సెక్స్ లైఫ్‌ను ఆసక్తికరంగా మార్చుకునేందుకు 7 చిట్కాలు

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక జీవితాన్ని (సెక్స్) శరీరంలో హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. పునరుత్పత్తి కోసం సెక్స్ అవసరం.
కానీ, లైంగిక జీవితంలో కలిగే సంతృప్తి వ్యక్తుల మానసిక, శారీరక ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది.
లైంగిక పరమైన ఉద్రేకం కలిగినప్పుడు శరీరంలో ఆక్సిటాసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మూడ్‌ను మెరుగు పరుస్తుంది. సెక్స్ అనే ఒకే ఒక్క పదం ప్రేమ, ఉత్సాహం, మమకారం, ఆర్తి నుంచి మొదలుకొని ఆందోళన, నిస్సహాయత లాంటి రకరకాల భావోద్వేగాలను కలుగచేస్తుంది.
సెక్స్‌లో ఆసక్తి తగ్గడానికి చాలా కారణాలుంటాయి. పని ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల కూడా సెక్స్ పై ఆసక్తి తగ్గుతుంది.
సెక్స్ లైఫ్‌ను ఆసక్తికరంగా మార్చుకునేందుకు 7 చిట్కాలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ ప్రచురించింది.
1) సెక్స్ గురించి ఓపెన్ మైండ్
మీ శరీరాన్ని, లైంగిక కోరికలను కలిగించే భాగాలను మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, మీ భాగస్వామితో ఉన్నప్పుడు కానీ మరింత శోధించండి. దీని వల్ల మీ శరీరంలో ఉద్రేకాన్ని కలిగించే భాగాలు, కోరికను పుట్టించే పాయింట్‌లు తెలుస్తాయి.
సెక్స్‌లో మరింత సృజనాత్మకంగా ఉండాలనుకుంటే, సెక్స్ లో వివిధ భంగిమలను ప్రయత్నించి చూడండి. సెక్స్ టాయ్స్ వాడటం, రోల్ ప్లే కూడా ప్రయత్నించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
2) కోరికను ప్రేరేపించేలా భాష
శరీరంలో అన్ని భాగాల కంటే మెదడు అత్యంత సెక్సీ భాగం. మెదడులోనే సెక్స్ కోరిక పుడుతుంది. అసభ్యంగా మాట్లాడటం, లేదా అసభ్యకరమైన రీతిలో సెక్స్ గురించి మాట్లాడటం కూడా చాలా ప్రేరేపణ కలిగిస్తుంది.
ఇలాంటి అసభ్యకర భాషకు, చర్చలకు కలిగే స్పందన మెదడులోని హైపోథాలమస్ పై ఆధారపడి ఉంటుంది. ఇది మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉంటుంది.
3) పాప్ పిల్స్
వయాగ్రా లాంటి పిల్స్ లైంగిక సమస్యలకు ఇచ్చే మొదటి చికిత్స. ఇవి ప్రభావవంతంగా పని చేయవచ్చు.
వీటిని డాక్టర్ సలహా పై మాత్రమే తీసుకోవాలి.
4) ఫోర్ ప్లే ప్రాముఖ్యత
ఒక్కొక్కసారి సెక్స్ బోరింగ్ అనిపించవచ్చు. సెక్స్‌లో ఇంటర్ కోర్స్‌కు ముందు సున్నితంగా వ్యవహరించాలి. ఫోర్ ప్లే భాగస్వాములిద్దరినీ ఉద్రేకపరుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
5) సెక్స్ డ్రైవ్
భాగస్వాముల్లో ఇద్దరికీ ఒకే విధమైన లైంగిక ఆసక్తి ఉండాలనే నియమం లేదు. లైంగికంగా భాగస్వాములకున్న ప్రాధాన్యతలను అర్ధం చేసుకోవాలి.
ఇరువురి అవసరాలు తీరేందుకు సర్దుకుపోవాలి.
6) పొగ తాగకూడదు
పొగ తాగడం వల్ల రక్త నాళ సమస్యలు వస్తాయి. పురుషాంగం, స్త్రీల జననాంగాలు, క్లిటోరిస్ కు జరిగే రక్త ప్రసరణ పై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది.
పొగ తాగే మహిళల్లో మెనోపాజ్ మిగిలిన వారితో పోలిస్తే రెండేళ్ల ముందుగానే వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
7) కీగెల్ వ్యాయామం
పురుషులు, స్త్రీలు లైంగిక సామర్ధ్యాన్ని పెల్విక్ కండరాల వ్యాయామం ద్వారా మెరుగుపరుచుకోవచ్చు.
కీగెల్ వ్యాయామాలు చేస్తున్నప్పుడు కండరాలను 2-3 సెకండ్ల పాటు బిగించి వదలాలి. ఇలా ఒక్కొక్కసారి 10చొప్పున రోజుకు 5 సార్లు చేయాలి.
ఇవి కూడా చదవండి:
- క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది, ఈ ఉద్యమంలో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన యోధులెవ్వరు?
- బాసర ట్రిపుల్ ఐటీ: సమస్యలకు నిలయంగా ఎందుకు మారింది, లోపం ఎక్కడుంది?
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












