దిల్లీ వాయు కాలుష్యం-అరవింద్ కేజ్రీవాల్: వారం రోజులు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు బంద్.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

కాలుష్యం కోరల్లో దిల్లీ (పాత చిత్రం)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలుష్యం కోరల్లో దిల్లీ (పాత చిత్రం)

దేశ రాజధాని దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో దిల్లీ ప్రభుత్వం స్పందించింది.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం ఈ అంశంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

దిల్లీలో పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేయాలని, దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ఇళ్ల నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా సంబంధిత సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే, రాష్ట్రంలో అన్ని నిర్మాణ కార్యక్రమాలను ఆపేయాలని ఆదేశించారు.

సుప్రీంకోర్టు సూచించినట్లుగా పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

దిల్లీ కాలుష్యంపై సుప్రీం కోర్టు సీరియస్... అవసరమైతే లాక్‌డౌన్ విధించాలని సూచన

దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వాతావరణంలో ప్రజలెలా జీవిస్తారని ప్రశ్నించింది. అవసరమైతే రెండు రోజులు లాక్‌డౌన్ విధించే విషయం ఆలోచించాలని సూచించింది.

దాంతో, సుప్రీం కోర్టు స్పందిస్తూ తక్షణమే ప్రభుత్వం కాలుష్య నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం, "దిల్లీలో వాతావరణ కాలుష్యాన్ని 500 ఏక్యూఐ నుంచి 200 పాయింట్లు ఎలా తగ్గించాలో చెప్పండి. తక్షణమే తగిన చర్యలు తీసుకోండి. రెండు రోజుల లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలా జీవిస్తారు?" అని ప్రశ్నించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దిల్లీలో వాయు నాణ్యత 'దారుణ' స్థితికి పడిపోయిందని, పరిస్థితి రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

కేంద్ర ప్రభుత్వం వెంటనే అత్యవసర చర్యలు చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు, "అనంతరం దీర్ఘకాలిక ప్రణాళికల గురించి ఆలోచించాలి" అని కూడా సూచించింది.

దిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు, ఇలాంటి వాతావరణంలో మనం చిన్న పిల్లలను స్కూలుకు పంపించాల్సి వస్తోందని, వారిని కాలుష్యానికి గురి చేస్తున్నామని వ్యాఖ్యానించింది.

వీడియో క్యాప్షన్, దిల్లీలో యమునా నది కలుషిత జలాల్లో ఛట్ పూజలు

కేంద్రం తరఫున సుప్రీం కోర్టులో హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, దిల్లీలో వాయు కాలుష్యానికి సంబంధించిన అత్యవసర స్థితిపై ప్రభుత్వం ఇవాళ్టి సమావేశంలో దృష్టి సారించాల్సి ఉందని తెలిపారు.

దీనికి సంబంధించి వాతావరణ శాఖను సంప్రదించామని, పంట వ్యర్థాలు తగులబెట్టడం వల్ల దిల్లీలో గాలి స్తబ్దంగా మారిందని ఆ శాఖ నిపుణులు తలిపారని కేంద్రం తెలిపింది.

ఈ సమయంలో స్కూళ్లు తెరవడంపై సుప్రీం కోర్టు దిల్లీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. "ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. మీ పరిధిలోకే వస్తుంది. మీరేం చర్యలు తీసుకుంటున్నారు" సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాల్సి ఉంటుందని కేంద్రాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)