కరోనావైరస్: కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడగలదా?

- రచయిత, అరుణోదయ్ ముఖర్జీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహమ్మద్ ఆలమ్... దేశ రాజధాని దిల్లీలో పట్టెడన్నం కోసం భారీ క్యూలో నిలుచున్న వేలాది మంది కూలీల్లో ఒకరు.
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత ఆలమ్ పని చేసే కర్మాగారం మూతపడింది.
రోజు కూలీగా పని చేసే ఆయనకు మరో దారి లేక ఆకలి తీర్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఆహార కేంద్రానికి రావాల్సి వచ్చింది.
“ఎలా బతకాలో తెలియడం లేదు. నా కుటుంబాన్ని పోషించాలంటే అప్పు చేయడం తప్ప మరో దారి లేదు” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆలమ్.
నీరజ్ కుమార్... ఓ వలస కూలీ. ఇప్పుడు దిల్లీ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే చాలా మంది వలస కూలీల్లానే ఇంటి బాట పట్టారు.
అయితే రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోవడంతో వెళ్లిపోవాలనుకున్న వాళ్లు మరో దారి లేక కాలి నడకనే బయల్దేరారు.
మేం మాట్లాడే సమయానికే కుమార్ తన భార్య, పదేళ్ల కుమార్తెతో కలిసి సుమారు 40 కిలోమీటర్ల దూరం కాలి నడకనే ప్రయాణించారు.
“ఇక్కడ మాకు ఉపాధి లేదు. అందుకే వెళ్లిపోతున్నాం. బస్సుల్లేవు, మా ఊరు చేరుకోవాలంటే మేం మరో 260 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.


సుమారు రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ
అయితే ఆలమ్, కుమార్ వంటి అసంఘటిత కార్మికులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం సుమారు లక్షా 75 వేల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది.
దేశ కార్మిక శక్తిలో సుమారు 94 శాతం మందికి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అసంఘటిత రంగం ద్వారానే ఉపాధి లభిస్తోంది.
కానీ లాక్ డౌన్ కారణంగా అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా రాత్రికి రాత్రే వేలాది మంది నిరుద్యోగులయ్యారు.
“ఏ ఒక్కర్నీ ఆకలితో ఉండనియ్యం” ఇది ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్న సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాట.
కానీ ఊహించని లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా చితికిపోతోంది. వ్యాపారాలు మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఉత్పత్తి పడిపోతోంది.
నిజానికి ఈ సంక్షోభానికి ముందు భారత వృద్ధి రేటు అంతో ఇంతో బాగానే ఉండేది. ఒకానొక సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును నమోదు చేసింది కూడా.
అయితే గత ఏడాది మాత్రం 4.7% కి పడిపోయింది. వరుసగా ఆరేళ్ల తర్వాత అతి తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది అప్పుడే.
గత ఏడాది దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని 8 ప్రధాన పారిశ్రామికరంగాల ఉత్పత్తి 5.2శాతానికి పడిపోయింది.
గడిచిన 14 ఏళ్లలో అదే అత్యల్పం. 2016లో జరిగిన నోట్ల రద్దు తర్వాత చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సర్కారు సాయం సరిపోతోందా ?
ఈ కరోనావైరస్ సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టయ్యిందని నిపుణులు చెబుతున్నారు.
ఓ వైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూనే మరోవైపు ఆర్థిక పరిస్థితి చితికిపోకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
“ఉచితంగా రేషన్ ఇస్తున్నారు సరే.. కానీ పేదలు వాటిని ఎలా అందుకోగల్గుతారు? ఈ విషయంలో కేంద్రం సైన్యాన్ని, రాష్ట్ర విభాగాలను వినియోగించుకొని స్వయంగా పేదలకు అందించే ఏర్పాటు చెయ్యాలి” అని ఆర్థిక నిపుణులు అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
వేలాది మంది వలస కూలీలు తమ ఊళ్లకు వేల కిలోమీటర్ల దూరాలలో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితుల్లో నగదు, నిత్యావసరాలు నేరుగా వారికి అందజేయడం ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇది కేవలం వలస కూలీల సమస్య మాత్రమే కాదు. లాక్ డౌన్ కారణంగా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. దేశ జీడీపీలో సుమారు 2లక్షల51వేల కోట్ల రూపాయల(265 బిలియన్ డాలర్లు) ఆదాయానికి సేద్యమే ఆధారం.

ఫొటో సోర్స్, AFP
పీకల్లోతు కష్టాల్లో అన్నదాతలు
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు ఏప్రిల్ నెలలో ముందస్తు సాయం కింద 2వేల రూపాయల అందజేయనున్నట్లు ప్రకటించింది. అది కూడా ఏటా ఇచ్చే 6వేల రూపాయల సాయంలో భాగంగానే.
“ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితులు లేవు. ఫలితంగా నగరాలకు ఉత్పత్తులు నిలిచిపోతాయి. ధరలు పెరిగిపోతాయి. అందువల్ల రైతులకు ఇచ్చే సాయం ఏ మాత్రం సరిపోదు” ఆర్థిక నిపుణులు అని అరుణ్ కుమార్ అన్నారు.
సరిగ్గా కొత్త పంట చేతికొచ్చే సమాయానికి కరోనా మహమ్మారి పంజా విసిరింది. దీంతో ఆ పంటను ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పండే పంటను నగరాలకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి పెద్ద సవాలు కానుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిత్యావసరాలు సరఫరా చేసే వ్యవస్థ సవ్యంగా పని చేయని పక్షంలో భారీ ఎత్తున ఆహారం వృథా కావడమే కాదు... అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతారు.
దేశంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లలో ఎంతో కొంత ఆదాయాన్ని కోల్పోయే వారు కొందరైతే పూర్తిగా ఉపాధి కోల్పోయే మరెంతో మంది ఉండొచ్చని ఆర్థిక నిపుణులు వివేక్ కౌల్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP
ఇతర పారిశ్రామిక రంగాలది అదే పరిస్థితి
నిన్నటి వరకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నదేశీయ వైమానిక రంగం కూడా లాక్ డౌన్ దెబ్బకు కుదేలవుతోంది. దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
దేశీయ విమాన రంగానికి ఈ ఏడాది సుమారు 30వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని సెంటర్ ఫర్ ఏసియా ఫసిఫిక్ ఏవియేషన్(సీఏపీఏ) అంచనావేస్తోంది.
దాని పర్యవసానం ఆతిథ్య, పర్యాటక పరిశ్రమపైనా పడుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న గొలుసు కట్టు హోటళ్లు రానున్న కొన్ని నెలల పాటు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయి. భారీ ఎత్తున మూత పడే ప్రమాదం కూడా ఉంది.
దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటోమొబైల్ రంగం కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా ఈ ఏడాది సుమారు రూ.15,283కోట్లు(2బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ సరిపోతుందా?
అమెరికా, చైనా, సింగపూర్ వంటి దేశాలతో పోల్చితే ఇది సముద్రంలో నీటి బొట్టంత అంటున్నారు నిపుణులు. కనీ వినీ ఎరుగని ఈ సంక్షోభ సమయంలో మున్ముందు మరింత భారీ ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.


- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: మేడిన్ ఆంధ్రప్రదేశ్ టెస్టింగ్ కిట్లు.. పీపీఈలు, వెంటిలేటర్లు, మాస్కుల్ని కూడా ఉత్పత్తి చేస్తున్న ఏపీ
- కరోనావైరస్: లాక్డౌన్లో ఉపాధి లేక, ఆహారం అందక ట్రాన్స్జెండర్ల ఇబ్బందులు
- కౌన్సిల్ హౌజ్‌లో బాంబులు వేసేందుకు ఆనాడు భగత్ సింగ్ అనుసరించిన వ్యూహం ఇదే...
- కరోనా వైరస్‌పై వియత్నాంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా పోరాడుతోంది?
- కరోనావైరస్-అమెరికా: బాధితుల్లో నల్లజాతీయులు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటి?
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









