మాస్టర్ కార్డ్ భారత్‌లో కొత్త కార్డులు జారీ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోని వినియోగదారులకు కొత్త డెబిట్, క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా మాస్టర్ కార్డ్‌పై రిజర్వ్ బ్యాంక్ నిరవధిక నిషేధం విధించింది.
మాస్టర్ కార్డ్ కంపెనీ డేటా స్టోరేజ్ చట్టాలను ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆరోపించింది.
ప్రత్యేకంగా భారత్‌లో జరిగే చెల్లింపులకు సంబంధించిన డేటాను నిల్వ చేయడానికి విదేశీ కార్డ్ నెట్‌వర్క్‌లు అనుసరించాల్సిన నిబంధనలను మాస్టర్ కార్డ్ పాటించలేదని బ్యాంక్ చెప్పింది.
దీనిపై మాస్టర్ కార్డ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
జులై 22 నుంచి మాస్టర్ కార్డ్ భారత వినియోగదారులకు డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ కార్డులు జారీ చేయకుండా నిషేధించారు.
రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం వల్ల ప్రస్తుతం మాస్టర్ కార్డ్ వినియోగిస్తున్న వారిపై ఎలాంటి ప్రభావం పడదు.
భారతదేశంలో జరిగే చెల్లింపుల డేటాను నిల్వ చేయాలని నిర్దేశిస్తూ 2018లో ఇచ్చిన ఆదేశాలను మాస్టర్ కార్డ్ ఉల్లంఘించిందని ఆర్బీఐ చెప్పింది.
చాలా సమయం, తగినన్ని అవకాశాలు ఇచ్చినా డేటా స్టోరేజ్ పేమెంట్‌కు సంబంధించిన ఆదేశాలను అది పాటించలేదని తాము గుర్తించామని రిజర్వ్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో చెప్పింది.
గత ఏడాది భారత్‌లో జరిగిన మొత్తం కార్డు చెల్లింపుల్లో మాస్టర్ కార్డ్ వాటా 33 శాతం ఉన్నట్లు లండన్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ పీపీఆర్ఓ ఏఎఫ్‌పీకి చెప్పింది.
ఈ ఏడాది మొదట్లో ఇలాంటి ఉల్లంఘనలకే పాల్పడిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








