రియా చక్రవర్తి ఎవరు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోకి ఎలా వచ్చారు?

ఫొటో సోర్స్, @Tweet2Rhea
- రచయిత, మధుపాల్
- హోదా, బీబీసీ కోసం
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత నుంచీ నటి రియా చక్రవర్తి పేరు పతాక శీర్షికల్లో నిలిచింది. తాజాగా డ్రగ్స్ ఉదంతంలో ఆమెను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది.
పార్టీ అయినా, జిమ్ లేక ఏదైనా రెస్టారెంట్ అయినా సుశాంత్, రియా ఇద్దరూ తరచూ జంటగా కనిపించేవారు. తమ బంధం గురించి వాళ్లిద్దరూ బాహాటంగా ఎప్పుడూ ఏదీ చెప్పలేదు.
కానీ సుశాంత్ మరణించిన ఒక నెల తర్వాత రియా చక్రవర్తి మౌనం వీడారు. సోషల్ మీడియా పేజ్‌లో తనను సుశాంత గర్ల్ ఫ్రెండుగా చెప్పుకున్నారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా రియా నేను సుశాంత్ గర్ల్ ఫ్రెండునని చెప్పారు.
కానీ, ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్, ఆమెకు వ్యతిరేకంగా పట్నా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పట్నా పోలీసుల వివరాల ప్రకారం ఆయన తన ఎఫ్ఐఆర్‌లో రియా చక్రవర్తిపై డబ్బులు పిండుకోవడం, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం లాంటి ఆరోపణలు చేశారని తెలిపారు..
రియా చక్రవర్తి 1992 జులై 1న బెంగళూరు (కర్ణాటక)లో ఒక బెంగాలీ కుటుంబంలో పుట్టారు. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం అంతా అంబాలాలోని ఆర్మీ స్కూల్‌లోనే జరిగింది.
రియా చక్రవర్తి కెరియర్ 2009లో బుల్లితెరపై ప్రారంభమైంది. ఎంటీవీ రియాలిటీ షో ‘టీన్ డీవా’లో ఆమె మొదట కనిపించారు. ఆ షోలో ఆమె విజేత కాలేకపోయినా, రెండో స్థానంలో నిలిచారు.

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY INSTA
టీవీ షోకు హోస్ట్
ఆ తర్వాత ఆమె ఎంటీవీలో ‘ఎంటీవీ వాట్సప్’, ‘టిక్ టాక్ కాలేజ్ బీట్’, ‘ఎంటీవీ గాన్ ఇన్ 60’ లాంటి షోలు హోస్ట్ చేస్తూ కనిపించారు.
బుల్లితెరపై పనిచేసిన తర్వాత రియా చక్రవర్తి టాలీవుడ్‌కు వెళ్లారు. 2012లో నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన ‘తూనీగా తూనీగా’లో హీరోయిన్‌గా చేశారు. ఇది ఆమె తొలి చిత్రం. అది పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు దక్షిణాది అవకాశాలు రాలేదు.
తర్వాత 2013లో ఆమె మొదటి బాలీవుడ్ మూవీ ‘మేరే డాడ్ కీ మారుతి’లో నటించారు. ఈ సినిమాలో రియాతో సాకిబ్ సలీంతో కనిపించారు.
2014లో సోనాలీ కేబుల్ అనే సినిమాలో రియా అలీ ఫజల్‌కు జంటగా నటించారు. 2014 తర్వాత 2017లో ఆమెకు యశ్‌రాజ్ బ్యానర్ సినిమా బ్యాంక్ చోర్‌లో అవకాశం వచ్చింది. తర్వాత అదే ఏడాది హాఫ్ గర్ల్ ఫ్రెండ్, దుబారా: సీ యువర్ ఈవిల్‌లో చిన్న పాత్రలు చేశారు. 2018లో రియా చక్రవర్తికి జలేబీ సినిమాతో పెద్ద అవకాశం వచ్చింది.

ఫొటో సోర్స్, rhea chakraborty insta
నటిగా రియా నాలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కానీ ఆ సినిమాలన్నీ పెద్దగా ఆడలేదు. దాంతో, ఆమెకు పెద్ద పాపులారిటీ కూడా రాలేదు.
ప్రముఖ డైరెక్టర్ రూమీ జాఫ్రీ సినిమాలో రియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జంటగా కనిపించాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా టైటిల్ ఇప్పటివరకూ బయటికి రాలేదు.
రియా ఒక పార్టీలో సుశాంత్ సింగ్‌ను కలిశారని, ఇద్దరూ ఒకే జిమ్‌కు వెళ్లేవారని చెబుతున్నారు.
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. పోలీసులు దానిని ఆత్మహత్యగా చెప్పారు. కానీ, కారణం ఏంటో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు. ముంబయి పోలీసులు ఈ కేసులో రియా చక్రవర్తిని విచారించారు. ఇప్పుడు పట్నాలో ఎఫ్ఐఆర్ నమోదవడంతో పట్నా పోలీసులు కూడా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి:
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్బెర్ట్ ఎవరు
- ‘నాన్న పుర్రెను, ఎముకలను సూట్‌కేసుల్లో పెట్టుకుని వచ్చా’: ఉత్తర కొరియాలో యుద్ధ ఖైదీ కుమార్తె
- ఉత్తర కొరియా: సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన వ్యక్తే కరోనాను వెంట తెచ్చాడా?
- సోనూ పంజాబన్: ఈ మహిళకు వ్యభిచారం ‘ప్రజాసేవ’, 'కామం' ఒక భారీ మార్కెట్
- చైనా విద్యార్థులు తమను తామే కిడ్నాప్ చేసుకుంటున్నారు.. పోలీసులు అసలు కథ బయటపెట్టారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








