పశ్చిమ బెంగాల్‌లో హింస: 72 గంటలు ఈ జిల్లాలోకి రాజకీయ నాయకులు ప్రవేశించొద్దు

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్లో ఒక పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిన కాల్పులలో నలుగురు మరణించారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
మరో చోట టీఎంసీ-బీజేపీ మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఒకరు చనిపోయారు
పశ్చిమ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో 44 స్థానాలకు శనివారం నాలుగో దశ పోలింగ్ జరిగింది.
కూచ్‌బిహార్ జిల్లాలోని శీతల్‌కుచీ ప్రాంతంలోకి వచ్చే జోడాపాట్‌కీలో సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు చనిపోయారని చెబుతున్నారు.
ఈ ఘటనతో శీతల్‌కుచీ అసెంబ్లీ స్థానంలోని 125, 126 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీనికి సంబంధించి విస్తృత నివేదిక, వీడియో ఫుటేజ్ అందించాలని కోరింది.
తప్పని పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరపాల్సి వచ్చిందని ఎన్నికల సంఘం పేర్కొంది.
కొందరు వ్యక్తులు కలిసి భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించారని, దాంతో క్యూలలో నిలబడి ఉన్న ప్రజల ప్రాణాలను, పోలింగ్ సిబ్బందిని కాపాడేందుకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది అక్కడ కాల్పులు జరిపారని తెలిపింది.
ఈ నేపథ్యంలో బయటి రాజకీయ నాయకులెవరూ 72 గంటల పాటు కూచ్ బెహార్ జిల్లాలోకి ప్రవేశించడానికి వీళ్లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది.

ఫొటో సోర్స్, ANI
ఉత్తర బెంగాల్లోని సిలిగురిలో పీఎం నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
"కొంతమంది ఘటనా స్థలంలో ఎన్నికల డ్యూటీ చేస్తున్న జవాన్లను చుట్టుముట్టారు. వాళ్ల రైఫిళ్లు లాక్కోడానికి ప్రయత్నించారు. దాంతో జవాన్లు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. మరొకరిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయారు. మృతులకు మాథాభాంగా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. బుల్లెట్ల తగలడం వల్ల గాయపడిన మరో నలుగురిని కూడా అదే ఆస్పత్రిలో చేర్పించాం" అని ఓ సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మూడు రోజుల క్రితం శీతల్‌కుచీ ప్రాంతంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్ మీద దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు పగలగొట్టారు.
ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతంలో బలగాలను భారీగా మోహరించారు. ఈ ఘటన జోడాపాట్కీ ప్రాంతంలోని 126వ నంబర్ పోలింగ్ కేంద్రం దగ్గర జరిగిందని పోలీసులు చెప్పారు.
సీఆర్‌పీఎఫ్ జవాన్లు బీజేపీ మద్దతుదారుల కోసం పనిచేస్తున్నారని టీఎంసీ స్థానిక కార్యకర్తలు ఆరోపించారు.
"జనం ప్రశాంతంగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. అదే సమయంలో జవాన్లు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా హఠాత్తుగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దాంతో నలుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు" అన్నారు.
కాగా, ఘటన జరిగినట్లుగా చెబుతున్న బూత్ వద్ద సీఆర్‌పీఎఫ్ జవాన్లు విధుల్లో లేరని.. ఈ ఘటనలోనూ వారి ప్రమేయం లేదని సీఆర్‌పీఎఫ్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకు ముందు ఉదయం టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణలో బుల్లెట్ తగిలి 18 ఏళ్ల ఆనంద్ బర్మన్ అనే యువకుడు చనిపోయినట్లు అధికారులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








