ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి

అగ్ని ప్రమాదం

చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే అగ్నిప్రమాదాలను నివారించడం చాలా సులభం.

ముందుగా విద్యుత్ ఉపకరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఒకే ప్లగ్‌ పాయింట్‌లో ఒకటి కంటే ఎక్కువ ప్లగ్‌లను ఉపయోగిస్తుంటారు. ఎక్స్‌టెన్షన్ వైర్లపై కొందరు హెవీ ఉపకరణాలను ఉపయోగిస్తుంటారు. అలా చేయడం ప్రమాదం. అలాంటి అవసరాలకు ఎంసీబీలు ఉపయోగించాలి.

వంటచేసే సమయంలో మరుగుతున్న నూనెలో నీరు పడటం... ఇది కూడా ప్రమాదాలకు దారితీస్తుంది. వంట నూనెల వల్ల మంటలు చెలరేగితే ఆర్పడానికి నీళ్లు ఉపయోగించకూడదు. ఎందుకంటే నీరు నూనె కంటే తేలిగ్గా ఉంటుంది. మనం వంట నూనె మంటలపై నీళ్లు చల్లితే, మంటలు మరింత పెరుగుతాయి.

వీడియో క్యాప్షన్, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏం చెయ్యాలి

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ అలార్మ్ మోగించాలి. ఆ తర్వాత ఎవరో ఒకరు ఫైర్ ఇంజన్ కోసం ఫోన్ చెయ్యాలి. అందుబాటులో ఉన్నవాటితో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించాలి.

తర్వాత కుటుంబ సభ్యులు, ఇతరులను ఖాళీ చేయించడం, వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు ప్రయత్నించాలి.

అగ్ని ప్రమాదం

కొంతమందికి ఇంట్లో మంటలు అంటుకున్నప్పుడు ఎలా వెళ్లాలో తెలిసుండదు. మంటలు అంటుకున్నప్పుడు బయటకు వెళ్లేందుకు ఎమర్జెన్సీ రూట్స్ ఎక్కడున్నాయని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎక్కడ మంటలు అంటుకున్నా ఒకే నియమం... ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్లాలి.

అగ్నిప్రమాద సమయాల్లో తమ భవనాల్లో నుంచి ఎలా బయటపడాలో అందరికీ ముందుగానే తెలిసి ఉండాలి. ఒకవేళ మంటల స్థాయి తీవ్రంగా ఉంటే మీరు చెయ్యాల్సిన మొదటి పని... సురక్షిత ప్రాంతానికి వెళ్లడం.

అగ్ని ప్రమాదం

అగ్నిప్రమాదాలను నివారించడం రెండు రకాలు.

ఒకటి మానవ ప్రయత్నం.. నీళ్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వంటి వాటితో మంటలను అదుపుచేయడం.

రెండోది ప్రమాదాలను గుర్తించే ఆటోమేటిక్ వ్యవస్థ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి ఆటోమేటిక్ వ్యవస్థలు ఎంతైనా అవసరం.

అగ్ని ప్రమాదం

ప్రతి అగ్నిమాపక యంత్రం(ఫైర్ ఎక్సటింగ్విషర్) లో కొన్ని ముఖ్యమైన అంశాలుంటాయి. మొదటిది ప్రెజర్ గేజ్. దీనిలో ముల్లు ఇది ఆకుపచ్చ రంగు దగ్గర ఉండాలి. అప్పుడది ఉపయోగానికి సిద్ధంగా ఉందని అర్థం. మనం దీన్ని మంటల మీద నేరుగా ఉపయోగించవచ్చు.

తర్వాతది సేఫ్టీ పిన్. దీన్ని తొలగించి, పైపును మంటల వైపు ఉంచి ఈ లివర్లను ప్రెస్ చెయ్యాలి.

దీనికి చిన్న రూపమే ఈ చిన్న యంత్రం. దీన్ని ఇళ్లలోనూ, కార్లలోనూ ఉపయోగిస్తారు. సేఫ్టీ లాక్‌ను తొలగించి, ప్రెజర్ గేజ్‌ను చెక్ చేసుకుని, మంటల వైపు తిప్పి దీన్ని ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)