పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలే ఆయుధాలు సమకూర్చుకోవాలా.. వ్యాక్సీన్ విషయంలో కేంద్రం తీరుపై కేజ్రీవాల్ ఆగ్రహం - Newsreel

కేజ్రీవాల్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ విషయంలో కేంద్రం తీరుపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహించారు.

పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రాష్ట్రాలు దేనికవి ఆయుధాలు సమకూర్చుకోవాలని ఇలాగే వదిలేస్తారా అంటూ మండిపడ్డారు.

''కేంద్రం వ్యాక్సీన్లను ఎందుకు కొనుగోలు చేయడం లేదు. కోవిడ్‌తో యుద్ధం చేస్తున్న వేళ ఆ బాధ్యత రాష్ట్రాలకు ఎందుకు వదిలేసింది? పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే రక్షణ బాధ్యత రాష్ట్రాలకు వదిలేస్తారా? ఉత్తర ప్రదేశ్ సొంతంగా ట్యాంకర్లు కొనుక్కుని.. దిల్లీ సొంతంగా ఆయుధాలు కొనుక్కుని యుద్ధం చేయాలా?'' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

''దిల్లీలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి నాలుగు రోజులుగా వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ఒక్క దిల్లీలోనే కాదు దేశమంతా ఇలాగే ఉంది. అనేక వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. కొత్త సెంటర్లు ఓపెన్ చేయడానికి బదులు ఉన్నవి మూసేయాల్సి వస్తోంది. ఇది మంచిది కాదు'' అన్నారాయన.

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ 'ఆక్సిజన్ బ్యాంక్' సేవలు ప్రారంభం

నటుడు, చిరంజీవి తన పేరున ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు ప్రారంభించినట్లు స్వయంగా ట్వీట్ చేశారు.

జూబ్హీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి ఐ అండ్ బ్డ్ బ్యాంక్ కేంద్రంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఈ సేవలను ప్రారంభించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

చిరంజీవి ఆక్సిజన్ బాంక్స్ సేవలు ఈరోజు (మే 26) ఉదయం నుంచి అనంతపూర్, గుంటూరు జిల్లాల్లో వినియోగించుకోవచ్చని ఆయన తన ట్విటర్‌లో తెలిపారు.

రేపటిలోగా మరో ఐదు జిల్లాల్లోని కరోనా రోగులకు ఆక్సిజన్ బ్యాంక్స్ అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్

అవసరమైనప్పుడు ఆక్సిజన్ అందక ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభించామని తెలిపారు.

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ తరఫున అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు అందించనున్నారు. వీటిని ఆయా జిల్లాలకు తరలించారు.

దిల్లీ హైకోర్టుకు వాట్పాప్

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ హైకోర్టుకు వాట్సాప్.. ఐటీ నిబంధనలను సవాల్ చేస్తూ పిటిషన్

కేంద్రం తాజాగా విధించిన ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ దిల్లీ హైకోర్టుకు వెళ్లింది.

తాజా నిబంధనల ప్రకారం వాట్సాప్ తమ యాప్ ద్వారా పంపించే కొన్ని సందేశాలను మొదట ఎవరు పంపారో, వారిని గుర్తించాల్సి ఉంటుంది.

కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021(ఇంటర్‌మీడియరీ గైడ్ లైన్స్ అండ్ మీడియా ఎథిక్స్ కోడ్) నిబంధనలను వాట్సాప్ సవాలు చేసింది.

ఒక సమాచారాన్ని మొదట ఎవరు పంపారో గుర్తించే నిబంధనలు రూపొందించడం కోసం తమకు మధ్యస్థ వేదికలు అవసరమని వాట్సాప్ తెలిపింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణ కోసం కేంద్రం బుధవారం నుంచి ఈ కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

ఈ నిబంధనలను తక్షణమే నిలిపివేయాలని కోరిన వాట్సాప్‌.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో ఫిర్యాదు చేసింది.

కేంద్రం అమలు చేసిన కొత్త నిబంధనలు యూజర్ల వ్యక్తిగత గోపత్యకు భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సాప్‌ ఆరోపిస్తోంది.

కొత్త ఐటీ నిబంధనల ప్రకారం భారత దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారంతో ఏవైనా పోస్టులు పెడితే వాటిని మొదట ఎవరు పెట్టారు వంటి వివరాలను ఆయా సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.

అయితే, భారత రాజ్యాంగం ప్రకారం ఇది పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కున హరిస్తుందని వాట్సాప్ వాదిస్తోంది.

అంతేకాదు.. వాట్సాప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని.. తాజా నిబంధనలను అనుసరిస్తే ఎన్‌క్రిప్షన్ సాధ్యం కాదని వాట్సాప్ అంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)