చైనా: 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి

కొడుకు కోసం గువో దేశవ్యాప్తంగా ప్రయణించి వెతికారు.

ఫొటో సోర్స్, WEIBO

ఫొటో క్యాప్షన్, కొడుకు కోసం గువో దేశవ్యాప్తంగా వెతికారు.

చైనాకు చెందిన గువో గ్యాంగ్‌టాంగ్ కిడ్నాపైన తన కొడుకు కోసం సాగించిన వెతుకులాట 24 ఏళ్ల తర్వాత ఫలించింది.

ఇందు కోసం ఆయన మోటార్ సైకిల్‌పై దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. చివరికి కొడుకు జాడ కనిపెట్టగలిగారు.

1997 సంవత్సరంలో షాన్‌దాంగ్ ప్రావిన్స్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న గువో రెండేళ్ల కుమారుడిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

డేటింగ్‌లో ఉన్న ఒక జంట చిన్నారిని అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించిందని, ఇందుకోసం కిడ్నాప్ ప్లాన్ వేశారని ‘చైనా న్యూస్‘ వెల్లడించింది.

గువో కుమారుడు ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్నట్లు గుర్తించిన నిందితురాలు బాలుడిని ఎత్తుకొని బస్ స్టేషన్‌లో వేచి చూస్తున్న తన ప్రియుడిని కలిసింది. వీరిద్దరూ కలిసి పొరుగునే ఉన్న హెనాన్ ప్రావిన్స్‌‌లో చిన్నారిని అమ్మేశారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

5 లక్షల కిలోమీటర్ల ప్రయాణం

1997లో తన కొడుకు అపహరణకు గురయ్యాక, గువో అతన్ని వెతుకుతూ మోటారుబైక్‌పై 20 ప్రావిన్సులకు పైగా ప్రయాణించారు.

ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో గువో అనేకసార్లు ఎముకలు విరగ్గొట్టుకున్నారు. దారి దోపిడీలకు గురయ్యారు. అతని ప్రయాణంలో 10 మోటార్ సైకిళ్లు దెబ్బతిన్నాయి.

ఎవరైనా గుర్తుపట్టి సమాచారం ఇస్తారన్న ఆశతో, తన వాహనానికి కొడుకు ఫొటోను బ్యానర్‌గా ఏర్పాటు చేసి ప్రయాణం సాగించారు గువో.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

గువో తాను సంపాదించిన సొమ్మంతా కొడుకును కనిపెట్టడం కోసం ఖర్చు చేశాడని, డబ్బు కోసం ఒక్కోసారి భిక్షాటన కూడా చేశాడని, బ్రిడ్జిల కింద పడుకునే వాడని అతని స్నేహితులు వెల్లడించారు.

తన కుమారుడిని కనుక్కునే క్రమంలో చైనాలో తప్పిపోయిన వ్యక్తుల్ని వెతికి పెట్టే సంస్థలో కీలక సభ్యుడిగా మారారు గువో. కనీసం ఏడుగురు చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో ఆయన సాయపడ్డారు.

డీఎన్ఏ పరీక్ష ఆధారంగా గువో కుమారుణ్ని పోలీసులు గుర్తించారని చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది. ఇందులో అనుమానితులైన ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ‘గ్లోబల్ టైమ్స్’ వార్తా సంస్థ పేర్కొంది.

గువో కుమారుడు హెనాన్ ప్రావిన్స్‌‌లో ఉంటున్నట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి.

'నా బిడ్డ దొరికాడు. నాకు ఇక అంతా సంతోషమే' అని గువో విలేఖరులతో అన్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఏళ్ల నిరీక్షణ తర్వాత గువో తన కొడుకుని కలుసుకున్నారనే వార్త బయటకి రాగానే చైనా సామాజిక మాధ్యమాలలో ఆయనకు అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.

'చాలామంది తల్లిదండ్రులు ఎప్పుడో ఆశలు వదులుకునేవారు. కానీ గువో అద్భుతమైన వ్యక్తి. అతని ప్రయత్నం చాలా గొప్పది’ అని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ వీబోలో ఒక వ్యక్తి తన చెప్పారు.

తన బిడ్డ కోసం గువో ఆరాటం స్ఫూర్తిగా 2015లో 'లాస్ట్ ఆర్ఫన్స్' (Lost Orphans) పేరిట సినిమా కూడా వచ్చింది. ఇందులో హాంగ్‌కాంగ్ సూపర్ స్టార్ ఆండీ లావ్ నటించారు.

దశాబ్ధాలుగా చైనాలో శిశువులను అపహరించడం, అక్రమ రవాణా చేయడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ ఏటా 20వేల మంది చిన్నారులు అపహరణకు గురవుతారని 2015లో అంచనా వేశారు.

వీరిలో చాలామందిని స్వదేశంలో, విదేశాల్లో దత్తత తీసుకునే వారికి అమ్ముతారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)