ఆంధ్రప్రదేశ్: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య

పోరస్
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ (ఫార్మాస్యూటికల్)లో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు ధ్రువీకరించారు.

బుధవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ 150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారిలో నలుగురు మంటల్లో చిక్కుకుని ఘటన స్థలంలోనే మరణించారు. ఆస్ప్రతికి తరలిస్తుండగా ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. మరో 11 మందిని సమీపంలోని నూజివీడు, ఏలూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏడుగురు మృతుల్లో ఇద్దరు స్థానికులు, మిగిలిన ఐదుగురు బిహారీలు.

అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోరస్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారు.

యూనిట్ 4లో బ్లాస్ట్ జరిగి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధిక ఒత్తిడితో ఓవర్ హీట్ మూలంగా రియాక్టర్ పేలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమీపంలో రెండో రియాక్టర్ కూడా పేలిపోతుందేమోనని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తంచేశారు.

అగ్ని ప్రమాదం

ఫొటో సోర్స్, ugc

అయితే, పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాంతో మంటలు మరింతగా వ్యాపించకుండా నియంత్రించగలిగతారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ముసునూరు పోలీసులు బీబీసీకి తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యన్నారాయణ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఘటనపై విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ''విజయవాడ ఆస్పత్రిలో 12 మందిని చేర్చారు. మార్గమాధ్యలో ఒకరు మృతి చెందారు. 12 మందికి చికిత్స అందిస్తున్నాం. ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమంగా ఉంది. 70 శాతంపైగా గాయాలయ్యాయి. బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నాం''అని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతి ప్రకటించారు.

మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎం ఆదేశించారు.

ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఘటనపై సంతాపం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

బాధితులతో సోము వీర్రాజు

ఫొటో సోర్స్, ugc

ఫొటో క్యాప్షన్, బాధితులతో సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''బాధితులకు మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలి. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ విషయంలో యాజమాన్యాలు రాజీ పడకూడదు. ప్రమాదానికి కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి''అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరోవైపు అగ్నిప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''రియాక్టర్ పేలి ఆరుగురు సజీవ దహనం కావడం బాధాకరం. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతూ అమాయకులను బలితీసుకుంటున్నాయి. పరిశ్రమల్లో ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి''అని ఆయన అన్నారు.

ప్రమాదంలో గాయపడిన వారిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

వీడియో క్యాప్షన్, నిప్పుతో ఆడుకునే ఆడపిల్లలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)