైదానంలో రోహిత్ శర్మ, బాడీ లాంగ్వేజ్‌పై తొలుత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్ ప్రశ్నలు లేవనెత్తారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం, మైదానంలో రోహిత్ శర్మ ప్రవర్తనపై చాలా చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, PANKAJ NANGIA
రోహిత్ అసహనం, నిరాశ
రోహిత్ తొలుత బ్యాటింగ్‌లో రాణించలేకపోయాడు. ఫీల్డింగ్ కోసం జట్టు బరిలోకి దిగిన సమయంలో హడావిడిగా కనిపించాడు. కాస్త గందరగోళంగా, నిరాశగా ఉన్నట్లుగా అనిపించాడు. మైదానంలో అతను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
దూకుడుగా ఆడుతున్న ఆరోన్ ఫించ్‌ను అక్షర్ పటేల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జోరు తగ్గింది.
ఆ మరుసటి ఓవర్‌లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతి నేరుగా వెళ్లి స్టీవ్ స్మిత్ ప్యాడ్‌ను తగిలింది. కానీ, భారత ప్లేయర్లు అవుట్ కోసం సరిగా అప్పీల్ చేయలేదు. డీఆర్‌ఎస్ కూడా కోరలేదు.
తర్వాత మ్యాచ్ జరుగుతోన్న సమయంలో పెద్ద టీవీ స్క్రీన్‌పై చాహల్ వేసిన బంతిని రీప్లే చేసినప్పుడు... భారత్ దానికి రివ్యూ కోరి ఉంటే కచ్చితంగా స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యేవాడని తేలింది. దీంతో ఆస్ట్రేలియా రెండో వికెట్‌ను కోల్పోయి ఉండేది.
ఈ రీప్లే చూసిన తర్వాత రోహిత్ శర్మ మైదానంలోనే తన అసహనాన్ని, నిరాశను ప్రదర్శించాడు. ఇక్కడ నుంచి మ్యాచ్ ముగిసేవరకు అతని నిరుత్సాహ ప్రవర్తన కొనసాగినట్లు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
సరైన సమయంలో డీఆర్‌ఎస్ ఎందుకు కోరలేదని, స్మిత్ అవుట్ కోసం ఎందుకు అప్పీల్ చేయలేదంటూ చాహల్‌పై, దినేశ్ కార్తీక్‌పై రోహిత్ అసహనం ప్రదర్శించాడని యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
అయితే, మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో చాలాసార్లు రోహిత్ శర్మ హావాభావాలు మారిపోయాయి. చాహల్‌తో, దినేశ్ కార్తీక్‌తో తరచుగా ఏదో మాట్లాడుతూ కనిపించాడు.
తర్వాత ఉమేశ్ యాదవ్ వేసిన ఒకే ఓవర్‌లో భారత్ రివ్యూల సహాయంతో స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను పెవిలియన్ పంపింది.

ఫొటో సోర్స్, PANKAJ NANGIA
దినేశ్ మెడను రోహిత్ శర్మ ఎందుకు పట్టుకున్నాడు?
ఉమేశ్ వేసిన ఈ ఓవర్, మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పుతుందని కెప్టెన్ రోహిత్ భావించాడు. కానీ, తర్వాత వచ్చిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో అలా జరగలేదు. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఈ దశలో తేలిపోయాడు.
ఉమేశ్ యాదవ్ వేసిన ఒకే ఓవర్‌లో స్మిత్, మ్యాక్స్‌వెల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఈ రెండు వికెట్లనూ డీఆర్‌ఎస్ ద్వారానే భారత్ దక్కించుకుంది. తొలుత స్మిత్, మ్యాక్స్‌వెల్‌లను అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. కానీ, వెంటనే రోహిత్ శర్మ, రివ్యూకి వెళ్లడంతో ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.
ఈ సమయంలో చాహల్, దినేశ్ కార్తీక్‌లతో ఏదో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. అలా మాట్లాడుతూ రోహిత్ శర్మ సరదాగా దినేశ్ కార్తీక్ మెడను పట్టుకొని ఏదో అనడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కానీ, మొదట చాహల్ బంతికి తాను డీఆర్‌ఎస్ కోరలేదనే సంగతిని రోహిత్ అప్పుడు మరచిపోయి ఉంటాడు.
స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత మ్యాచ్ భారత్ వైపు మొగ్గినట్లు కనిపించింది. కానీ, మైదానంలో రోహిత్ శర్మ అసహనం తగ్గినట్లు కనిపించలేదు. భారత బౌలర్ల ఆటతీరు మెరుగుపడినట్లు కూడా అనిపించలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
క్యాచ్‌లు చేజార్చినప్పుడు కూడా రోహిత్ శర్మ రియాక్షన్లు చర్చనీయాంశం అయ్యాయి.
ఆసియా కప్ కీలక మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ విఫలం కావడంతో భువీకి భారత తుది జట్టులో చోటు కల్పించకూడదని చాలా మంది నిపుణులు వ్యాఖ్యానించారు.
కానీ, జట్టులోని ఫాస్ట్ బౌలర్లలో సీనియర్ అయిన భువనేశ్వర్, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చోటు దక్కించుకున్నాడు.
ఈసారి కూడా భువీ అదే పేలవ ఆటతీరును కనబరిచాడు. కీలక సమయాల్లో జట్టును ఆదుకోలేకపోయాడు.
ఈ సమయంలో కూడా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తిగా కనిపించాడు.
ఆసియా కప్ సమయంలో రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన వీడియోను పంచుకుంటూ పాక్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్... రోహిత్ శర్మ, కెప్టెన్సీ చేయకూడదని అన్నారు.
బౌలర్ల ప్రదర్శనపై కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి ఓవర్లలో భారత బౌలింగ్ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కనిపించిందని, బుమ్రా ఒక్కడే ఈ లోటును పూడ్చలేడని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. ఉమేశ్ యాదవ్ 2 ఓవర్లలో 27 పరుగులు, హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నారు.
తుది 5 ఓవర్లలో భువనేశ్వర్‌కు ఒక ఓవర్ మాత్రమే ఇవ్వాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ గురించి సోషల్ మీడియాలో ప్రజలు చాలా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

పోస్ట్ of X ముగిసింది, 5

పోస్ట్ of X ముగిసింది, 6

పోస్ట్ of X ముగిసింది, 7

పోస్ట్ of X ముగిసింది, 8
ఇవి కూడా చదవండి:
- కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన ‘శ్రీమంతుడు’
- సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
- ఇరాన్ నిరసనలు: హిజాబ్‌లను తగులబెడుతున్న మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)