చెస్ ఒలంపియాడ్‌: ఫైనల్ రౌండ్‌ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా

కోనేరు హంపి

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత్ విజయం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణపతకం గెలుచుకుంది.

ఈ మేరకు చదరంగం అంతర్జాతీయ సమాఖ్య(ఫిడె) ప్రకటించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు వెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, రష్యాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్లు ఫిడె ప్రకటించింది.

మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కు చేరుకుని సంయుక్త విజేతలుగా నిలిచిన రష్యా, భారత్‌ జట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మేం చాంపియన్లం.. రష్యాకూ అభినందనలు అంటూ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశారు.

ద్రోణవల్లి హారిక

ఫొటో సోర్స్, Twitter/DronavalliHarika

ముగ్గురు తెలుగువాళ్లు..

విజేతగా నిలిచిన భారత జట్టులో విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, హరికృష్ణ, నిహాల్ సరీన్, దివ్య దేశ్ ముఖ్, విదిత్ సంతోష్ గుజరాతీ సభ్యులుగా ఉన్నారు.

వీరిలో హంపి, హారిక, హరికృష్ణలు తెలుగువారు.

జులై 24 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో 163 దేశాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి.

నిహాల్ సరీన్

ఫొటో సోర్స్, Twitter/nihalsarin

ఫొటో క్యాప్షన్, నిహాల్ సరీన్

తీవ్ర ఉత్కంఠ.. కనెక్షన్ కోల్పోవడంతో సమయానికి ముగించలేకపోయారు

ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో రెండో రౌండ్‌లో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు నిహాల్ సరీన్, దివ్య దేశ్‌ముఖ్‌లు ఇంటర్నెట్ కనెక్షన్ కోల్పోవడంతో నిర్ణీత సమయానికి ముగించలేకపోయారు.

హంపి ఆడుతున్నప్పుడూ ఇంటర్నెట్ సమస్య ఎదురైంది.

దీనిపై భారత బృందం అధికారికంగా ఫిడెకు అప్పీల్ చేసింది.

దీంతో పరిశీలనల అనంతరం ఫిడె అధ్యక్షుడు అర్కడీ వోర్కోవిచ్ భారత్, రష్యాలు రెండింటినీ సంయుక్త విజేతలుగా ప్రకటించాలని నిర్ణయించారు.

కోనేరు హంపి

ఫొటో సోర్స్, Getty Images

సెమీ ఫైనల్‌లో హంపి ప్రతిభ

ఇంతకుముందు శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో హంపి బృందం పోలండ్ జట్టుపై కీలక విజయం సాధించడంతో భారత్ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్ తొలుత టై అయినప్పటికీ టై బ్రేక్ గేమ్(ఆర్మగెడాన్)లో హంపి ఇంకా 48 సెకన్ల సమయం ఉండగానే విజయం సాధించడంతో భారత్ ఫైనల్ చేరింది.

అధికారిక చెస్‌ ఒలింపియాడ్‌ ఆరంభం అయినప్పటి నుంచి భారత్‌ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి.

కోనేరు హంపి
ఫొటో క్యాప్షన్, కోనేరు హంపి(పాత చిత్రం)

సెమీ ఫైనల్‌లోనూ అదే ఉత్కంఠ.. టై బ్రేక్ గేమ్‌లో విజయం

శనివారం జరిగిన సెమీఫైనల్‌లో భారత్ తొలి రౌండ్లో 2-4తో ఓడినా రెండో రౌండ్లో 4.5-1.5తో గెలిచి పోటీలో నిలిచింది.

విజేతను నిర్ణయించే ఆర్మగెడాన్‌ మ్యాచ్‌లో హంపి ప్రత్యర్థిని చిత్తు చేయడంతో భారత్‌ ముందంజ వేసింది.

తొలి రౌండ్‌ మొదటి పోరులో డుడా చేతిలో ఆనంద్‌... ఆ తర్వాత వొటాజెక్‌ చేతిలో విదిత్‌ గుజరాతి పరాజయం పాలవడంతో భారత్ 0-2తో వెనుకబడింది.

కానీ సొకోతో హంపి డ్రా చేసుకోవడంతో పాటు జానిక్‌పై నిహాల్‌ సరీన్‌ గెలవడంతో భారత్‌ మళ్లీ పుంజుకొన్నప్పటికీ స్లివికా చేతిలో దివ్య ఓడడం, సిఫ్కాతో గేమ్‌ను ద్రోణవల్లి హారిక డ్రా చేసుకోవడంతో తొలి రౌండ్‌ చేజారింది.

రెండో రౌండ్లో డుడాపై ఆనంద్‌ విజయం సాధించగా సిఫ్కాను హారిక ఓడించడంతో భారత్‌కు ఆధిక్యం దక్కింది.

ఆ తర్వాత జనిక్‌ చేతిలో ప్రజ్ఞానంద ఓడినా.. సోకోపై హంపి గెలిచారు. సిల్వికాతో గేమ్‌ను అవంతిక అగర్వాల్‌ డ్రా చేసుకోగా గాజెస్కీపై విదిత్‌ గెలవడంతో ఈ రౌండ్‌ను భారత్‌ 4.5-1.5తో గెలిచింది.

ఫలితాన్ని తేల్చే ఆర్మగెడాన్‌ (టైబ్రేక్‌)లో నల్లపావులతో ఆడుతూ హంపి సోకోపై గెలిచి భారత్‌ను ఫైనల్‌ చేర్చింది.

కరోనా నేపథ్యంలో తొలిసారి చెస్‌ ఒలింపియాడ్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.

ఆర్మగెడాన్ అంటే ఏమిటి

ఆర్మగెడాన్‌ (టైబ్రేక్‌)లో ఎవరు ఆడాలనేది టాస్‌‌పై ఆధారపడి ఉంటుంది.

ప్రతి జట్టులో పురుషులు, మహిళలు, జూనియర్‌ బాలురు, జూనియర్‌ బాలికల కేటగిరీలు ఉంటాయి. పోలెండ్‌తో సెమీస్‌ ఆర్మగెడాన్‌కు దారి తీసినప్పుడు టాస్‌ వేయగా మహిళలకు ఆడే అవకాశం వచ్చింది. అందులో హంపి, హారిక, వైశాలి ఉన్నారు. వారిలో హంపిని టై బ్రేక్‌కు పంపించారు.

ఇందులో టాస్‌ గెలిచిన హంపి నల్ల పావులను ఎంచుకుంది. ఆర్మగెడాన్‌లో తెల్ల పావులతో ఆడేవాళ్లకు 5 నిమిషాలు, నల్ల పావులతో ఆడే వాళ్లకు 4 నిమిషాలు కేటాయిస్తారు.

కానీ తెల్ల పావులతో ఆడిన వాళ్లు కచ్చితంగా గెలవాటి. నల్ల పావులతో ఆడేవాళ్లు డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఈ లాజిక్‌తో నల్ల పావులను ఎంచుకున్న హంపి విజయం సాధించి భారత్ జట్టును ఫైనల్‌కు చేర్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

విజయం సాధించిన భారత్ చెస్ బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం మిగతా అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు.

భారత్‌తో పాటు సంయుక్త విజేతగా నిలిచిన రష్యాకు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

చాంపియన్‌గా నిలిచిన భారత్ జట్టుకు, అందులో సభ్యులైన తెలుగు ఆటగాళ్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెండ్యాల హరికృష్ణలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభినందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.

భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)