రియా చక్రవర్తి అరెస్ట్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ట్విస్ట్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
సినీ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ముంబైలో అరెస్ట్ చేసింది.
దీంతో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మాదక ద్రవ్యాల వినియోగం కోణాన్ని ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తోంది.
సుశాంత్ స్నేహితురాలైన రియా చక్రవర్తి సోదరుడు శోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ మేనేజర్ శామ్యూల్ మిరాందాలను ఎన్ఐఏ ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పపించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తాజాగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కె.పి.ఎస్.మల్హోత్రా వెల్లడించారు.
మాదకద్రవ్యాల కోణంలో రియాను ఎన్‌సీబీ మూడు రోజుల పాటు ప్రశ్నించింది.

ఫొటో సోర్స్, PUNIT PARANJPE
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఇది మూడో అరెస్ట్.
సెప్టెంబర్ 5న శోవిక్ చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజర్ శామ్యూల్ మిరాందాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) బృందం అరెస్ట్ చేసింది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కానీ, రియాను డ్రగ్స్ లావాదేవీల కేసులో ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
అరెస్ట్ చేసిన అనంతరం రియాను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సుశాంత్ మృతి కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో మాదక ద్రవ్యాల వ్యాపారం విషయంలో కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఎన్‌సీబీ కేసు దర్యాప్తు ప్రారంభించింది.
ఈ కేసులో లింకులను జోడిస్తూ వెళ్లిన ఎన్‌సీబీ మొదట డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంతమందిని విచారించింది. కొందరిని అదుపులోకి తీసుకున్నారని కూడా సమాచారం.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తు మూడు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు చేస్తున్నాయి.
డబ్బుల లావాదేవీలను ఈడీ, మృతి కేసును సీబీఐ, మాదకద్రవ్యాలకు సంబంధించిన కసును ఎన్‌సీబీ దర్యాప్తు చేస్తున్నాయి.
దేవుడు మాతో ఉన్నాడు: సుశాత్ సోదరి
రియా అరెస్టుపై ట్వీట్ చేసిన సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి "దేవుడు మాతో ఉన్నాడు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన రియా లాయర్ సతీష్ మానషిందే "మూడు కేంద్ర ఏజెన్సీలు ఒక ఒంటరి మహిళను వేధిస్తున్నాయి. చాలా ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి, చివరకు ఆత్మహత్య చేసుకున్న ఒక డ్రగ్ అడిక్టును ప్రేమించిన ఒక మహిళను ఇబ్బంది పెడుతున్నాయి అన్నారు.
"రియా చక్రవర్తి నిజం బయటికొచ్చింది. మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలు జరిపేవారితో ఆమెకు సంబంధాలు ఉండేవని ఎన్‌సీబీ దర్యాప్తులో తేలింది. అందుకే ఆమెను అరెస్ట్ చేశారు" అని రియా అరెస్టుపై స్పందించిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- ‘అధ్యాపక వృత్తి నుంచి వచ్చి వెండితెరపై వెలిగిన నటుడు జయప్రకాశ్ రెడ్డి’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









