పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను కొట్టిన నిరసనకారులు...సీఎం ఇంటి ముందు బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళన- Newsreel

ఫొటో సోర్స్, Gulshan
పంజాబ్‌లోని అబోహార్ నియోజక వర్గ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై ముక్త్సర్‌లో జరిగిన దాడికి నిరసనగా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు చండీగఢ్‌లోని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అధికారిక నివాసం ముందు ఆందోళనకు దిగారు.
ఈ వ్యవహారంపై బీజేపీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు అశ్వినీ శర్మ నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసింది.
ఆ తర్వాత పంజాబ్ సీఎం ఇంటి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఈ నిరసన సందర్భంగా పంజాబ్ బీజేపీ శాఖ అధ్యక్షుడు అశ్వినీ శర్మ ఆరోపించారు.
"ప్రతిపక్ష బీజేపీకి తన అభిప్రాయం చెప్పే హక్కు కూడా లేదా?" అని శర్మ ప్రశ్నించారు.
"ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికే అరుణ్ నారంగ్ అక్కడికి వెళ్లారు. ఆయన చేసిన తప్పేంటో అర్ధం కాలేదు. కానీ మీరు బీజేపీ గొంతు నొక్కలేరు" అని ఆయన అన్నారు.
"బీజేపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదని చెప్పడానికే మేం ఇక్కడికి వచ్చాం. ఆయన వెంటనే రాజీనామా చేయాలి" అని మరో ఎమ్మెల్యే తిక్షాన్ సూద్ డిమాండ్ చేసినట్లు పీటీఐ పేర్కొంది.
అరుణ్ నారంగ్‌పై జరిగిన దాడిని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం ఖండించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, ARUN NARANG/FB
బీజేపీ ఎమ్మెల్యేను కొట్టిన నిరసనకారులు
శనివారం నాడు పంజాబ్, ముక్త్సర్ జిల్లాలోని మలోట్‌లో రైతులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై రైతు నిరసనకారులు చేయి చేసుకున్నారు. నారంగ్‌ను చుట్టుముట్టి దాడి చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
అరుణ్ నారంగ్‌ను కాపాడే ప్రయత్నంలో ఎస్పీ గుర్మయిల్ సింగ్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆరుణ్ నారంగ్ దుస్తులు పూర్తిగా చినిగిపోయాయి.
"పంజాబ్‌లోని అబోహార్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ తమ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొనడానికి శనివారం మలోట్‌కు వచ్చారు. అక్కడ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు వాళ్లు దాడి చేయడం ప్రారంభించారు. ఈ ఘర్షణలో ఎస్పీ గుర్మయిల్ సింగ్ తలకు, కాళ్లకు గాయాలయ్యాయి" అని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
విలేఖరుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నారంగ్, కారు దిగడంతోనే నిరసనకారులు చుట్టుముట్టారు దాంతో, ప్రెస్ కాన్ఫరెన్సు కూడా రద్దయింది.
కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతమైందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ మరునాడు విలేఖరుల సమావేశంలో పాల్గొనేందుకు అరుణ్ నారంగ్ మలోట్‌కు చేరుకున్నారు. దాడి తరువాత మీడియాతో మాట్లాడిన నారంగ్, కారు దిగిన వెంటనే చాలా మంది వచ్చి దాడి చేశారని చెప్పారు. తమకు రక్షణ కల్పించేందుకు పోలీసులు కూడా అక్కడ తగిన సంఖ్యలో లేరని ఆయన అన్నారు.
ఈ ఘటన గురించి పార్టీ పెద్దలకు వివరించానని నారంగ్ చెప్పారు. మలోట్ స్టేషన్లో ఈ దాడిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ఏఎన్ఐ తెలిపింది.
కాగా, ఎమ్మెల్యేపై దాడి దురదృష్టకరమని సంయుక్త కిసాన్ మోర్చా విచారం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు – అయిదుగురు ఆందోళనకారులు మృతి
- సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ నౌకను ఎలా బయటకు తీస్తారు
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’.. తెలుగు రాష్ట్రాల్లో 104 మందిలో యూకే, 20 మందిలో దక్షిణాఫ్రికా వేరియంట్
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- బాత్ సోప్‌లు, టూత్ పేస్టులు, కాస్మెటిక్స్‌లో వాడే ట్రైక్లోసాన్... నరాలను దెబ్బతీస్తోందా?
- భవిష్యత్తులో భారత్, చైనాలలో పెరగనున్న కవలలు
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









