అసెంబ్లీ ఎన్నికలు: సాయంత్రం 5.30 గంటలకు తమిళనాడులో 63.47శాతం, బెంగాల్‌లో 77.68శాతం పోలింగ్

ఫొటో సోర్స్, ANI
కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి.
అస్సాంలో మూడవ దశ అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా ముగిసాయి.
సాయంత్రం 5.34 నిమిషాల సమయానికి అస్సాంలో 78.94శాతం, కేరళలో 69.95 శాతం పోలింగ్ నమోదైంది.
పుదుచ్ఛేరిలో 77.90 శాతం, తమిళనాడులో 63.47 శాతం, పశ్చిమ బెంగాల్ లో 77.68 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెస్ నేత, పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ కేరళలోని తిరువనంతపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
"ఉదయం 10 గంటలకు 20 శాతం పోలింగ్ నమోదు కావడం చాలా ఎక్కువ. ఓటింగ్ శాతం కనుక భారీగా ఉంటే యూడీఎఫ్ విజయం ఖాయం" అని థరూర్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత, ప్రజలందరూ తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చెన్నైలోని థౌజండ్‌లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిలో బరిలోకి నిలిచిన ఖుష్పూ, డీఎంకే కార్యకర్తలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు.
కేరళలో కాంగ్రెస్ నేత ఎకె ఆంటొని తిరువనంతపురంలోని హైస్కూల్‌లో ఓటు వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
చెన్నైలో ఈ ఉదయం సినీనటుడు రజినీకాంత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా పోలింగ్ బూత్ వద్ద అభిమానులు, మీడియా ప్రతినిధుల రద్దీ కనిపించింది.
టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు...
పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియాలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ నాయకుడి ఇంట్లో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు దొరికాయి. దీంతో ఆ సెక్టార్ అధికారితో పాటు, సెక్టార్ పోలీసును కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది.

ఫొటో సోర్స్, ANI
సదరు ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను స్టాక్ నుంచి వేరు చేశామని, ఎన్నికల ప్రక్రియలో వాటిని వాడటం లేదని ఎన్నికల సంఘం తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ఎన్నికల పర్యవేక్షకుడు నీరజ్ పవన్ ఈ యంత్రాల సీల్‌ను పరిశీలించారని, ఆయన ఆధ్వర్యంలో వాటిని స్టాక్ నుంచి వేరు చేశామని ఎన్నికల సంఘం తెలిపినట్లు వివరించింది.
ఈ వ్యవహారంలో బాధ్యులైనవారందరిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

ఫొటో సోర్స్, EPA
ముగిసిన పోలింగ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంగళవారం పోలింగ్ జరిగింది..
ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తంగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 475 స్థానాలకు మంగళవారమే పోలింగ్ జరిగింది.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో మొత్తం అన్ని స్థానాలకూ పోలింగ్ ఎన్నికలు నిర్వహించారు.
బెంగాల్‌లో ఈ రోజు జరిగేది మూడో దశ పోలింగ్. మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది.
ఇక అసోం ఎన్నికల్లో చివరి, మూడో దశ పోలింగ్ మంగళవారమే పూర్తవుతుంది. ఈ రాష్ట్రాల ఎన్నికలన్నింటి ఫలితాలు మే 2న వెల్లడి కానున్నాయి.
ఓటు వేసిన రజినీకాంత్, కమల్ హాసన్, పన్నీర్‌సెల్వం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ ఓటు వేశారు. చెన్నైలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ కేంద్రంలో రజినీకాంత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇక ఈసారి ఎన్నికల్లో కమల్ హాసన్ మక్కల్ నీదిమయ్యం అన్న పార్టీ పెట్టి, పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా తన ఇద్దరు కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్‌లతో పాటు చైన్నై హైస్కూల్‌లో ఓటు వేశారు.
ఏఐఏడీఎంకే పార్టీ నాయకుడు, మాజీ సీఎం పన్నీర్ సెల్వం పెరియకులంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
తమిళ సినీనటుడు విజయ్ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు సైకిల్‌పై వచ్చారు. రోడ్డుపై విజయ్ సైకిల్ తొక్కుతూ వెళ్తుండగా కొంత మంది అభిమానులు ఆయన్ను బైక్‌లపై అనుసరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
తమిళనాడు:
అధికార పార్టీ ఏఐఏడీఎంకే... ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది.
ప్రధాన ప్రతిపక్షం డీఎంకే... కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతోంది. వైకో నేతృత్వంలోని మారుమలార్చీ ద్రవిడ మున్నేట్ర కళగంతోపాటు మరో ఎనిమిది చిన్న పార్టీలు కూడా డీఎంకే గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. సీపీఎం, సీపీఐ కూడా డీఎంకేతో జత కట్టాయి.
తమిళనాడు అసెంబ్లీలో మొత్తంగా 234 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది.
బెంగాల్:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, పదేళ్ల నుంచీ రాష్ట్రాన్ని పాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ నెలకొంది.
రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 294.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, 148 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
కేరళ:
ప్రస్తుతం రాష్ట్రంలో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష పార్టీల కూటమి ఎల్‌డీఎఫ్ అధికారంలో ఉంది.
ప్రభుత్వం తమ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే... కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి యూడీఎఫ్ పాలన పగ్గాలను తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇక బీజీపీ రాష్ట్రంలో తమ బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.
కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. అధికారం దక్కాలంటే 71 సీట్లు కావాలి.
అస్సాం:
రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ కూటముల మధ్య పోటీ నెలకొంది.
ఎన్డీయే కూటమిలో అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్స్ (యూపీపీఎల్) ఉన్నాయి.
ఏఐయూడీఎఫ్‌లో బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఆంచలిక్ గణ్ మోర్చా, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం 64 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
పుదుచ్చేరి:
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. ఎన్నికైన ముఖ్యమంత్రితో కలిసి నామినేట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తారు.
గత ఫిబ్రవరి 22న అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి పదవికి వీ నారాయణ స్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకేతో కలిసి బరిలోకి దిగింది. కొన్ని చిన్న పార్టీలు, వామపక్షాలు కూడా వీరి కూటమిలో ఉన్నాయి.
మరోవైపు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది.
పుదుచ్చేరి అసెంబ్లీలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు స్థానాలకు ప్రముఖులను నామినేట్ చేస్తారు. మిగతా 30 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 5 రిజర్వుడు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- తేనెటీగలు లేకుండా తేనెను, ఆవులు లేకుండా పాలను తయారు చేస్తున్నారు!
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)