ప్రశాంత్ భూషణ్: ఒక రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు.. తీర్పుపై ప్రశాంత్ భూషణ్ ఏమన్నారంటే...

ఫొటో సోర్స్, @ PBHUSHAN1
కోర్టు ధిక్కారం కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఈ జరిమానా చెల్లించలేని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష లేదంటే మూడు సంవత్సరాలపాటు సుప్రీంకోర్టులు ప్రాక్టీసును నిలిపేసే అవకాశం ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ తన తీర్పులో వెల్లడించింది. సెప్టెంబర్ 15లోగా ఈ జరిమానాను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి చెల్లించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు విధించిన ఒక్క రూపాయి జరిమానాను ప్రశాంత్ భూషణ్ అంగీకరించారు. ఈ జరిమానాను చెల్లిస్తానని.. అయితే సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేస్తానని ఆయన మీడియాతో చెప్పారు.
‘‘నా న్యాయవాది, సీనియర్ సహచరుడు రాజీవ్ ధావన్.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నాకు ఒక రూపాయి విరాళం ఇచ్చారు. నేను కృతజ్ఞతతో దానిని స్వీకరించాను’’ అని అంతకుముందు ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సుప్రీంకోర్టు నిర్ణయాలు ఏ మీడియా అభిప్రాయాల ద్వారా ప్రభావితం కావని సుప్రీం బెంచ్ తన తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.
మరోవైపు జనవరి 2018లో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించడం కూడా సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. న్యాయమూర్తులు ఇలా చేసి ఉండాల్సింది కాదని పేర్కొంది.
భావప్రకటనా స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కానీ ఇతరుల హక్కులను కూడా గుర్తించాల్సి ఉంటుందని సుప్రీం అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయవాది ప్రశాంత్‌భూషన్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘నా ట్వీట్లు సుప్రీంకోర్టును అగౌరవపరిచే ఉద్దేశంతో చేయలేదు. దాని అద్భుత చరిత్ర నుంచి దారిమళ్లుతున్నదనే నా ఆక్రోశం వెల్లడించటానికి చేసిన ట్వీట్లు అవి’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ కేసు భావప్రకటనా స్వేచ్ఛను బలోపేతం చేస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత సాధికారమవుతుంది’’ అని చెప్పారు. ఇది కాలం భావప్రకటనా స్వేచ్ఛకు ఒక మలుపు వంటిదని.. చాలా మంది అన్యాయాలకు వ్యతిరేకంగా గళవం విప్పేలా ప్రోత్సహించినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తనకు మద్దతునిచ్చిన మాజీ న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలకు ప్రశాంత్ భూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటి ఈ కేసు
ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.
ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు.
దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని సుప్రీంకోర్టు తేల్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం వృధా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. 'అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు' అని తెలిపారు.
ఆగస్టు 25న జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శిక్షపై తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది. "తప్పు జరిగిందని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పడం వల్ల ఎలాంటి హాని ఉండదు'' అని జస్టిస్ మిశ్రా తీర్పును రిజర్వ్ చేస్తూ అన్నారు.
అయితే ప్రశాంత్ భూషణ్ కోర్టును గౌరవిస్తారని, కానీ గతలో పని చేసిన నలుగురు ప్రధాన న్యాయమూర్తుల గురించి ఆయనకు తనదైన అభిప్రాయం ఉందని ప్రశాంత్‌భూషణ్ న్యాయవాది రాజీవ్ ధావన్ అన్నారు.
మరోవైపు న్యాయవ్యవస్థతలో అవినీతి గురించి ఇప్పటి న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు అనేకసార్లు హెచ్చరించారని ప్రభుత్వ న్యాయవాది కె.కె. వేణుగోపాల్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తే ఆయన్ను హెచ్చరించి వదిలేయవచ్చని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
ఇటు కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా ప్రకటించడం, శిక్షను సోమవారం నాడు నిర్ధారించనుండంటంతో ఈ తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతర న్యాయమూర్తులకు 122 మంది న్యాయ విద్యార్థులు ఆదివారంనాడు లేఖ రాశారు.
న్యాయవ్యవస్థ, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు బదులు చెప్పాలి. తన పనితీరును మెరుగుపరుచుకోవడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వాలి. అంతేగానీ న్యాయవ్యవస్థపై విశ్వాసంతో, ప్రేమతో, అందరికీ న్యాయం జరగాలనే సదుద్దేశంతో అదే వ్యవస్థకు చెందిన వ్యక్తి ప్రశ్నలు సంధించినప్పుడు దాన్ని కోర్టు ధిక్కరణగా తీర్పునివ్వరాదు" అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.
"పాదర్శకత, జవాబుదారీతనం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, అవినీతిలాంటి అనేక అంశాలపై ఎన్నో ఏళ్లుగా లాయర్ ప్రశాంత్ భూషణ్ కోర్టులో పోరాడుతుండడం మేం చూశాం. దేశ నిర్మాణం, దేశ ప్రజల సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో ఆయన కృషిని న్యాయవాద బృందం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది."
ఆయన చేసిన రెండు ట్వీట్లు కూడా నోరు లేని, అట్టడుగు వర్గాల వేదనను ప్రతిబింబిస్తున్నాయని, అవి కోర్టు గౌరవాన్ని భంగపరిచేవిగా లేవని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సైనికుల తూర్పు లద్దాఖ్‌లో మళ్లీ ఘర్షణ
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మోదీ ‘మన్ కీ బాత్’కు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








