హైదరాబాద్: మణిపూర్ విద్యార్థులపై వివక్ష.. సూపర్ మార్కెట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఇద్దరు మణిపురి విద్యార్థులను బుధవారం వనస్థలిపురం దగ్గర ఒక సూపర్ మార్కెట్లోకి అనుమతించకపోవడం వివాదాస్పదం అయ్యింది.
తమ ముఖాలు భిన్నంగా ఉన్నందుకే తమపై వివక్ష చూపిస్తున్నారా? అని సదరు విద్యార్థులు అక్కడున్న సెక్యూరిటీ గార్డును ప్రశ్నించారు. అయితే, తమకు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాము అడ్డుకున్నామని, తమ మేనేజర్‌తో మాట్లాడుకోవాలని సదరు సెక్యూరిటీ గార్డు వారికి సూచించారు.
ఈ వ్యవహారాన్ని ఆ విద్యార్థులు వీడియోలు తీయగా.. జోనాహ్ త్రిచావో అనే వ్యక్తి ఈ వీడియోలను ట్విటర్లో పెట్టారు.
ఆ వీడియోలో సెక్యూరిటీ గార్డు పక్కకు వెళ్లిపోమంటే, వీరు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించడం కనిపిస్తోంది.
పక్కనే ఉన్న వ్యక్తి జోక్యం చేసుకుని ఏం జరిగిందని ప్రశ్నిస్తారు.
వాళ్లకు లోపలకి అనుమతి లేదనీ, వాళ్లను వెళ్లిపోమని చెప్పాలంటూ ఆ మూడో వ్యక్తిని కోరారు సెక్యూరిటీ గార్డు.
మీరెక్కడి నుంచి వచ్చారని ఆ వ్యక్తి అడగ్గా.. తాము మణిపూర్ నుంచి వచ్చామని, పక్కనే వనస్థలిపురంలో నివశిస్తుంటామని వెల్లడించారు. ఐడీ కార్డులు కూడా ఉన్నాయని చెప్పగా.. ఉంటే తీసుకురండి అని సెక్యూరిటీ గార్డు అడుగుతున్నారు.
అనంతరం పక్కకు పిలిచి "(కరోనా వైరస్) పరిస్థితి మీకు తెలుసు కదా’’ అని సెక్యూరిటీ గార్డు అనగా.. ‘‘పరిస్థితి మాకు తెలుసు కానీ మేమేమీ వైరస్ సోకిన వాళ్లం కాదు’’ అని విద్యార్థులు బదులిచ్చారు.
తమ స్టోర్ మనేజర్ భోజనం చేసేందుకు వెళ్లారని, ఆయన వచ్చాక మాట్లాడుకోవాలనీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఇండియా అంటే ఇండియానే కదా’’ అంటూ వారు తమ ఆధార్ కార్డులను చూపించారు. తమను లోనికి ఎందుకు అనుమతించరని ప్రశ్నించారు.
కాగా, అప్పటి వరకూ హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఆ సెక్యూరిటీ గార్డు తెలుగులో మాట్లాడాలని విద్యార్థులను కోరారు. ఒక విద్యార్థి ‘నాతో చెప్పు’ అని తెలుగులో మాట్లాడగా, మరో విద్యార్థి ఇండియాలో అందరూ తెలుగులో మాట్లాడరు కదా అని హిందీలో అన్నారు.
"అరే భయ్యా.. నీకు అర్థమవుతోందా? మా బాస్ వచ్చాక మాట్లాడుకో. మాతో వాదించొద్దు. మాకు చెప్పింది మేం చేస్తున్నాం'' అని చెప్పారు గార్డు.
మేనేజర్ వచ్చేందుకు ఎంత సమయం పడుతుందని అడగ్గా.. ఒక గంట పడుతుందని, ఆయన వచ్చాక రావాలని, ఆయనతో మాట్లాడాలని గార్డు సూచించారు.
‘‘మేం కొన్ని సరుకులు కొనుక్కోవాలంతే. మా ముఖం తేడాగా ఉందని (మమ్మల్ని లోనికి పంపించట్లేదా?)’’ అని ఒక విద్యార్థి అన్నారు.
దీంతో షాపుకు వచ్చే కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని, పక్కకు వెళ్లాలని గార్డు వారితో అన్నారు.

అదే సందర్భంలో, మరో వీడియలో సెక్యూరిటీ గార్డు మిగతా వారిని స్టోర్‌లోకి అనుమతిస్తున్నారు. లోపలి నుంచి వచ్చే వారి బిల్లులు చూస్తున్నారు. స్టోర్ మేనేజర్ భోజనానికి వెళ్లారనీ, వచ్చే వరకూ గంట పడుతుందనీ అప్పటి వరకూ ఆగాలనీ వారు ఈ ఇద్దరికీ సూచించారు.
స్టోర్ దగ్గర ఆపిన ఆ ఇద్దరూ పాతికేళ్ల ఆన్గమ్ వెపన్, 22 ఏళ్ల కాయ్ హాఓకిప్.
కూరగాయలు, కిరాణా సరుకులు కొనడానికి ఆ మార్కెట్లోకి వెళ్లారు.
"మేం ఇక్కడ ఏడాదిగా ఉంటున్నాం. మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వడం లేదో మాకర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే మేం చూడ్డానికి ఆసియా వాళ్లలాగా ఉన్నందుకే మమ్మల్ని రానివ్వడం లేదని భావిస్తున్నాం" అన్నారు ఆన్గమ్.
ఆన్గమ్, అతని మిత్రుడు కాయ్ తమ స్నేహితుడైన జోనాహ్‌కి విషయం చెప్పడంతో ఆయన వీటిని ట్వీట్ చేశారు.
"వాళ్లకు సున్నితత్వం, అవగాహన లేకపోవడం వల్ల ఇది జరిగింది. మేం చూడ్డానికి వేరేలా ఉన్నాం కాబట్టే మమ్మల్ని అవమానకరంగా వేరుగా చూశారు. ప్రజలకు దీనిపై అవగాహన కలిగించాల్సి ఉంది" అన్నారు జోనా.
అలాగే, సొంత దేశంలోనే ఈశాన్య భారతీయులు భద్రంగా ఉండలేకపోతున్నారని, వారు జాత్యాహంకారానికి గురవుతున్నారని పలు ట్వీట్లు చేశారు.
భారతీయ పౌరుడిగా నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు సరిపోదా? అని కూడా ఆయన ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
తన ట్వీట్లలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును, హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. తమ మిత్రుల తరపున ఈ అంశాన్ని తాను రిపోర్ట్ చేస్తున్నానని రాచకొండ పోలీసు కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించి వివరాలు అడిగారు.
తెలంగాణ ప్రభుత్వ పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కూడా దీనిపై స్పందించి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరం అన్నారు.
"ఈ సమయంలో ఈశాన్య భారతానికి చెందిన మన సోదరీ, సోదరులకు సహకారంగా మనం ముందుకు రావాలి" అని ఆయన కోరారు.

స్టోర్ మేనేజర్ మీదా, ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మీదా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషన్ మహేశ్ భగవత్ తెలిపారు.
"అనుమానితులందరూ కస్టడీలో ఉన్నవారు. ఇలాంటి ఘటనలను పోలీసులు సహించరు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
తప్పుడు ఉద్దేశంతో రెచ్చగొట్టడం, శత్రుత్వాన్ని పెంచడం, అక్రమంగా మనుషులను నిలువరించడం, చట్టాన్ని పాటించకపోవడం వంటి ఐపీసీ సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు.
స్టార్ మార్కెట్ ఈ సంఘంటనపై ఇంకా స్పందించలేదు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
- కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?
- కరోనావైరస్: లాక్డౌన్లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కరోనావైరస్ లాక్డౌన్ ఎఫెక్ట్: భూమి కంపించటం తగ్గిపోయింది
- వుహాన్‌లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- దిల్లీ హింస- అద్దాలు పగిలిన రాత్రి
- కరోనావైరస్ వ్యాక్సీన్ కనిపెట్టినా... అది పేద దేశాలకు అందుతుందా?
- కరోనావైరస్ మీద విజయం సాధించామన్న చైనా మాటలను నమ్మవచ్చా?
- కరోనావైరస్ లాక్డౌన్ భారతదేశంలో ఆహార కొరతకు దారి తీస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









