రజినీకాంత్‌ను డిశ్చార్జ్ చేసిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు - BBC Newsreel

రజనీకాంత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాత చిత్రం

అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సినీ నటుడు రజినీకాంత్‌ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

రజినీకాంత్‌కు నిర్వహించిన పరీక్షల నివేదికలు వచ్చాయని, వాటిల్లో ఏ ఒక్కటీ ఆందోళనకరంగా లేదని అపోలో ఆస్పత్రి ఆదివారం ఉదయం తెలిపింది. మధ్యాహ్నం వైద్యుల బృందం రజినీకాంత్‌ను పరీక్షించి, ఆయన్ను ఎప్పుడు డిశ్చార్జి చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటుందని ఆస్పత్రి యాజమాన్యం చెప్పింది. ఇప్పుడు ఆయన్ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

రజినీకాంత్

ఫొటో సోర్స్, facebook/SunPictures

ఫొటో క్యాప్షన్, అన్నాత్తే సినిమా షూటింగ్ గ్యాప్‌లో రజినీకాంత్ (పాత చిత్రం)

'అన్నాత్తే' సినిమా షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ ఇటీవల హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ బృందంలో నలుగురికి కోవిడ్-19 సోకిందని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో రజినీకాంత్‌కు కూడా కోవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ అని వచ్చిందని. అయితే, ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులు కనిపించడంతో ఈనెల 25వ తేదీన ఆస్పత్రిలో చేరారని అపోలో యాజమాన్యం తెలిపింది.

ఈ పరిస్థితుల వల్ల అన్నాత్తే షూటింగ్‌ను వాయిదా వేసినట్లు ఈనెల 23వ తేదీన సన్ పిక్చర్స్ వెల్లడించింది.

అజింక్య రహానే సెంచరీ

ఫొటో సోర్స్, Getty Images

IND vs AUS: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్.. రెండో టెస్టులో పైచేయి సాధించిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పైచేయి సాధించింది.

రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 277 పరుగులు సాధించింది.

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న అజింక్య రహానే 104 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. 200 బంతులు ఆడిన రహానే 12 ఫోర్లు కొట్టాడు.

రహానేకు తోడుగా జడేజా 40 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)