‘‘మోదీ జీ.. అది నా పావురం.. వెనక్కు ఇప్పించండి’’ - పాకిస్తాన్ గ్రామస్తుడి వినతి

ఫొటో సోర్స్, Ani
పాకిస్తాన్ సరిహద్దులో భారత అధికారులు పట్టుకున్న పావురం తనదేనని.. దానిని తనకు వెనక్కు ఇవ్వాలని పాకిస్తాన్‌కి చెందిన ఓ గ్రామస్తుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
జమ్మూకశ్మీర్‌లో పాక్ సరిహద్దు కంచె వద్ద స్థానికులు సోమవారం నాడు ఈ పావురాన్ని బంధించి పోలీసులకు అప్పగించారు.
ఆ పావురాన్ని పాకిస్తాన్ నుంచి గూఢచర్యం కోసం ప్రయోగించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పావురం కాలికి చుట్టిన ఉంగరంలో ఒక రహస్య సందేశం ఉందని దానిని చేధించే ప్రయత్నాన్ని చేస్తున్నామని అధికారులు చెప్పారు.
అయితే.. సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోని పాకిస్తాన్ గ్రామంలో నివసించే హబీబుల్లా అనే వ్యక్తి.. ఆ పావురం తనదేనని.. రంజాన్ పండగ సందర్భంగా పావురాలని ఎగురవేశానని చెబుతున్నారు.
ఆ పావురం కాలికి చుట్టిన ఉంగరంలో ఉన్నది అది రహస్య సందేశం కాదని, తన మొబైల్ నెంబర్ అని హబీబుల్లా పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆయన దగ్గర 12 పావురాలు ఉన్నట్లు పాకిస్తాన్ వార్తా పత్రిక డాన్ ఒక కథనంలో చెప్పింది.
పావురం శాంతికి సంకేతమని, భారతదేశం అమాయక పక్షులని హింసించడం మానాలని హబీబుల్లా ‘డాన్’ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు.
భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది. సాధారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటాయి
పాకిస్తాన్ నుంచి వచ్చిన పావురం భారతీయ అధికారులని ఇబ్బందులకు గురి చేసిన సంఘటన ఇదే మొదటిది కాదు.
2015 మే నెలలో ఒక తెల్లని పావురాన్ని పోలీసులు పట్టుకున్నారు.
2016 అక్టోబరులో భారత ప్రధానమంత్రిని బెదిరిస్తూ రాసిన లేఖతో మరో పావురాన్ని పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- తేమ నిండిన ఎండలు ఎంత ప్రమాదకరం? ఎవరికి ప్రాణాంతకం?
- వేసవి ఎండలు: భారతదేశమే భూగోళం మీద అత్యంత వేడి ప్రాంతమా?
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
- ప్రకృతి సంక్షోభం: తగ్గిపోతున్న మిడతలు, సీతాకోకచిలుకలు.. ‘కీటకాల అంతం’ ఊహించడమే కష్టం అంటున్న పరిశోధకులు
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్లో ఆమె ఇంటికి క్యూ కట్టిన రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులు
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








