కంగనా రనౌత్: ‘1947లో లభించింది స్వాతంత్ర్యం కాదు, భిక్ష.. మనకు స్వాతంత్ర్యం 2014లో వచ్చింది’

కంగనా రనౌత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పుడు ట్విటర్‌లో లేరు. కానీ, ఇన్‌స్టాగ్రామ్, కూ యాప్‌లో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై ట్వీట్ చేయడంతో ఆమె ట్విటర్ అకౌంట్‌ బాన్ చేశారు.

కానీ, ఆ తర్వాత కూడా ఆమె ట్విటర్‌లో చాలాసార్లు ట్రెండ్ అవుతూ వచ్చారు.

పద్మశ్రీ పురస్కారం అందుకున్న రోజు కూడా సోషల్ మీడియాలో కంగనా రనౌత్‌ ట్రెండ్ అయ్యారు. ఇప్పుడు ఆమె మరోసారి పతాక శీర్షికల్లో నిలిచారు.

కానీ, ప్రతిసారీలాగే ఏదో సినిమాలో పాత్ర గురించి కంగనా రనౌత్ ట్రెండ్ కావడం లేదు. తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆమె మరోసారి వార్తల్లోకి వచ్చారు.

స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని కంగనా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"అంతకు ముందుది స్వాతంత్ర్యం కాదు, భిక్ష... మనకు లభించిన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది" అని టైమ్స్ నౌ ఎడిటర్ నావికా కుమార్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.

నవంబర్ 9న ప్రైవేట్ టెలివిజన్ చానల్ 'టైమ్స్ నౌ' 'సెలబ్రేటింగ్ ఇండియా @75' అనే ఒక సమిట్ నిర్వహించింది. దీనికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను కూడా ఆహ్వానించారు.

కంగనాతో సంభాషించే సమయంలో 'బాలీవుడ్ గ్లోబల్ ఎఫెక్ట్' మీద చర్చ జరిగింది. అదే సమయంలో ఆమెను వీర్ సావర్కర్ గురించి కూడా ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు కంగనా రనౌత్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. అందులో స్వతంత్ర పోరాటం నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వరకు ప్రస్తావించారు.

కంగన ఆ ప్రశ్నకు ఇచ్చిన పూర్తి సమాధానాన్ని టైమ్స్ నౌ హిందీ ట్విటర్ హ్యాండిల్లో చూడవచ్చు. అది దాదాపు ఏడున్నర నిమిషాలు ఉంటుంది.

ఆ సమిట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 24 సెకన్ల క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కంగన 1947లో లభించిన స్వాతంత్ర్యాన్ని భిక్షగా చెబుతుంటారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రీతీ మేనన్ దీనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారని బార్ అండ్ బాచ్ ట్విటర్ హాండిల్ చెప్పింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా జరుగుతుందని కంగనా రనౌత్ ముందే అన్నారు. తను ఇలా అంటున్నందుకు నాపైన మరో పది ఎఫ్ఐఆర్‌లు నమోదవుతాయని ఆమె స్వయంగా చెప్పారు.

కంగనా రనౌత్

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియాలో స్పందనలు

కంగనా రనౌత్ ప్రకటనపై రాజకీయంగా తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"మహాత్మా గాంధీ త్యాగం, తపస్సుకు ఇది అవమానం. ఆయన హంతకులను గౌరవిస్తూ, అమరులైన మంగళ్ పాండే, రాణీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లక్షలాది స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాలను అవమానించడమే. ఈ ఆలోచనను పిచ్చితనం అనాలా దేశద్రోహం అనాలా?" అని ప్రశ్నించారు.

వరుణ్ గాంధీ ట్వీట్‌ను చాలా మంది రీ ట్వీట్ చేస్తున్నారు. ఆయన ఫిలిభిత్ ఎంపీ, బీజేపీ సభ్యులు కూడా.

కానీ, వరుణ్ గాంధీ గత కొంతకాలంగా పార్టీ కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో రైతుల ఉద్యమం, చెరకు రైతుల ఆగ్రహం లాంటి ఎన్నో అంశాలపై ఆయన సోషల్ మీడియా ద్వారా నేరుగా సొంత పార్టీనే విమర్శించారు.

ఆ తర్వాత ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు లభించలేదు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

వరుణ్ గాంధీతోపాటూ యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ బీవీ శ్రీనివాస్ కూడా కంగనా ప్రకటనపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని ట్విటర్‌లో డిమాండ్ చేశారు.

ట్విటర్‌లో చాలా మంది యూజర్స్ కూడా కంగనా వ్యాఖ్యలపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కంగనా రనౌత్

ఫొటో సోర్స్, Getty Images

కంగనా ఇంకా ఏమేం అన్నారు?

కంగనా రనౌత్ ఈ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సోషల్ మీడియా నిషేధం నుంచి దేశభక్తి, రాజకీయాల వరకు ఎన్నో అంశాలపై ఓపెన్‌గా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

మిమ్మల్ని ట్విటర్ బాన్ చేయడం వల్ల మీరు ఆ సోషల్ హాండిల్‌ను మిస్ అవుతున్నారా అని టైమ్స్ నౌ సమిట్ 2021లో కంగనను ప్రశ్నించారు.

తనను అలా బాన్ చేయడం బాగా అనిపించిందని కంగన ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బాన్ అనే మాటంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.

మరో ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలని అనుకుంటున్నారు అన్న మరో ప్రశ్నకు "మరో ఐదేళ్లలో నన్ను ఒక భార్యగా, ఒక తల్లిగా చూసుకోవాలనుకుంటున్నా" అని కంగనా రనౌత్ సమాధానం ఇచ్చారు.

మీరు రాజకీయాల్లోకి వస్తారా, లేదా అని కంగనా రనౌత్‌ను ప్రశ్నించినపుడు ఆమె దానికి నేరుగా జవాబు చెప్పలేదు. కానీ తనకు సినీ కెరీర్ అంటేనే ఇష్టమని, ఎందుకంటే దానివల్ల డబ్బు వస్తుందని, మంచి బట్టలు వేసుకోవచ్చని, అఫైర్లు కూడా ఉంటాయని ఆమె చెప్పారు.

వీర్ సావర్కర్ గురించి మాట్లాడిన కంగనా రనౌత్ ఆయనకు తగిన న్యాయం జరగలేదని, ఆయనకు అన్యాయం చేశారని అన్నారు.

17 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్ లాంటి సినిమాతో తన కెరియర్ ప్రారంభించిన కంగనా రనౌత్ 'క్వీన్', 'తను వెడ్స్ మను' లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు.

మూడు నేషనల్ అవార్డులతోపాటూ కమర్షియల్ సినిమాల్లో కూడా ఆమె కెరియర్ ఇప్పటివరకు బాగా సాగుతోంది.

నెపోటిజం, బాలీవుడ్ మాఫియా లాంటి వాటి గురించి కూడా కంగనా రనౌత్ ఓపెన్‌గా మాట్లాడుతుంటారు.

ప్రధానమంత్రి మోదీని, బీజేపీ భావజాలాన్ని కూడా ఆమె బహిరంగంగా సమర్థిస్తుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)