ఝార్ఖండ్: దేవ్‌గఢ్ రోప్‌వే ప్రమాదంలో చిక్కుకున్నవారిని ఎలా రక్షించారు? ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది

దేవ్‌గఢ్ రోప్‌వే ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, స్నేహ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఝార్ఖండ్ రాష్ట్రం దేవ్‌గఢ్ జిల్లాలో త్రికూట్ పర్వతంపై కేబుల్ కార్లు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 46 మంది ప్రయాణికులు గాల్లో వేలాడుతూ చిక్కుకుపోయారు.

భారత సైన్యం, వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్‌లు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 46 గంటల పాటు సాగింది. రోప్‌వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన 46 మంది ప్రయాణికులను రక్షించారు.

కేబుల్ కార్లలో మొత్తం 48 మంది ఉండగా, వారిలో ఇద్దరు చనిపోయారని, 46 మందిని రక్షించామని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రమాదం ఎలా జరిగింది?

త్రికూట్ పర్వతం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం, ఆకర్షణీయమైన పర్యటక ప్రాంతం. అక్కడ రోప్‌వే ద్వారా పర్యాటకులు ఎత్తైన కొండపైకి వెళ్తుంటారు.

ఆదివారం శ్రీరామనవమి. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాదం జరిగింది.

దేవ్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుభాష్ చంద్ర జాట్ బీబీసీతో మాట్లాడుతూ.. త్రికూట్ పర్వతంపై ఉన్న రోప్‌వే వైరు హుక్ నుంచి బయటకు వచ్చేసిందని, దీంతో వైరుకు వేలాడుతున్న కేబుల్ కార్లు(ట్రాలీలు) కిందకు జారిపోయాయని అన్నారు. దీంతో రెండు ట్రాలీలు రాళ్లను ఢీకొట్టాయి.

దేవ్‌గఢ్ రోప్‌వే ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

రెస్క్యూ ఆపరేషన్

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక అధికారులు, ఐటీబీపీ (ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు) దళం, భారతీయ వాయుసేన సహాయక చర్యలను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ మంగళవారం మధ్యాహ్నం దాకా కొనసాగింది.

వాస్తవానికి కొండకు దగ్గర్లో ట్రాలీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను స్థానిక ప్రజలే రక్షించి, వారికి మద్దతుగా నిలిచారు. అయితే, రోప్‌వే మార్గమధ్యంలో, గాల్లో చిక్కుకుపోయిన ట్రాలీల్లో ఉన్న యాత్రికులను కాపాడేందుకు మాత్రం ఎయిర్‌లిఫ్ట్ అవసరమైంది.

ఈ ఆపరేషన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎంఐ 17 వీ5, చీతా హెలికాప్టర్లను, గరుడ కమాండర్లను రంగంలోకి దించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో మొత్తం 10 కేబుల్ కార్లలో చిక్కుకున్న 35 మంది ప్రయాణికులను ఎయిర్‌లిఫ్ట్ చేసింది.

ప్రభాత్ ఖబర్ దినపత్రిక విలేకరి కమల్ కిషోర్ బీబీసీతో మాట్లాడుతూ.. ఇది చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ అని చెప్పారు. ఎందుకంటే రోప్‌వే పైకి వెళ్లిన తర్వాత 80 డిగ్రీల కోణంలో తిరిగేలా ఈ నిర్మాణం ఉంది. ఎయిర్‌లిఫ్ట్ చేస్తున్న హెలికాప్టర్ల బ్లేడ్‌లు రోప్‌వే వైరును తాకితే అది తెగిపోతుంది. కేబుల్ కార్లు కిందపడిపోతాయి. అలాగని, కింద నుంచి కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన వారిని కాపాడే పరిస్థితి లేదు.

ది హిందూ దినపత్రిక కథనం ప్రకారం.. ఈ ప్రాంతం దట్టమైన అడవిలో కొండలపైన ఉంది. పైగా కేబుల్ కార్లు భూమికి 1500 అడుగుల ఎత్తులో చిక్కుకున్నాయి. కాబట్టి భూమిపై నుంచి సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదు.

766 మీటర్ల పొడవైన ఈ రోప్‌వే భారతదేశంలోనే అతిపెద్ద నిట్టనిలువు రోప్‌వే అని ఝార్ఖండ్ పర్యాటక శాఖ పేర్కొంటోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఇద్దరు ఎలా చనిపోయారు?

త్రికూట్ రోప్‌వే ప్రమాదం జరిగిన తొలిరోజు, సోమవారం నాడు.. ఎయిర్‌లిఫ్ట్ ఆపరేషన్ ప్రారంభంకాకముందే ఒక వ్యక్తి రోప్‌వే నుంచి జారి కిందకు పడిపోయాడు. అతను మరణించాడని అధికారులు తెలిపారు.

ఆపరేషన్ జరుగుతున్న సమయంలో రెండో రోజైన మంగళవారం ఒక మహిళ కూడా కిందకు జారిపడి మరణించారు.

దేవ్‌గఢ్ రోప్‌వే ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

తప్పు ఎవరిది?

శ్రీరామనవమి, ఆదివారం కావడంతో యాత్రికులు అధికసంఖ్యలో వచ్చారని, ఈ రద్దీవల్లే ప్రమాదం జరిగిందని తొలుత అంతా భావించారు. అయితే, ఈ వార్తలను ఝార్ఖండ్ పర్యాటక శాఖ మంత్రి హఫీజుల్ హసన్ ఖండించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''ట్రాలీల్లో ఎక్కాల్సిన ప్రయాణికుల కంటే తక్కువ మందే ఎక్కారు. ఎక్కువ మంది లేరు'' అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ప్రమాదం జరిగిన వెంటనే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఈ ప్రమాదానికి బాధ్యత వహించాల్సింది ఝార్ఖండ్‌‌లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వమే అన్నారు.

''ట్రాలీల్లో ఓవర్ లోడ్ చేశారనే ఆరోపణలు రాలేదు. కానీ, నిర్వహణ లోపం మాత్రం కచ్చితంగా కనిపిస్తోంది. కాంట్రాక్టు కంపెనీ ఈ రోప్‌వేను నిర్వహిస్తోందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే ఈ రోప్‌వే ఝార్ఖండ్ ప్రభుత్వానిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు'' అని నిషికాంత్ దూబె అన్నారు.

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి హఫీజుల్ హసన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బృందంలో రోప్‌వే నిర్వహణకు సంబంధించిన నిపుణులు కూడా ఉంటారని తెలిపారు. ఈ రోప్‌వేను దామోదర్ కంపెనీ నిర్వహిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం ఈ రోప్‌వేను మూసేస్తున్నామని, దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

దేవ్‌గఢ్ రోప్‌వే ప్రమాదం

ఫొటో సోర్స్, ANI

కాగా, ఈ ప్రమాదాన్ని రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనపై సమగ్ర సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 26న జరగనుంది.

కాగా, త్రికూట్ పర్వతం రోప్‌వే ప్రమాదంపై ఝార్ఖండ్ ప్రభుత్వానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఏప్రిల్ 10న జరిగిన ఈ ప్రమాదంలో 18 ట్రాలీల్లో 59 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వీరిని కాపాడామని, అయితే ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు మరణించారని తెలిపారు.

రాష్ట్రంలోని రోప్‌వే ప్రాజెక్టుల నిర్వహణ, మెయింటెనెన్స్‌ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు నిర్వహించాలని, సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో నైపుణ్యం ఉన్న కంపెనీని నియమించాలని, రాష్ట్రంలోని ప్రతి రోప్‌వే ప్రాజెక్టుకూ ప్రత్యేకంగా నిర్వహణ నియమాలు తయారు చేయాలని ఝార్ఖండ్ ప్రభుత్వానికి హోం శాఖ సూచించింది.

వీడియో క్యాప్షన్, బొగ్గు మంటలతో ముసురుకుంటున్న చీకట్లు

గతంలోనూ సాంకేతిక లోపం..

2009లో శ్రావణి మేళా సందర్భంగా ఈ రోప్‌వేను ప్రారంభించారని స్థానిక జర్నలిస్టు కమల్ కిషోర్ చెప్పారు. ప్రారంభోత్సవం రోజే ఒక ట్రాలీ నాలుగు గంటల పాటు గాల్లో నిలిచిపోయిందని తెలిపారు. అప్పుడు మొత్తం 80 మంది ప్రయాణీకులు గాల్లోనే చిక్కుకుపోయారని తెలిపారు.

2014లో కూడా రెండున్నర గంటలపాటు ట్రాలీ గాలిలో చిక్కుకుపోయిందని ఆయన తెలిపారు. అందులోని ప్రయాణికులు కిందకు దిగిన తర్వాత టికెట్ కౌంటర్ దగ్గర తోపులాట జరిగిందని వెల్లడించారు.

దామోదర్ రోప్‌వే ఇన్‌ఫ్రా లిమిటెడ్ (డీఆర్ఐఎల్) ఈ రోప్‌వేను నిర్వహిస్తోంది. ప్రమాదం అనంతరం త్రికూట్ పర్వత రోప్‌వే సైట్ ఇన్‌చార్జి వినీత్ సిన్హా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదం గురించి విని తాను షాక్ అయ్యానని, బాధిత ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులకు తాము మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)