రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టు ఊరట

సచిన్ పైలట్

ఫొటో సోర్స్, Getty Images

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌లో మొదలైన సంక్షోభం కొనసాగుతోంది. అయితే, సచిన్ పైలట్ వర్గంలోని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ రాజస్థాన్ స్పీకర్ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూదాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు 'యధాతథ స్థితి'ని కొనసాగించాలని ఆదేశించింది.

ఆ తర్వాత స్పీకర్ నోటీసులను నిలుపుదల చేశారు. దీంతో సచిన్ పైలెట్, ఆయనకు మద్దతిస్తున్న 18 మంది ఎమ్మెల్యేల సభ్యత్వానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకుండా పోయింది.

అంతకు ముందు హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తా ధర్మాసనం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కక్షిదారుగా చేయాలని చేయాలని చెప్పింది.

హైకోర్టు తీర్పు ఇవ్వడానికి 11 గంటల ముందు, ఈ కేసులో కేంద్రాన్ని కూడా ఒక పక్షంగా ఏర్పాటు చేయాలని సచిన్ పైలెట్, ఆయన వర్గం పిటిషన్ దాఖలు చేశారు. ఇది రాజ్యాంగ సవరణను సవాలు చేయడమేనని, ఈ కేసులో కేంద్రం కూడా ఒక పక్షంగా ఉండాలని వాదించారు.

ఈ కేసులో అడిషినల్ సొలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున కోర్టుకు హాజరవుతారని రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి న్యాయవాది ప్రతీక్ కస్లీవాల్ ఏఎన్ఐకు చెప్పారు.

రాహల్ గాంధీతో రణదీప్ సూర్జేవాలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాహల్ గాంధీతో రణదీప్ సూర్జేవాలా

సీనియర్ బీజేపీ ఎంపీ ఇదంతా చేస్తున్నారన్న సూర్జేవాలా

ఇప్పటివరకూ జరిగిన రాజకీయ ఘటనల గురించి సమాచారం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా జూలై 17 ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

"మీడియా ద్వారా కొన్ని ఆడియో టేపులు వెలుగుచూశాయి. అందులో ఉన్నది తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ నేతలు, సీనియర్ బీజేపీ నేతల మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్నారు. డబ్బుల లావాదేవీలు ఎలా జరుగుతున్నాయో దానిద్వారా స్పష్టం అవుతోంది" అన్నారు.

అయితే, "ఈ ఆడియో టేప్‌లో నిజమెంత, ఈ టేప్ ఎంత పాతది. అనేదానిపై స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎన్ఓజీ) దర్యాప్తు చేస్తుంది" అని సూర్జేవాలా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ వైరల్ ఆఢియో ఆధారంగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు. ముగ్గురూ కలిసి రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ సంభాషణలో స్పష్టంగా వినిపిస్తోందని ఆరోపించారు. "ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నల్ల డబ్బు ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు జరగాలి" అని సూర్జేవాలా అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన సచిన్ పైలట్‌కు సవాలు విసిరిన సూర్జేవాలా "ఆయన ముందుకు రావాలి, క్రయవిక్రయాల కోసం ఎమ్మెల్యేల జాబితాను తను బీజేపీకి ఇచ్చాడా, లేదా అని బహిరంగంగా స్పష్టం చేయాలి" అన్నారు.

ఈ దర్యాప్తు పూర్తయ్యేవరకూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు భన్వర్ లాల్, విశ్వేంద్ర సింగ్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నామని సూర్జేవాలా చెప్పారు. ఇద్దరికీ షోకాజ్ నోటీసులు కూడా పంపించామన్నారు.

"నన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారు. వైరల్ అయిన ఆడియో టేపులో నా పేరు కూడా వినిపిస్తోంది కాబట్టే నేను ఆ విషయం చెబుతున్నా" అని ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత చేతన్ డుడీ చెప్పారు.

సచిన్ పైలట్

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీలో చేరడం లేదన్న సచిన్

అంతకుముందు గురువారం రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఒక ప్రకటన చేస్తూ తాను బీజేపీలో చేరబోవడం లేదని ప్రకటించారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీతో కలిసి తానేమీ కుట్ర పన్నడం లేదనీ ఆయన స్పష్టం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను చాలా కష్టపడ్డానని చెప్పారు.రాజస్థాన్‌లో కొంతమంది నేతలు తను బీజేపీలో చేరుతున్నట్లు వదంతులు పుట్టిస్తున్నారు. కానీ అలా చేయబోవడం లేదని తెలిపారు. ఇటీవలి పరిణామాలపై ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన తనకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ మీద కోపం లేదని అన్నారు. "నాకు ఆయనపై కోపంగా లేదు. నేను ఎలాంటి ప్రత్యేక అధికారాలూ కోరుకోవడం లేదు. రాజస్థాన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చిందో వాటిని పూర్తి చేయాలనే మేమంతా కోరుతున్నాం. మేం వసుంధరా రాజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్రమ మైనింగ్ అంశాన్ని లేవనెత్తాం. అధికారంలోకి వచ్చాక అశోక్ గెహ్లాత్ ఆ అంశంలో ఏం చేయలేదు. బదులుగా ఆయన వసుంధరా దారిలోనే ముందుకెళ్తున్నారు" అన్నారు.

పదవుల నుంచి తొలగింపు

కాగా అసంతృప్త నేత సచిన్ పైలట్‌ను రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి కాంగ్రెస్ పార్టీ మంగళవారం తొలగించింది.

సచిన్ పైలట్ స్థానంలో ప్రస్తుత విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతాసరాను రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.

కాగా, గత ఆరు నెలల కాలం నుంచే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్రలు పన్నుతోందని అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. కానీ, బీజేపీ ప్రణాళికలేవీ ఫలించవని ఆయన అన్నారు.

‘‘తప్పనిసరి పరిస్థితుల్లో మేం మా ముగ్గురు సభ్యులను తొలగించాం. మేం ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఎవ్వరూ సంతోషంగా లేరు. కాంగ్రెస్ అధిష్టానం కూడా సంతోషంగా లేదు’’ అని గెహ్లాత్ తెలిపారు.

సచిన్ పైలట్, రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సచిన్ పైలట్, రాహుల్ గాంధీ (పాత చిత్రం)
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఈ వ్యవహారాలపై సచిన్ పైలట్ స్పందించారు.

మంగళవారం మధ్యాహ్నం 2.21 గంటలకు సచిన్ పైలట్ తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఒక ట్వీట్ చేశారు.

‘సత్యాన్ని ఇబ్బందులు పెట్టొచ్చు, కానీ ఓడించలేరు’ అని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పైలట్ ఎక్కడున్నారు?

తిరుగుబాటు చేసిన రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌ను బుజ్జగించే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించడం లేదు.

పార్టీ కార్యకలాపాలకు ఆయన కూడా దూరంగా ఉన్నారు.

ఆయన తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి గురుగ్రామ్‌లో ఒక హోటల్లో ఉన్నట్టు చెబుతున్నారు.

మంగళవారం జరగబోయే రెండో సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు సచిన్ పైలట్‌ను కోరారు. కానీ సచిన్ దానికి కూడా వెళ్లలేదు.

జైపూర్‌లోని హోటల్ ఫెయిర్ మౌంట్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాలేదు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇంఛార్జ్ అవినాష్ పాండే, పార్టీ ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, అజయ్ మాకన్ కూడా ఉన్నారు.

శాసనసభా పక్ష సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు అందరూ సచిన్ పైలెట్‌ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

‘రాహుల్ గాంధీని కలవాలనుకోవడం లేదు’

తనకు రాహుల్ గాంధీని కలవాలనే ఆలోచనలు ఏమాత్రం లేవని సచిన్ పైలెట్ సోమవారం చెప్పారు. ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన పార్టీ బుజ్జగింపు ప్రయత్నాలకు తను దూరంగా ఉన్నానని చెప్పారు.

"మేం సచిన్ పైలెట్‌కు మరో అవకాశం ఇస్తున్నాం. ఆయన పార్టీ సమావేశంలోకి రావాలని చెబుతున్నాం. ఆయన వస్తారని, రాజస్థాన్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తారని మేం ఆశిస్తున్నాం" అని మంగళవారం ఉదయం శాసనసభా పక్ష సమావేశంలో మొదట రాజస్థాన్ కాంగ్రెస్ ఇంచార్జ్ అవినాశ్ పాండే అన్నారు.

సచిన్ పైలట్, అశోక్ గెహ్లాత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సచిన్ పైలట్, అశోక్ గెహ్లాత్

ఇప్పటివరకు ఏం జరిగింది?

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది.

ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌పై ఆగ్రహంగా ఉన్న డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు.

ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని తన ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఇంట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభా పక్షం సమావేశం ఉందని, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఉండడం తప్పనిసరి అని ఆదేశించింది.

కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. కాంగ్రెస్ తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

ముఖ్యమంత్రి కుర్చీ కోసం గెహ్లాత్ సచిన్‌ల మధ్య ఘర్షణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 2018లో రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తర్వాత సీఎం పదవి కోసం ఈ ఇద్దరు నేతలు పోటీపడ్డారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అశోక్‌ గెహ్లాత్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో, సచిన్‌ పైలట్‌ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సచిన్‌ పైలట్‌ ప్రస్తుతం ప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అయితే సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య అంతర్గత వైరం చాలా రోజులుగా కొనసాగుతోంది.

ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్పెషల్ ఆపరేషన్‌ గ్రూప్‌ పోలీసులు ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసినప్పటి నుండి వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

రాజస్థాన్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

వాస్తవానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎస్‌ఓజీ పోలీసులు సీఎం అశోక్ గెహ్లాత్, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్, పార్టీ చీఫ్‌ విప్‌తోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి నోటీసులు పంపారు.

ఈ నోటీసులు చాలా చిన్న విషయమని, కానీ మీడియాలో దీనికి భిన్నమైన అర్ధాలు తీస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాజస్థాన్‌లో నంబర్‌ గేమ్‌

రాజస్థాన్‌ శాసనసభలో కాంగ్రెస్‌కు 107మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో బీఎస్పీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరుకాక 12-13మంది స్వతంత్ర ఎమ్మెల్యేల కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.

2018 ఎన్నికల్లో బీజేపీ 73స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ కూటమిలో బీజేపీకన్నా 48 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. సంఖ్యాపరంగా గెహ్లాత్‌ ప్రభుత్వం పటిష్టంగానే ఉంది.

రాజస్థాన్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, FACEBOOK/SACHIN PILOT

ఇప్పుడు సచిన్‌ పైలట్‌ 25మందిని తనతో తీసుకెళ్లినా ప్రభుత్వానికి ఎలా ఢోకా లేదన్నారు జైపూర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ నారాయణ్ బారెత్‌. "రాజస్థాన్‌లో పరిస్థితి మధ్యప్రదేశ్‌లో లాగా లేదు. ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సచిన్ పైలట్ ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని కూల్చలేరు" అని ఆయన అన్నారు.

మరోవైపు సచిన్‌ పైలట్‌ బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. "సచిన్‌ పైలట్‌ బీజేపీతో సన్నిహితంగా ఉంటే ఉండొచ్చు. కానీ బీజేపీ నుంచి ఆయన ఏం కోరుకుంటారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కోరిక. కానీ ఆయనకు అంత సంఖ్యాబలం లేదు'' అన్నారు నారాయణ్ బారెత్‌.

రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయ సంక్షోభం ఎక్కువగా కనిపిస్తోంది. సచిన్‌ పైలట్‌ తన స్థానం ఏంటో నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నంగా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు.

అశోక్ గెహ్లాత్

ఫొటో సోర్స్, Alamy

ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందా?

ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం సహా పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

ఈ విచారణలో భాగంగా ఇద్దరు స్థానిక నేతలను అరెస్టు చేశారు. ఎస్‌ఓజీ చీఫ్ అశోక్‌ రాథోడ్‌ ఈ అరెస్టులను ధృవీకరించారు. "దర్యాప్తు కొనసాగుతోంది, మరికొందరిని ప్రశ్నించాల్సి ఉంది." అని ఆయన బీబీసీతో అన్నారు.

అయితే పోలీసులు అరెస్టు చేసిన వారికి బీజేపీతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లే రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)