రాందేవ్ బాబా: అల్లోపతీ వైద్యాన్ని కించపరిచారంటూ ఐఎంఏ లీగల్ నోటీసులు

ఫొటో సోర్స్, Getty Images
అల్లోపతీ, శాస్త్రీయ వైద్యాన్ని కించపరిచారంటూ యోగా గురు రాందేవ్ బాబాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లీగల్ నోటీసులు పంపింది.
అల్లోపతీ ఒక ‘‘పిచ్చి శాస్త్రం’’ అంటూ రాందేవ్ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో వాట్సాప్‌లో వైరల్ అవుతోంది.
రెమెడెసివిర్, ఫావిఫ్లూ సహా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించిన ఔషధాలు కోవిడ్-19 రోగులకు సాంత్వన చేకూర్చడం విఫలమయ్యాయని వీడియోలో రాందేవ్ వ్యాఖ్యానించారు.
ఆధునిక వైద్యులను హంతకులుగానూ గతంలో ఆయన వ్యాఖ్యానించారు.
రాందేవ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఐఎంఏ, ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను కూడా కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
రాందేవ్‌పై ఆరోపణలను ఖండించిన పతంజలి
రాందేవ్‌పై వస్తున్న ఆరోపణలను పతంజలి యోగాపీఠ్ ఖండించింది. రాత్రి, పగలు తేడా లేకుండా ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై రాందేవ్‌కు చాలా గౌరవముందని తెలిపింది.
తనకు వచ్చిన ఓ వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజ్‌ను కార్యక్రమంలోని ఇతర సభ్యుల ముందు చదివి వినపిస్తుండగా ఆ వీడియో తీశారని పతంజలి ట్రస్ట్ వివరించింది.
''ఆధునిక వైద్యం విషయంలో స్వామీజీకి ఎలాంటి దురుద్దేశాలు లేవు. వైద్యుల విషయంలోనూ ఆయనకు మంచి అభిప్రాయమే ఉంది. ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదు''అని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని పతంజలి ట్రస్టు జనరల్ సెక్రటరీ ఆచార్య బాలకృష్ణ ప్రకటనలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏమిటి
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్‌లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








