అమెరికాకు గట్టి జవాబు చెప్పిన భారత్... సోషల్ మీడియాలో జయశంకర్‌పై ప్రశంసలు

ఫొటో సోర్స్, ANI
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ చర్చల్లో నిలిచారు. అమెరికా పర్యటన సందర్భంగా ఆయన ఇచ్చిన సమాధానాలపై భారత్‌లోని సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
2+2 సమావేశంలో పాల్గొనేందుకు భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికాకు వెళ్లారు. ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య ఈ సమావేశం జరిగింది.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌లతో కలిసి వాషింగ్టన్‌లో సోమవారం జయశంకర్ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై ఒక విలేఖరి ప్రశ్నించారు. దీనికి జయశంకర్ సమాధానం చెప్పారు.
''భారత్ కొనుగోలు చేసే చమురు గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. కానీ, యూరప్ ఒకపూటలో కొనుగోలు చేసేంత చమురును.... భారత్ ఒక నెలలో కూడా కొనుగోలు చేయదు. కాబట్టి మీరు యూరప్ గురించి ఆందోళన చెందండి'' అని ఆయన బదులిచ్చారు.
జయశంకర్ ఇచ్చిన ఈ సమాధానం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
భారత్‌లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలను తాము గమనిస్తున్నామని అదే సమావేశంలో పాల్గొన్న అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. బ్లింకెన్ ఈ మాట అన్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్, జయశంకర్ అక్కడే ఉన్నారు. కానీ దీనిపై వారు స్పందించలేదు.
అయితే, బుధవారం వాషింగ్టన్‌లో భారతీయ విలేఖరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ జయశంకర్ ఈ వ్యాఖ్యలపై సూటిగా స్పందించారు.
''వాషింగ్టన్‌లో సోమవారం జరిగిన 2+2 సమావేశంలో భారత్‌లోని మానవ హక్కులపై ఎలాంటి చర్చ జరగలేదు. మన గురించి సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకునే హక్కు వారికి ఉంటుంది. అదే విధంగా, వారిపై మనకున్న అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు మనకూ ఉంది. ఆజ్యం పోయకుండా లాబీయింగ్, ఓటు బ్యాంకు గురించి మాట్లాడే హక్కు మాకుంది. ఈ విషయంలో మేం మౌనంగా ఉండం. ఇతరుల మానవ హక్కులపై మాక్కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. అమెరికాతో సహా ఇక్కడి మానవ హక్కుల పరిస్థితి గురించి మేం చాలా చెప్పగలం'' అని ఆయన అన్నారు.
జయశంకర్ ఇచ్చిన ఈ సమాధానాన్ని సోషల్ మీడియాలో పొగుడుతున్నారు. బీజేపీ నేత కపిల్ మిశ్రా దీనిపై ట్వీట్ చేశారు. ''ఎట్టకేలకు ఒక సులభమైన సత్యాన్ని అమెరికాకు అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పారు. ఇది నయా భారత్. విదేశాంగ మంత్రిగా మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం'' అని ఆయన రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''అభినందనలు. మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తదుపరి దశలో భాగంగా అమెరికాలో మానవ హక్కులపై భారత్ వార్షిక నివేదికను తయారు చేయాలి. ఈ విషయంలో మా జట్టు మీకు సహకరిస్తుంది'' అని రచయిత రాజీవ్ మల్హోత్రా ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్, జయశంకర్ ఇచ్చిన సమాధానాన్ని ప్రశంసించారు.
ఫ్రాన్స్, టర్కీ, రష్యా వంటి అనేక దేశాల్లో కన్వల్ సిబల్ భారత రాయబారిగా పని చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
''జయశంకర్ దౌత్యపరంగా బదులు తీర్చుకోవడం బాగుంది. బ్లింకెన్ వ్యాఖ్యల తర్వాత విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి స్పందించకపోవడంపై భారత్‌లో వస్తోన్న విమర్శలను ఆపాల్సిన అవసరం ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, భాగస్వామ్య విలువలు ఉన్న దేశం అంటూ అమెరికా, భారత్ గురించి మాట్లాడుతుంది. అదే సమయంలో వారు మన ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచేలా కూడా ప్రవర్తిస్తారు. బ్లింకెన్ ప్రకటనలో ఈ తరహా ప్రవర్తనను మనం చూడొచ్చు'' అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
అమెరికా రక్షణ మంత్రి ఏం అన్నారు?
సోమవారం 2+2 సమావేశం తర్వాత సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్... ''భారత్‌లో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలను అమెరికా గమనిస్తోంది'' అని అన్నారు.
''మేం క్రమం తప్పకుండా భారతీయ భాగస్వాములతో మాట్లాడుతుంటాం. భారత్‌లోని కొన్ని ప్రభుత్వాలు, పోలీసు, జైలు అధికారుల వల్ల జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై మేం దృష్టి సారించాం'' అని వ్యాఖ్యానించారు.
భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టామన్న ఆయన అంతకుమించి వివరణ ఏమీ ఇవ్వలేదు. దీనిపై అక్కడే ఉన్న రాజ్‌నాథ్ సింగ్, జయశంకర్ అప్పుడు స్పందించలేదు.
మానవ హక్కుల ఉల్లంఘనపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి అమెరికా సిగ్గుపడుతుందని అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే బ్లింకెన్ భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన సమస్యను లేవనెత్తారు. భారత్‌లోని ముస్లింల గురించి గత వారం ఇల్హాన్, మోదీ సర్కారును విమర్శించారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల గురించి కూడా బ్లింకెన్ మాట్లాడారు.
''అమెరికా, భారత్‌కు భాగస్వామిగా ఉండే పరిస్థితులు లేని కాలంలో రష్యాతో భారత్ సంబంధాలు అభివృద్ధి చెందాయి. కానీ ఇప్పుడలా లేదు. కాబట్టి మమ్మల్ని మిత్రదేశంగా భారత్ పరిగణించాలని కోరుకుంటున్నాం. నిజానికి, రష్యా నుంచి ఇంధన దిగుమతిని ఆపేసేలా మేం అన్ని దేశాలను ప్రోత్సహిస్తున్నాం. ప్రతీ దేశానికి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వారి పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి. కానీ, మా మిత్రదేశాలు, భాగస్వాములు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను అధికం చేయకూడదని మేం కోరుకుంటున్నాం'' అని బ్లింకెన్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై జయశంకర్ ఏం చెప్పారు?
''భారత్ కొనుగోలు చేసే చమురు గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. యూరప్ ఒక పూట కొనుగోలు చేసే చమురును భారత్ నెలరోజుల వ్యవధిలో కూడా కొనుగోలు చేయదు. ముందు, మీరు వారి గురించి ఆందోళన చెందండి'' అంటూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు జయశంకర్ జవాబు ఇచ్చారు.
సోమవారం ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా సమావేశం అయ్యారు. వాషింగ్టన్ నుంచి బైడెన్, మోదీతో మాట్లాడుతున్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్, జయశంకర్ కూడా బైడెన్‌తోనే ఉన్నారు.
వీరితో పాటు ఆంటోనీ బ్లింకెన్, లాయిడ్ ఆస్టిన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా, భారత్‌ల మధ్య 2+2 సమావేశం జరగడం ఇది నాలుగోసారి. యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించి రెండు నెలలు పూర్తి కావొస్తున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










