పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

‘పద్దెనిమిదేళ్లు దాటినవారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ మొదలవుతుంది. వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకోవడానికి ముందు మీ నెలసరి తేదీలను ఒక సారి చూసుకోండి. నెలసరికి అయిదు రోజుల ముందు అయిదు రోజుల తర్వాత వ్యాక్సీన్ తీసుకోవద్దు. నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గిపోయి నెమ్మదిగా పెరుగుతుంది. నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో వ్యాక్సీన్ తీసుకోవద్దు" అంటూ ఓ సందేశం వాట్సాప్‌లో షేర్ అవుతోంది.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోకూడదంటూ అనుమానాలకు దారి తీసేలా ఆ సందేశం ఉంది.

ఈ వ్యాక్సీన్ నెలసరి సమయంలో తీసుకోవడం వల్ల శరీరం పై ఏమైనా ప్రభావం ఉంటుందా? నెలసరి సమయంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందా?

ఇలాంటి అనుమానాల నివృత్తికి ‘బీబీసీ మరాఠీ’ నానావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ గాయత్రి దేశ్ పాండేతో మాట్లాడింది.

"నెలసరి ఒక సహజ ప్రక్రియ. వ్యాక్సీన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందరికీ ఇంటి నుంచి పని చేసే అవకాశం లేకపోవచ్చు. కొందరు రోజూ ఆఫీస్‌కి వెళ్తుంటారు. కొందరు అత్యవసర విభాగాలలో పని చేస్తూ ఉంటారు. వారి నెలసరి ఎప్పుడైనా కావచ్చు. వారు వ్యాక్సీన్ కోసం నమోదు చేసుకుంటే ఎప్పుడైనా వెళ్లి వ్యాక్సీన్ తీసుకోవచ్చు" అని డాక్టర్ గాయత్రి చెప్పారు.

వ్యాక్సీన్ వల్ల శరీరానికి ఏమీ హాని కలగదని ఆమె స్పష్టం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భారత ప్రభుత్వం ఏం చెబుతోంది?

వ్యాక్సీన్ వల్ల నెలసరి ప్రభావితమవుతుందనే సమాచారం వైరల్ కావడంతో ఆ వాదనను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది.

నెలసరికి అయిదు రోజుల ముందు, తర్వాత వ్యాక్సీన్ తీసుకోకూడదని వస్తున్న సందేశం తప్పు అని ప్రకటనలో పేర్కొంది.

18 ఏళ్లు దాటిన వారి కోసం కోవిన్ వెబ్ సైటులో, యాప్‌లో ఏప్రిల్ 28 నుంచి నమోదు చేసుకోవచ్చు అని చెబుతూ వదంతులను నమ్మొద్దని చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మరోవైపు నీతిఅయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ కూడా దీనిపై స్పందించారు.

పీరియడ్స్‌లో ఉన్న మహిళలు కూడా నిరభ్యంతరంగా టీకా వేసుకోవచ్చని.. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

కోవిడ్ 19 సోకితే రుతుక్రమం మారుతుందా?

మహారాష్ట్రలో కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారు.

"కరోనా నుంచి బయటపడిన చాలా మంది మహిళలు వారి రుతుక్రమం మారినట్లు చెప్పారు. వారి నెలసరిలో జాప్యం జరగడం, రక్తస్రావంలో మార్పులు చోటు చేసుకోవడం, అధిక రక్త స్రావం వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారని ఫోర్టిస్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సోనల్ కుమ్టా చెప్పారు.

అయితే, కోవిడ్-19 వల్ల నెలసరి ప్రభావితం అవుతుందో లేదో కచ్చితంగా చెప్పలేమని ఆమె అన్నారు.

కోవిడ్ 19 సోకినవారి గర్భనాళాలు వాచినట్లు అధికారికంగా నమోదైందని, జేజే హాస్పిటల్ గైనకాలజి విభాగం మాజీ ప్రధాన అధికారి డాక్టర్ అశోక్ ఆనంద్ చెప్పారు.

గర్భ నాళాల్లో వాపు చోటు చేసుకుంటే నెలసరి సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా?

అమోనేరియా అంటే ఏమిటి?

అమోనేరియా అంటే నెలసరి సక్రమంగా రాకపోవడం అని వెబ్ఎండీ వెబ్‌సైట్ పేర్కొంటోంది.

ఈ సమస్య ఉన్న మహిళలకు నెలసరి రాదు. ఇది రోగం కాదు. కానీ, దీని గురించి డాక్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది.

నెలసరిపై కరోనా ప్రభావం చూపిస్తుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

"సాధారణంగా మహిళలు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయినప్పుడు వారి నెలసరిలో మార్పులు వస్తాయి.

కొంత మందికి అధిక రక్తస్రావం, కొంత మందికి తక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

కానీ, కోవిడ్ సోకిన వారెవరూ ఇలాంటి సమస్యలతో నా దగ్గరకు రాలేదు" అని ముంబయికి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ కోమల్ అన్నారు. అయితే, దీనిపై అధ్యయనాలు జరగవలసిన అవసరం ఉందని చెప్పారు.

టీకా

ఫొటో సోర్స్, JOHN CAIRNS/UNIVERSITY OF OXFORD

కోవిడ్ మహిళల పునరుత్పత్తి సామర్ధ్యంపై ప్రభావం చూపుతుందా?

కరోనా సోకిన తర్వాత శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.

కొంతమందికి ఊపిరితిత్తుల సమస్యలు, కొందరికి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

"రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల పునరుత్పత్తి సామర్ధ్యం కూడా తగ్గుతుంది" అని డాక్టర్ సోనల్ చెప్పారు.

మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

· పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం అవసరం

· తగిన విశ్రాంతి

· సమయానికి నిద్రపోవడం

· ఎక్కువ సేపు కూర్చుని ఉండే పని చేయకూడదు. పని చేస్తున్నప్పుడు మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి

లాక్ డౌన్ లో మహిళలు నెలసరి సమస్యలు ఎదుర్కొన్నారా?

"లాక్ డౌన్ సమయంలో పీసీఓడీ సమస్యతో ఉన్న మహిళలు వ్యాయామం చేయలేదు. చాలా మంది ఇంటి నుంచే పని చేస్తూ ఉండటంతో వారి ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. వారు జంక్ ఆహారాన్ని తినడం మొదలు పెట్టారు.

దాంతో, నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నారు" అని డాక్టర్ మంజరి చెప్పారు.

(ఈ కథనాలను హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)